7, జులై 2011, గురువారం

నిజమైన భక్తి భావం చాలా ముఖ్యం...!

అల్లా దూత అయిన మొహ్మమద్ ప్రవక్త ఓ సారి భక్తులనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. దైవంపై ఉండాల్సిన భక్తి భావం, దాని ప్రాశస్త్యం తదితరాల గురించి కొన్ని విషయాలు బోధిస్తున్నారు.

ఆ సమయంలో ఇలా అన్నాడట "లేనివారి దగ్గర ఉన్న విషయాన్ని ఉన్నవారికి ఎప్పుడూ ఇవ్వబడుతుంది" ఇది విన్న భక్తులకు ఏమీ అర్థం కాలేదట. అందరూ బిక్కమొహాలు వేసుకుని ఆయన వంకే చూస్తూ ఉన్నారట. ఇది అర్థం చేసుకున్న మొహ్మద్ ప్రవక్త ఇలా చెప్పడం ప్రారంభించాడు.

"దేవుని పట్ల భక్తి లేనివారి దగ్గర ఉన్నది, నిజమైన భక్తి కలిగినవారికి ఇవ్వబడుతుంద"ని ఆయన వివరించారు. స్వార్థపు భక్తుని వద్ద ఉన్నవి, లేనివారికి అల్లా ప్రసాదిస్తాడని ఆయన బోధించారు. అంటే నిజమైన భక్తి కలిగిన భక్తుడికి లేనివి, స్వార్థంతో కోరుకునే భక్తుని వద్ద ఉన్నవి ఒకటేనని ఆయన బోధించారు. 

భక్తి మనసులో లేకుండా కేవలం స్వార్థం కోసమే దేవుని ప్రార్థించే ప్రార్థనలు వ్యర్థం. నిస్వార్థంగా మేలు కోరే వారి ప్రార్థనలు అల్లా ఎప్పుడూ వింటూనే ఉంటాడు. వారి భక్తికి తగ్గట్లు వారికి ఇవ్వాల్సినవి ఇస్తుంటాడని ఆయన వివరించారు. కనుక అందరూ స్వార్థాన్ని వదిలి మంచి మార్గాన్ని పట్టాలని బోధించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి