8, జులై 2011, శుక్రవారం

ఈ పాటకు ట్యూన్ తెలుసా? (సిరివెన్నెల) గాయం

ఈ పాటకు ట్యూన్ తెలుసా? ( నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని)
సిరివెన్నెల(http://ammanaresh.blog.com/chandrabose/sir/)


Movie Name   Song Singers    Music Director   Year Released   Director                           Producer   
Gaayam         S.P. Balu           Sri                       1993                Ram Gopal Varma         Y. Surendra
Actors( Jagapathi Babu Revathi &  Urmila Mathondkar)

||ప|| |అతడు|
       నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
       అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
       మారదు లోకం మారదు కాలం
       దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
       మారదు లోకం మారదు కాలం
.
||చ|| |అతడు|
       గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
       గొర్రెదాటు మందకి మీ జ్ఞానబోధ దేనికి
       ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
       ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
       రామబాణమార్పిందా రావణ కాష్టం
       కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
                         ||నిగ్గదీసి అడుగు||
.
||చ|| |అతడు|
       పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా
       అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
       వేట అదే వేటు అదే నాటి కథే అంతా
       నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత
       బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
       శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ
                         ||నిగ్గదీసి అడుగు||
.
.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి