9, జులై 2011, శనివారం

ఈ పాటకు ట్యూన్ తెలుసా? (ఆరుద్ర) పవిత్రబంధం



ఈ పాటకు ట్యూన్ తెలుసా? (గాంధీ పుట్టిన దేశమా ఇది)
ఆరుద్ర (http://te.wikipedia.org/wiki/%E0%B0%86%E)
Youtube Video Link (http://www.youtube.com/watch?v=kG7l9SNugBo&feature=related)
 
 


Film: Pavitrabandham    Lyrics: Arudra   Music: S. Rajeswara Rao Singer: Ghantasala

గాంధీ పుట్టిన దేశమా ఇది
గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది
గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా !!!
గాంధీ పుట్టిన దేశమా !!

 సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం.
   సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం.
ఉప్పొంగే నదులు జీవజలాలు ఉపు సముదర్రం   పాలు
యువకుల శక్తిని భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు 
 || గాంధీ ||
సమ్మె ఘెరావు దొమ్మీ, బస్సుల దహనం లూటీ 
సమ్మె ఘెరావు దొమ్మీ, బస్సుల దహనం లూటీ 
శాంతి సహనం సమధర్మం పై విరిగెను గూండా లాటి.
అధికారంకై తగవులాటలో అన్నదమ్ముల పోటీ
హెచ్చెను హింసా ద్వేషం ఏమవుతుంది దేశం
|| గాంధీ || 

వ్యాపారాలకు పర్మిట్, వ్యవహారాలను లైసెన్సు ,
అర్హతలేని ఉద్యోగాలు లంచం యిస్తే ఓయస్
సిఫార్సు లేనిదే స్మశానమందు దొరకదు రవ్వంత చోటు
ప్రేరుకు ప్రజలది రాజ్యం, పెత్తందార్లదే భోజ్యం 
|| గాంధీ ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి