7, జులై 2011, గురువారం

ఏసు అమర వాక్యాలు


జీసస్‌ను శిలువ చేసేందుకు గుల్గుతా అనే పేరుగల ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆయనను శిలువకు వ్రేలడదీసారు. ఏసు యహూదీయులకు రాజు అని ఓ ఉత్తరంలో పేర్కొనబడింది. మిట్టమధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏసు తన ప్రాణాలను పరలోకానికి పంపేముందు ఏడు అమర వాక్యాలు పలికారు. వాటిని ఈ రోజు స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.

మొదటి వాక్కు : ఓ తండ్రీ వీరిని క్షమించు, ఎందుకంటే వీరి ఏం చేస్తున్నారో వీరికి తెలియదు.

రెండవ వాక్కు : ఈ రోజు నీవు నాతోబాటు స్వర్గలోకంలో ఉంటావని నేను నమ్ముతున్నాను. దేవుడా నేను నీతో నిజమే పలుకుతున్నాను.

మూడవ వాక్కు : ఓ నారీమణి, నీ పుత్రుడ్ని, నీ తల్లిని చూడు.

నాలుగవ వాక్సు : ఓ నా పరమేశ్వరుడా..! ఓ నా పరమేశ్వరుడా..! నీవు నన్ను ఎందుకు వదిలేసావు?

ఐదవ వాక్కు : నేను నీకోసం పరితపిస్తున్నాను. 

ఆరవ వాక్కు : పూర్తయిపోయింది. 

అందరికి తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు తన పుత్రుడైన ఏసును ఏ కార్యక్రమంకోసం భూమిమీదకు అవతరింపజేసాడు. ఆ పని ఇప్పుడు పూర్తయ్యింది. చివరికి శైతానుకూడా ఆ పనులు పూర్తయ్యేందుకు అడ్డుపడలేకపోయాడు. శైతాను వలన కాలేదు. కాని జీసస్ తన ప్రాణాలను వదిలి చేయవలసిన పనులేవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసాడు. మనందరికి మంచి జీవితాన్ని ప్రసాదించి మనకంటూ కొన్ని లక్ష్యాలను రూపొందించాడు దేవుడైన ఏసు ప్రభువు. వాటిని పొందడానికి నిరంతరం ప్రయత్నిస్తుండాలి. 

ఏడవ వాక్కు : ఓ నా తండ్రీ ! నేను నా ఆత్మను నీ చేతులలో ఉంచుతున్నాను. 

దేవుడు తనకు చెప్పిన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని ఏసు ప్రభువు ఈ ప్రపంచాన్ని వదిలి పరలోకానికి పయనమైన రోజు ఈ రోజు. ఆ రోజులలో అపరాధులకు కోరడాలతో శిక్షించేవారు. రెండవది బలిపీఠంపై వ్రేలాడదీసేవారు. ఏసు క్రీస్తు ఈ రెండు శిక్షలను అనుభవించి తన తండ్రి అయిన దేవునికి తన ఆత్మను సమర్పించి ప్రపంచంనుంచి కనుమరుగైనారు. అయినాకూడా ఆయన మన మధ్యలోనే ఉన్నారు. ఓ నా తండ్రి ఇది ఆత్మీయతకు పరిచయ మార్గం. 

శుభకరమైన శుక్రవారంనాడు పవిత్రమైన ఈ రోజున ప్రపంచశాంతి, ఉగ్రవాదం అంతమవ్వాలని కోరుకుంటూ ఇరుగు పొరుగు అందరూ సోదర భావంతో మెలగాలని, ఇతరులపట్ల ప్రేమానురాగాలను పంచాలనికోరుతూ ప్రార్థించండి. హలలూయా....హలలూయా...హలలూయా...!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి