8, జులై 2011, శుక్రవారం

ఈ పాటకు ట్యూన్ తెలుసా? -1 (సిరివెన్నెల) సింధూరం

ఈ పాటకు ట్యూన్ తెలుసా?(అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా..!)

సిరివెన్నెల (http://ammanaresh.blog.com/chandrabose/sir/)

 1997 – సింధూరం

Cast: Ravi Teja, Brahmaji Directed by: Krishnavamsi Music: Sri
Lyrics: Sirivennela Seetarama Shastry Song filmed on: Montage song while titles roll on..
Singers: S.P.Balasubramanyam Song duration: 3: 18 mins

YouTube Video Link
http://www.youtube.com/watch?v=Q86FY3V9SE4&feature=related


అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా..!
స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా..
దానికి సలాం చేద్దామా.
శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం..
నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలని చూడమ్మా..ఓ పవిత్ర భరతమా..
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా..!
స్వర్ణోత్సవాలు చేద్దామా!
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చని చూద్దామా
దాన్నే స్వరాజ్యం అందామా.
కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువని చూపి తగువుకి లేస్తారే
జనాలు తలలు అర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే..
తెలిసి భుజం కలిపి రారే
అలంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరీ ఏమిటి సాధించాలి..
ఎవ్వరి కోసము ఎవ్వరు ఎవ్వరితో సాగించే సమరం ..ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భరతమా..ఓ అనాధ భరతమా..
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా..!
స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా..
దానికి సలాం చేద్దామా.
అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జ్యాన్యాన్ని దహించే ధైర్యం
కారడువులలో క్రూర మృగాల్లా దాక్కొని ఉండాలా
వెలుగుని తప్పుకు తిరగాల్లా
శత్రువుతో పోరాడే సైన్యం
శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులని అణిచే విధిలో కవాతు చెయ్యాలా
అన్నల చేతుల్లో చావలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి
తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిల్చొంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం
ఈ సంధ్యా సింధూరం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి