ఈ పాటకు ట్యూన్ తెలుసా? (సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని,)
|
సిరివెన్నెల(http://ammanaresh.blog.com/chandrabose/sir/)
Youtube Video Link
|
Movie Name Song Singers Music Director Year Released Director Producer
Gaayam S.P. Balu Sri 1993 Ram Gopal Varma Y. Surendra
Actors( Jagapathi Babu, Revathi & Urmila Mathondkar)
||ప|| |అతడు|
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని,
సుఖానమనలేని వికాసమెందుకని,
నిజాన్ని బలికోరే సమాజమెందుకని,
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం…
సుఖానమనలేని వికాసమెందుకని,
నిజాన్ని బలికోరే సమాజమెందుకని,
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం…
ఆవేశంలో ప్రతినిమిషం ఉరికే నిప్పుల జలపాతం,
కత్తి కొనలై వర్తమానమున బ్రతకదు శాంత కబోతం,
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు,
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే,
శిరసు వంచి అదిగో… ఎగిరే భరత పతాకం,
చెరుగుతోంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభవం
కత్తి కొనలై వర్తమానమున బ్రతకదు శాంత కబోతం,
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు,
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే,
శిరసు వంచి అదిగో… ఎగిరే భరత పతాకం,
చెరుగుతోంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభవం
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని,
సుఖానమనలేని వికాసమెందుకని…
సుఖానమనలేని వికాసమెందుకని…
కులమతాల దవానలానికి మంచు శిఖరం
కలహలముల హాలాహలానికి మరుగుతున్నది హిందు సంద్రం
దేశమంటే మట్టి కాదను మాట మరచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన రాచ కురిపీ రాజకీయం
విషము చిమ్మెను జాతి తనువున ఈ వికృత గాయం
కలహలముల హాలాహలానికి మరుగుతున్నది హిందు సంద్రం
దేశమంటే మట్టి కాదను మాట మరచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన రాచ కురిపీ రాజకీయం
విషము చిమ్మెను జాతి తనువున ఈ వికృత గాయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి