8, జులై 2011, శుక్రవారం

ఈ పాటకు ట్యూన్ తెలుసా? (శ్రీశ్రీ) రుద్రవీణ

ఈ పాటకు ట్యూన్ తెలుసా? (నేను సైతం,)



రుద్రవీణ 
నేను సైతం విశ్వ వీణకు తంతినై మూర్చనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్హి మోస్తాను
నేను సైతం ప్రపంచాబ్జ్యపు తెల్ల రేఖై పల్లవిస్తాను
నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపేను
సకల జగతిని శాశ్వతముగా వసంతం వరియించు దాకా
ప్రతీ మనిషికి జీవనంలో నందనము వికసించుదాకా
పాత పాటను పాడలేను
కొత్త బాటను వీడిపోను
పాత పాటను పాడలేను
కొత్త బాటను వీడిపోను
నేను సైతం నేను సైతం నేను సైతం
నేను సైతం నేను సైతం నేను సైతం


నేను సైతం – రుద్రవీణ (పూర్తి పాట)


ఓంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది
దుఖానికి తలవంచితే తెలివికింక విలువేది
మంచయినా చెడ్డయినా పంచుకోను నేలేనా
ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా
ఎవ్వరితో ఏమాత్రం  పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమయిన చింతలేమిటండి 
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
గుండెల్లో సుడి తిరిగే కలత కధలు
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది   
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని
అయిన వాళ్ళు వెలి వేస్తే అయినా నే ఏకాకిని
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని
అయిన వాళ్ళు వెలి వేస్తే అయినా నే ఏకాకిని
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
పాత పాట మారాలని చెప్పటమే నా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచ వన్నెల విరి తోట
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచ వన్నెల విరి తోట


బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది 
ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శ్రుతిలో ఒకడు
కంటి నీటి కుంభవ్రుష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచనకు మోడై గోడు పెట్టు వాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక వున్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ గానం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగినట్టే కోకిల
కళ్ళు వున్న కబోధిలా చెవులున్న బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది 
అసహాయతలో దడ దడ లాడే హృదయ మృదంగధ్వానం
నదుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
యెడారి బతుకుల నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
దిక్కు మొక్కు తెలియని దీనుల యదార్థ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశ్రుతి సరిచెయ్యాలి
జన గీతిని వద్దనుకుంటూ నాకు నేనే హద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను
నేను సైతం విశ్వ వీణకు తంతినై మూర్చనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్హి మోస్తాను
నేను సైతం ప్రపంచాబ్జ్యపు తెల్ల రేఖై పల్లవిస్తాను
నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపేను
సకల జగతిని శాశ్వతముగా వసంతం వరియించు దాకా
ప్రతీ మనిషికి జీవనంలో నందనము వికసించుదాకా
పాత పాటను పాడలేను
కొత్త బాటను వీడిపోను
నేను సైతం నేను సైతం నేను సైతం
నేను సైతం నేను సైతం నేను సైతంఓంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం

మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది
దుఖానికి తలవంచితే తెలివికింక విలువేది
మంచయినా చెడ్డయినా పంచుకోను నేలేనా
ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా
ఎవ్వరితో ఏమాత్రం  పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమయిన చింతలేమిటండి 
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
గుండెల్లో సుడి తిరిగే కలత కధలు
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది   
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని
అయిన వాళ్ళు వెలి వేస్తే అయినా నే ఏకాకిని
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని
అయిన వాళ్ళు వెలి వేస్తే అయినా నే ఏకాకిని
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
పాత పాట మారాలని చెప్పటమే నా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచ వన్నెల విరి తోట
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచ వన్నెల విరి తోట

బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది 
ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శ్రుతిలో ఒకడు
కంటి నీటి కుంభవ్రుష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచనకు మోడై గోడు పెట్టు వాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక వున్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ గానం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగినట్టే కోకిల
కళ్ళు వున్న కబోధిలా చెవులున్న బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది
చెప్పాలని వుంది గొంతు విప్పాలని వుంది 
అసహాయతలో దడ దడ లాడే హృదయ మృదంగధ్వానం
నదుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
యెడారి బతుకుల నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
దిక్కు మొక్కు తెలియని దీనుల యదార్థ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశ్రుతి సరిచెయ్యాలి
జన గీతిని వద్దనుకుంటూ నాకు నేనే హద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను
నేను సైతం విశ్వ వీణకు తంతినై మూర్చనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్హి మోస్తాను
నేను సైతం ప్రపంచాబ్జ్యపు తెల్ల రేఖై పల్లవిస్తాను
నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపేను
సకల జగతిని శాశ్వతముగా వసంతం వరియించు దాకా
ప్రతీ మనిషికి జీవనంలో నందనము వికసించుదాకా
పాత పాటను పాడలేను
కొత్త బాటను వీడిపోను
నేను సైతం నేను సైతం నేను సైతం
నేను సైతం నేను సైతం నేను సైతం

రఘు చాలా బాగా విశిదీకరించాడు(వివరాలకు క్రింది లింక్ క్లిక్ చెయ్యండి )

http://ammaassociation.blogspot.com/2010/02/blog-post_6309.html



జయభేరి(శ్రీ శ్రీ )



నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వ వృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!

నెను సైతం
భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను.

ఎండ కాలం మండినప్పుడు
గబ్బిలం వలె
క్రాగి పోలేదా!
వాన కాలం ముసరి రాగా
నిలువు నిలువున
నీరు కాలేదా?
శీత కాలం కోత పెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేక లేశానే!

నే నొకణ్ణీ
నిల్చిపోతే-
చండ్ర గాడ్పులు, వాన మబ్బులు, మంచు సోనలు
భూమి మీదా
భుగ్న మౌతాయి!
నింగినుండీ తొంగి చూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!
పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలూ విశీర్ణిల్లీ,
మహా ప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!

నే నొక్కణ్ణి ధాత్రినిండా
నిండి పోయీ,
నా కుహూరత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహుర్తా లాగమిస్తాయి!

నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్ల రేకై పల్లవిస్తాను!
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను!
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!
శ్రీ శ్రీ - జూన్ 2, 1933

ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి, మరో ప్రపంచం మీదే 
http://te.wikisource.org/wiki/%E0%B0

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి