8, జులై 2011, శుక్రవారం

ఈ పాటకు ట్యూన్ తెలుసా? (సిరివెన్నెల) పట్టుదల

ఈ పాటకు ట్యూన్ తెలుసా? (ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి)
సిరివెన్నెల(http://ammanaresh.blog.com/chandrabose/sir/)


||ప|| |అతడు|
       ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
       ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
       విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం
       అప్పుడే నీ జయం నిశ్చయం రా..
                              || ఎప్పుడూ ||
.
||చ|| |అతడు|
       నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా,

       నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా
       సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల మొప్పముందు చిన్నదేనురా

       పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసురసంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా
       గుటకపడని అగ్గిఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుంది రా
       నిశా విలాసమెంత సేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా
       రగులుతున్న గుండెకూడా సూర్యగోళమంటిదేరా
                                  || ఎప్పుడూ ||.
||చ|| |అతడు|
       నొప్పి లేని నిముషమేది జననమైనా మరణమైనా, జీవితాన అడుగు అడుగునా
       నీరసించి నిలిచిపోతే నిముషమైనా నీది కాదు  బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
       దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా,
       దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
       ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా
       నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా,
       నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
       ఆయువంటు ఉన్నవరకు చావుకూడ నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా
                                                                                   || ఎప్పుడూ ||


సినిమా లోని పాట 
చిత్రం : పట్టుదల (1992) రచన : సిరివెన్నెల సంగీతం : ఇళయరాజా గానం : కె.జె.ఏసుదాస్

పల్లవి :
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా ॥

చరణం : 1 
నొప్పి లేని నిమిషమేది జననమైన
మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది
సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
దీక్షకన్న సారధెవరురా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటైతే

చరణం : 2
నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల
మొప్పముందు చిన్నదేనురా
పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె
హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని
కదనుతొక్కి అవధులన్నీ అధిగమించరా
త్రి విక్రమా పరాక్రమించరా
విశాల విశ్వమాక్రమించరా
జలధిసైతమాపలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి