భగవంతుడి నామానికి అంత శక్తి వుందా.? అని అడిగితే ఉందని వాగ్గేయకారుడు త్యాగరాజు అన్నారు. "రామ"లోని "మ" అనే అక్షరం పంచాక్షరి మంత్రం. ఆ అక్షరానికి "రా" అనేది చేరినప్పుడు, అది ఒక దివ్యమైనటువంటి మంత్రమవుతుంది. ఆ విషయాన్ని గమనించినందుకే శ్రీరామునికి ఆ పేరు పెట్టారు. ఆ పేరుని ఉచ్చరించటమే మంత్రం పఠించటమే.
అలా మంత్రం పఠించి, దానివల్ల కలిగే సత్ఫలితాలను పొందటం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి వారి వారి పిల్లలకు రాముడని, కృష్ణుడని పేర్లు పెడతారు. ఆ పేర్లతో పిల్లను పిలుచుకుంటూ, భగవన్నామస్మరణ వల్ల కలిగే లాభాన్ని పొందుతారు. ఈ నమ్మకంతోనే దేవుడి పేర్లు పిల్లలకు పెట్టే ఆచారం ఏర్పడిందని పురోహితులు చెబుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి