ఇక ఆధ్యాత్మికత అనేది మనసుకు సంబంధించినది. ఆధ్యాత్మిక చింతన అనేది అడవుల్లో, కొండ గుహల్లో కూర్చుని సాధించాల్సి ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. పర్వతాల్లో, అడవుల్లో మాత్రమే దొరికేటట్లయితే అది మీ గొప్ప కాదు. ఆ పర్వతాల, అడవుల విశేషత అవుతుంది.
నలుగురిలో నివసిస్తూనే మానసిక ప్రశాంతత సాధించగలిగితేనే గొప్ప. కాబట్టి మీరు జీవితంలో ఏ వృత్తి సాధిస్తున్నారు, ఎలా ఉంటారు అనేది అనవసరం. ధైర్యంగా ఆధ్యాత్మికత చింతనలోకి వెళ్లండి. ఒకవేళ ఆ చింతన మీ జీవితంలో మార్పు తెచ్చినా అది మంచికే అవుతుంది కానీ, చెడుకు కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి