30, మార్చి 2012, శుక్రవారం

ఖరముపాలు Vs గోవుపాలు


ఈ టపాలో నీను ఎవ్వరిని కించే పరిచే వుద్దేశ్యం తో రాయడమ లేదు, ముక్యంగా "వేమన పండితుడిని , గంగి గోవును, ఖరంను", మీ అభిప్రాయం ప్రకారం తప్పక మార్పులు చేస్తానని హామీ ఇస్తూ....

మన వేమన పండితుడు చెప్పినట్లు ఖరము పాలు ఒక కుండ కంటె చిక్కని ఆవుపాలు గరిటెడు మేలు. నాకు తెల్సి ఇది అప్పట్లో వేమన గారు సైన్స్ రిజల్ట్స్ , ఈ జెర్సీ ఆవుల పాలు "genetically modified" లను దృష్టిలో పెట్టుకొని చెయ్యలేదు. ఒకవేళ వేమన గారు ఈ రోజు వుండివుంటే పద్యం తప్పక మార్చి చెప్పేవాడు కావొచ్చు. ఇది నా వూహ మాత్రమె




పద్యం
    గంగి గోవుపాలు గరిటడైనను చాలు
    కడవెడైనను నేమి ఖరముపాలు
    భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
    విశ్వదాభిరామ వినురవేమ

సారాంశము
ఖరము పాలు ఒక కుండ కంటె చిక్కని 
ఆవుపాలు గరిటెడు మేలైనట్లుగా భక్తితో
 చేసిన కూడు పట్టెడు చాలును కదా!





మార్చిన పద్యం
    ఖరముపాలు గరిటడైనను చాలు
    కడవెడైనను నేమి  గోవుపాలు 
    భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
    విశ్వదాభిరామ వినురవేమ
   

సారాంశము
 ఆవుపాలు ఒక కుండ కంటె చిక్కని 
ఖరము పాలు గరిటెడు మేలైనట్లుగా భక్తితో
 చేసిన కూడు పట్టెడు చాలును కదా!


ఖరం పాల వుపయోగాలు కోసం ఇక్కడ నొక్కండి --
genetically modified ఆవుపాల వల్ల ఎదురయ్యే ఇబ్బందుల కోసం ఇక్కడ నొక్కండి --


ఎవరన్నా ఖరం పేరు మీద తిడితే నాకు అస్సలు నచ్చదు, ఇంకో సారి ఆ పదం వాడే ముందు ఆలోచించండి.





28, మార్చి 2012, బుధవారం

26, మార్చి 2012, సోమవారం

అమెరికా జవాను Vs ఇండియా రాజకీయనాయకుడు


నిన్న నా కలలో అమెరికా జవాను ఇండియా రాజకీయనాయకుడు  (రాకీనా) నా దగ్గరికి వచ్చి మాలో ఎవరు గొప్ప నువ్వే తీర్పు చెప్పాలి అని సతాఇంచి నా ప్రాణం తిన్నరనుకో...
తీర్పు చెప్పే ముందు మీ గొప్పలు చెప్పండి అంటే ఇదోగో ఇలా మొదలెట్టారు.....

జవాను: నీను 100+ LBs (సరాసరి 50kg) మోస్తాను రోజు.
 
రాకీనా: ఓహో  జవాను నువ్వు రోజులో డ్యూటీ చేసేటప్పుడే మోస్తావు, అది నీ డ్యూటీ. నీను, ఇదిగో చూడు 50kg నా దేహం లో బాగం, ఇది లేకపోతే నీను "రాకీనా" కాదు.
 
జవాను: నీను నా దేశం లో చెత్త అంతా విదేశాలలో కాలుస్తా. దీనివల్ల మాదేశానికి పేరు.
 
రాకీనా: నీను నా దేశం లో చెత్త పనులు చేసి విదేశాలలో దాస్తా. దీనివల్ల మాకు పేరు, మా దేశానికి చెడ్డపేరు.
 

జవాను:  మీము విదేశీయులను ఆటాడిస్తాం.
 
రాకీనా:  మీము స్వదేశీయులను ఆటాడిస్తాం.
 
జవాను:మీము దేశానికి సేవ చేస్తాం.

రాకీనా:  మాకు దేశం సేవ చేస్తుంది.

 

ఈ గలాటా లో నాకు మెలుకువ వొచ్చి చూస్తే ఎవడో నా వీపు మీద చెళ్ళున కొట్టినట్టు అనిపించింది, తీరా  చూస్తే నీను ఆఫీసు కి అరగంట ఆలస్యంగా చేరతా అని తెలిసాక వీళ్ళకు తీర్పు చెప్పడం కాదు కాని ఇవ్వాళా నా బాస్ తీర్పు చెప్పే లావున్నాడు, వెళ్ళాలి మళ్ళీ వొచ్చాక చూస్తా ఈ విషయం...
ఈలోపు మీరు చెప్పండి ఎవరు గొప్పో......


25, మార్చి 2012, ఆదివారం

100 సంవత్సరాల చెర్రీ పూత

నా కెమెరా కళ్ళతో 
పెద్ద చిత్రం కోసం చిత్రం పైన నొక్కండి
 














రాష్ట్రపతి "తెల్ల ఇంటి పెరటి తోట లో"


కాపిటల్ హౌస్ ముందు 






 

24, మార్చి 2012, శనివారం

జనకుడు జ్ఞాని ఎలా అయ్యాడు?


మిథిలానగరాన్ని పరిపాలించే జనకునికి రాజర్షి అని బిరుదు. ఆయనను గొప్ప జ్ఞానిగా అందరూ భావించి గౌరవించేవారు. అయితే ఆయనలోని జ్ఞానం ఆయన ముఖంమీద తాండవిస్తూ ఉంటుందా? అందులోనూ ఉదయం నుంచి రాత్రివరకు రకరకాల లౌకికవ్యవహారాలలో మునిగి తేలే ఒక రాజును జ్ఞానిగా ఎలా భావించడం!. 

జనకుని రాజర్షిగా, జ్ఞానిగా అందరూ ఎందుకంటున్నారో, అందులోని విశేషమేమిటో తేల్చుకుందామనుకున్నాడు ఒక సాధువు. నేరుగా జనకుని ఆస్థానానికి వెళ్ళాడు. జనకు డప్పుడు మంత్రులతో మంతనాలు జరుపుతున్నాడు. ప్రజల బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటున్నాడు. కప్పం చెల్లించని సామంతరాజులపై కోపం ప్రకటిస్తున్నాడు.

ఎతైన సింహాసనం మీద కూర్చున్న జనకునికి పరిచారకులు అటూ ఇటూ నిలబడి వింజామరలు వీస్తున్నారు. ఒకరు పాదాలు ఒత్తుతున్నారు. ఆయన కిరీటంలో పొదిగిన మణిరత్నాలు జిగేలుమంటున్నాయి. ఎటుచూసినా ఆడంబరమూ, అతిశయమే. సాధువు ఇదంతా గమనిస్తున్నాడు. అతనకీ వరస ఏమీ నచ్చలేదు. ఇతడన్నీ లౌకికవిషయాలే మాట్లాడుతున్నాడు. లౌకికమైన సిరిసంపదలతో తులదూగుతున్నాడు. ఇతడు రాజర్షీ, జ్ఞానీ ఎలా అవుతాడు? ఇతణ్ణి జ్ఞాని అన్నవాళ్ళు పరమ అజ్ఞానులు - అనుకున్నాడు.

సాధువు ఆస్థానంలోకి అడుగు పెడుతున్నప్పుడే అతని మీద జనకుని దృష్టి పడింది. మంత్రులతో మాట్లాడుతూనే అతనిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అతని మనోభావాలను అంతర్దృష్టితో గమనిస్తూనే ఉన్నాడు. సాధువును తన వద్దకు పిలిపించుకున్నాడు. సాధువు వేషంలో ఉన్నావు కానీ, నువ్వు నిజమైన సాధువువి కావు అన్నాడు. సాధువు తెల్లబోయాడు. ఎప్పుడూ ఇతరులలో తప్పు లెంచే స్వభావం నీది. దానితోనే నీ సమయమంతా ఖర్చయిపోతోంది. భగవధ్యానానికి నీకు తీరికేదీ?

సాధువు మరింత నివ్వెరపోయాడు. నా దృష్టిలో నువ్వు నేరస్థుడివి. రాజుగా నిన్ను శిక్షించక తప్పదు. నీకు మరణశిక్ష విధిస్తున్నాను. వారం రోజుల్లో నిన్ను ఉరితీస్తారు. సాధువు గజగజ వణికిపోతూ నిలబడ్డాడు. జనకుడు అలా ప్రకటించిన వెంటనే భటులు సాధువును తమ అదుపులోకి తీసుకున్నారు. చెరసాలకు తరలించారు.

అతడికి రోజూ ఉప్పులేని కూరలు, కారం కలిపిన తీపిపదార్థాలు ఆహారంగా పెట్టమని జనకుడు సేవకులను ఆదేశించాడు. అయితే ఆ సాధువు వాటి రుచిని పట్టించుకునే స్థితిలో ఉన్నాడా? కళ్ళు మూసినా తెరచినా అతనికి ఉరికంబమే కనిపిస్తోంది. తన మెడ చుట్టూ ఉరితాడు బిగుసుకుంటున్న దృశ్యమే కళ్ళముందు కదులుతోంది. కంటిమీద కునుకే కరువైపోయింది. ఆ వారంరోజుల్లోనే అతడు మరణభయంతో, మనోవ్యధతో చిక్కి శల్యమైపోయాడు. ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చేశాయి.

ఏడవరోజున సాధువును ఉరి తీయడానికి సన్నాహాలు చేయమని జనకుడు ఆదేశించాడు. తను కూడా ఉరి తీసే ప్రదేశానికి వెళ్ళాడు. భటులు చెరోవైపూ చేతులు పట్టుకుని, అతికష్టంమీద అడుగులు వేస్తున్న సాధువును తీసుకొచ్చి జనకుని ముందు నిలబెట్టారు. మృత్యుభయంతో సాధువు స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత స్పృహ వచ్చింది. అప్పుడు జనకుని ఆదేశంపై సేవకులు అతనకి ఉప్పు కలిపిన పాలు ఇచ్చారు. సాధువు ఆ పాలను గడగడ తాగేశాడు.

పాలు బాగున్నాయా? పంచదార సరి పోయిందా? అని ప్రశ్నించాడు జనకుడు చిరునవ్వుతో. ఎందుకడుగుతావు మహారాజా! ఈ వారంరోజులుగా పదార్థాల రుచిని గమనించే స్థితిలో ఉన్నానా నేను? నాకు ప్రతిక్షణమూ, ప్రతిచోటా ఉరికంబమే కనిపిస్తోంది, అన్నాడు సాధువు. జ్ఞానబోధకు ఇదే తగిన సమయమనుకున్నాడు జనకుడు.

ఈ వారం రోజులూ నువ్వు ఏం చేస్తున్నా, ఏం తింటున్నా, నీ దృష్టి చేస్తున్నవాటిమీద, తింటున్నవాటిమీద లేదు. కేవలం ఉరికంబమే నీకు కనిపించింది. అలాగే నేను రోజూ ఉదయం నుంచి రాత్రివరకూ అనేకమైన లౌకికివిధులు నిర్వర్తిస్తున్నా నా దృష్టి మాత్రం ఎల్లవేళలా పరబ్రహ్మతత్త్వం పైనే లగ్నమై ఉంటుంది. విశేషధ్యానంతోనే నాస్థితిని సాధించాను. నేనీ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉండగలను. నా మనస్థితి ఎటువంటిదో ఇప్పుడైనా అర్థమైందా?

ఇక ముందెప్పుడూ ఇతరుల లోపాలను ఎంచే ప్రయత్నం చేయకు. నీ బాగు నువ్వు చూసుకో. ఇతరులలో మంచినే చూడడం నేర్చుకో. తపస్సుతో , ధ్యానంతో పరమసత్యాన్ని తెలుసుకో. ప్రపంచానికి అతీతంగా ఉంటూనే ప్రపంచ క్షేమం కోసం పనిచెయ్యి. ఇక వెళ్ళు!. సాధువుకు జనకుని ఔన్నత్యం, తన అల్పత్వం అర్థమయ్యాయి. అతనికి శిరసు వంచి నమస్కరించి అక్కడినుంచి నిష్క్రమించాడు.

23, మార్చి 2012, శుక్రవారం

ఆయువుపట్టు వేపచెట్టు


వేప... గుడి పూజారి చిట్కా వైద్యం మొదలుకొని ఆయుర్వేద నిపుణుల వరకు చాలా రకాల చికిత్సలకు వేపపైనే ఆధారపడతారంటే అతిశయోక్తి కాదు. ప్రాచీన వేదకాలం నుంచి నేటి వరకు సమాజసేవకు ఉపకరిస్తున్న ఈ మహత్తర వృక్షం మీద నేటి ఆధునిక వైద్య శాస్త్రజ్ఞులు అపారమైన పరిశోధన చేస్తున్నారు. అమోఘమైన ఫలితాలను చూస్తున్నారు. ఇంతటి విశిష్టత గల చెట్టు కాబట్టే భారతీయ సంప్రదాయంలో దీనికి దైవత్వం ఆపాదించి పూజలు కూడా చేస్తుంటారు. ఉగాది సందర్భంగా వేప గొప్పదనాన్ని, దాని ఔషధ గుణాలను తెలుసుకుందాం. ప్రతి మనిషికీ అందుబాటులో ఉండే ఈ వేపచెట్టు గురించి ఆయుర్వేద శాస్త్రకారులు చెప్పిన వివరాలు పరికిద్దాం.

వేపని సంస్కృతంలో ‘నింబ’ అంటారు. పిచుమర్ద, తిక్తక, అరిష్టం, హింగునిరాస్య లాంటివి వేపకు మరికొన్ని పర్యాయపదాలు. ఈ వృక్షం అనేక శాఖలతో 20 నుంచి 40 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని లేత ఆకులు (పల్లవాలు), ముదురాకులు, కాయలు, పండ్లు, విత్తులు, పువ్వు, బెరడు, బంక, వేళ్లు (మూలాలు)... అన్నింటికీ ఔషధగుణాలు ఉంటాయి. శిశిర రుతువులో ఇది ఆకులు రాలుస్తుంది. వసంత రుతువులో (ఇంచుమించుగా మార్చి, ఏప్రిల్ నెలల్లో) ఇది చిగురిస్తుంది. దీని లేతపల్లవాలు రాగివర్ణంలో కనిపిస్తాయి. చెట్టు పూత పూస్తుంది. తెల్లటి రంగుతో చిన్న చిన్న పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. గ్రీష్మరుతువు చివరన లేదా వర్షరుతువులో పువ్వుల నుంచి పెరిగిన కాయలు పండ్లుగా మారతాయి. ఇవి పసుపుపచ్చరంగులో ఉంటాయి. బాగా పండిన పండ్లు తప్ప మిగతా అన్ని భాగాలూ చేదుగానూ, వగరుగానూ ఉంటాయి. అంటే తిక్కషాయ రసాలన్న మాట.

వేప గుణాలు:
త్రిదోషాలకు సంబంధించి కఫాన్ని, పిత్తాన్ని శమింపజేస్తుంది. వాతాన్ని వృద్ధి చేస్తుంది. శరీరానికి చలవ చేసి తేలిక పరుస్తుంది. శరీర ద్రవాంశాలను బయటకు పోకుండా పదిలపరుస్తుంది.
(నింబ శీతో లఘుర్గ్రాహీ... వాతకృత్).

పళ్లుతోము పుల్లగా ప్రాముఖ్యత:
సరిమైన మందంలో ఉన్న పుల్లల్ని, ఆకులు తుంచేసి, చివరి భాగాన్ని కుంచెకట్టేట్టు మెత్తగా నమిలి పళ్లు తోముకునే సంప్రదాయం అనాదిగా వస్తోంది. నోటిలోని దుష్టక్రిముల్ని హరించి, దుర్గంధం పోగొట్టి, దంతశుద్ధి చేస్తుంది. ఆ విధంగా ముఖప్రక్షాళనానికి ఇది పెట్టింది పేరు. కనుకనే ఇవ్వాళ కూడా వేప నుంచి తయారు చేసిన టూత్‌పేస్టులు, చర్మసౌందర్య క్రీములు ఎంతో ప్రాచుర్యం సంతరించుకున్నాయి. వ్యాపారస్తులకు వరంగా మారాయి.

వేప కషాయం:
ప్రధానంగా ఆకుల్ని, బెరడును దంచి కషాయం తయారుచేస్తారు. ఈ కషాయాన్ని 30 మిల్లీలీటర్ల (సుమారు ఆరు చెంచాల) పరగడపున తాగితే ఎన్నో రకాల చర్మవ్యాధులు నయమవుతాయి. (దురదలు, ఎగ్జిమా, సోరియాసిస్, గజ్జి, తామర మొదలైనవి).

ఎన్నో రకాల జ్వరాలు (వైరస్, బ్యాక్టీరియా వల్ల కలిగేవి, మలేరియా వంటివి) తగ్గుతాయి.

లేత ఆకులు (పల్లవాలు) దగ్గుని, ఉబ్బసాన్ని (కాస, శ్వాస) నియంత్రిస్తాయి.

మూల వ్యాధి (అర్మో రోగ- పైల్స్)ని తగ్గిస్తాయి.

మధుమేహాన్ని, ఇతర మూత్రవ్యాధుల్ని అదుపు చేస్తాయి.

{వణశోధనలకు (అల్సర్స్ ఇన్‌ఫెక్ట్ కాకుండా మానడానికి), గాయాలు, చర్మవ్యాధులు త్వరగా తగ్గడానికి కషాయంతో గాయమైన ప్రాంతంలో (లోకల్‌గా) కడగవచ్చు.

కషాయం వల్ల రక్తం శుద్ధి అయి మొటిమలు కూడా తగ్గుతాయి.

విషహరంగా కూడా పనిచేస్తుంది. దప్పికను, శరీరంలోని మంటను (తృష్ణ, దాహం) తగ్గిస్తుంది.

అలసటను తగ్గిస్తుంది.

విరేచనాలను (అతిసారవ్యాధిని) అరికడుతుంది.

వేపచూర్ణం:
ఆకుల్ని, బెరడును ఎండబెట్టి, దంచి పొడి చేస్తారు. 3 నుంచి 5 గ్రాముల మోతాదులో ఈ చూర్ణాన్ని నీళ్లతో గాని, తేనెతోగాని కడుపులోకి సేవిస్తే, కషాయ సేవన వల్ల లభించే ప్రయోజనాలన్నీ సమకూరుతాయి. ఈ చూర్ణాన్ని జల్లిన ప్రదేశంలో క్రిమికీటకాదులు నశిస్తాయి. కాబట్టి వ్యవసాయదారులు కొంతమంది దీన్ని వాడుతుంటారు.

వేప తెలకపిండి:
ఇది నూనెను తీసిన తర్వాత మిగిలే పిండి. దీన్ని పొడిగా గాని, ముద్దగా గాని చేసి వ్యవసాయ దారులు, పంటపొలాల్లో వాడుతారు. క్రిమి కిటకాదులను సంహరించడం ద్వారా ప్రయోజనం సమకూరుతుంది.

ధూపం:
ఎండిన వేప ఆకులు, ఈనెలు, బెరడు, వేళ్లు... వీటికి కొంత నెయ్యి కలిపి మంటపెడితే దట్టమైన పొగ వస్తుంది. ఈ విధంగా పొగతెప్పించడాన్ని ధూపన కర్మ అంటారు. ఇది దోమలు, ఇతర క్రిమికీటకాదులను నాశనం చేస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఈ ధూపాన్ని ఇళ్లల్లో కూడా వేసే సంప్రదాయం ఇప్పటికీ నడుస్తోంది. చికెన్‌పాక్స్, మీజిల్స్ (లఘుమసూరిక, రోమంతిక) సోకిన ఇళ్లల్లో వేపకొమ్మల తోరణాల్ని కట్టడం మనం చూస్తుంటాం. దీనివల్ల సోకే గాలి కూడా ఆ వ్యాధులను తగ్గిస్తుంది. ఆ వైరస్‌లు బయటికి వ్యాపించి వేరొకరికి సంక్రమించకుండా నివారణ జరుగుతుంది.

వేపబంక:
ఇది బెరడు నుంచి వచ్చే నిర్యాసం. దీన్ని పలుచని ముద్దగా చేసి బయట పూస్తే చర్మరోగాలు తగ్గడానికి, గాయాలు మానడానికి ఉపకరిస్తుంది.

చరక, సుశ్రుత, వాగ్భట సంహితల్లో, భావప్రకాశ, బసవ రాజీయం వంటి గ్రంథాల్లో, చాలా ఇరత పుస్తకాల్లో ‘వేప’ ఔషధగుణాలు ఇలా వివరించారు.

జ్వరాలకు కషాయం

అంతర్గత రక్తస్రావాలు: వేపతో పాటు పటోల (చేదుపొట్ల), వట (మర్రి) ద్రవ్యాలు కలిపి కషాయం తయారు చేసుకోవాలి.

రక్తం కారే అర్మరోగం: (పైల్స్ : వేప పిండి ముద్దను ముల్లంగితో ఉడికించి నీడలో ఆరబెట్టి మాత్రలు చేసుకుని వాడాలి.

గాయాలు మానడానికి: వేపాకులు, ఉమ్మెత్త ఆకులు కలిపి, రసం తీసి తేనెతో కడుపులోకి సేవించాలి.

వాపులకు (శోధ): ఆముదం, కొడిశపాల, క్రానుగ, వేప ఆకుల కషాయం చేసి తొట్టెస్నానానికి వాడాలి.

దద్దుర్ము (శీతపిత్త): ఉసిరికాయ, వేపాకుల రసాన్ని, నెయ్యితో కలిపి రెండుమూడు వారాలు సేవించాలి.

కీళ్లనొప్పులకు, వాపులకు: పరగడుపున రోజూ 80 గ్రాముల నింబకల్కం మేపముద్దను సేవించాలి (తేనెతో)

సకల చర్మరోగాలకు: వేపతో చేదుపొట్ల (పటోల) కలిపి కషాయం చేసుకొని వాడాలి. (తాగడానికి, స్థానికంగా కడగడానికి). కరక్కాయ, ఉసిరికాయలను కూడా వేపతో కలిసి సేవించాలి.

కడుపులో మంట, నొప్పి (అమ్లపిత్త, ఉదరశూల): వేపతో బాటు వృద్ధదారక ద్రవ్యాన్ని కలిపి శర్కరతో, చల్లటినీటితో సేవించాలి.

దప్పిక, మంట, మానసిక అశాంతి: రేగుపళ్ల గుజ్జు, వేప పళ్ల గుజ్జు కలిసి తల మీద పట్టువేయాలి.

తలనెరవడం (అకాలపాలిత్యం): ఒక నెలరోజుల పాటు వేపనూనెను (రెండు చుక్కలు) ముక్కు రంధ్రాల్లో వేసుకుంటూ, ఆహారంలో కేవలం పాలు, దానికి సంబంధించిన ఆహారంపైనే ఉండాలి. (ఇది వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి).

తెల్లబట్ట (శ్వేతప్రదర): ఇది స్త్రీలకు సంబంధించిన వ్యాధి. నింబ, గడూచి (వేప, తిప్పతీగె) రసాన్ని కొంచెం సుర (పులిసిన ద్రాక్షరసం) కలిపి సేవించాలి.

విషాలకు: వేపవిత్తుల చూర్ణాన్ని (2 గ్రాములు) వేడినీటితో తాగాలి.

పచ్చకామెర్లు (కామల-జాండిస్): వేపకషాయంతో త్రిఫలా కషాయం కలిపి (5 చెంచాలు), రెండు పూటలా, పరగడుపున, 10 రోజులు తాగాలి. కేవలం పెరుగన్నం, బార్లీ నీళ్లు సేవించాలి.

పంటి జబ్బులకు: వేప వేరు ఈమద పట్ట (మూలత్వక్)తో చేసిన కషాయంతో రెండు పూటలా పుక్కిలిపట్టి, నోటిని శుభ్రం చేసుకోవాలి.

కొన్ని యోనికి సబంధించిన వ్యాధుల్లో కూడా వేపను ఉపయోగిస్తారు.

వ్యాధి స్వభావాన్ని బట్టి ఈ వేప చెట్టు ఔషధాన్ని ఏ రూపంలో, ఎంత మోతాదులో, ఎంతకాలం వాడాలి, పథ్యాపథ్యాలు, ఇతర ఓషధులను ఎలా కలపాలన్న అంశాలు కేవలం ఆయుర్వేద నిపుణులు మాత్రమే నిర్ధారణ చేయాలి. కాబట్టి చూడటానికి సునాయాసంగా కనిపించినా, సొంతవైద్యం చేసుకోవడం శ్రేయస్కరం కాదు.

క్యాన్సర్లలో కూడా మంచి ప్రభావం:
ప్రస్తుతం కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులలో కూడా నింబ తైల ప్రభావంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అశాస్త్రీయ మోతాదుల్లో చాలా దుష్ఫలితాలు ఉన్నాయి శాస్త్రజ్ఞుల పరిశీలనలో తేలింది కాబట్టి వైప ఔషధాలకు సంబంధించిన ప్రయోగాలలో చాలా జాగ్రత్త అవసరం.

వేపనూనె
దీన్ని వేపవిత్తులనుంచి తయారు చేస్తారు. ఇది ఎర్రని రంగులో తీక్షణమైన వాసన కలిగి ఉంటుంది. చాలా చేదుగా ఉంటుంది. ఈ నూనెను వంటల్లోకి వాడరు. కేవలం ఔషధంగా మాత్రమే ఉపయోగిస్తారు. తక్కువ మోతాదులో (3 నుంచి 10 చుక్కలు) కడుపులోకి తీసుకోవచ్చు. స్థానికంగా పైపూతకు చాలా రకాల చర్మవ్యాధుల్లోనూ వాడతారు. చర్మంపై కలిగే నల్లని మచ్చలు తగ్గడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. దీనికి పురుష వీర్యకణాలను తాత్కాలికంగా నాశనం చేసే గుణం ఉంటుంది. కాబట్టి సంభోగానికి ముందుగా మహిళల జనేంద్రియం లోపల 10-15 చుక్కల తైలాన్ని ఉంచితే గర్భం కలగదన్నది ఒక పరిశీలన. దీని ఖచ్చితమైన ఫలితాల కోసం ఇంకా వైద్యపరమైన పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రభావం ఆశాజనకంగానే ఉన్నాయి. అదేవిధంగా ఈ నూనె గర్భాశయం లోపల కూడా ప్రభావం చూపి, గర్భం నిలవకుండా చేస్తుందని కూడా గమనించారు. అయితే ఈ విషయంపై కూడా ఇంకా ఖచ్చితమైన ఫలితాల కోసం పరిశోధనలు జరగుతున్నాయి. అందువల్ల గర్భిణులు, సంతాన ప్రయత్నం చేస్తున్నవారు ఈ నూనెనే కాకుండా వేపకు సంబంధించిన ఏ ఔషధాన్ని కూడా బాహ్య, ఆభ్యంతర సేవన చేయకపోవడం మంచిది. శిశువులపై వాడాలన్నా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అయితే గర్భవిచ్ఛితి కోసం దీన్ని ఉపయోగించాలను కోవడం సరికాదు. నిపుణుల సలహా మేరకే వేపనూనె వాడాలి.

వేపపువ్వు ప్రాశస్త్యం
వసంత రుతువులో చైత్రశుద్ధ పాడ్యమినాడు ఉగాది పండుగ వస్తుంది. ఇది కఫ ప్రకోప కాలం. వేపపువ్వు కఫహరంగా పనిచేస్తుంది. జఠరాగ్ని వర్ధకంగా ఉండి ఆకలిని పుట్టిస్తుంది. కడుపులోని మంటను తగ్గిస్తుంది. (అమ్లపిత్తహరం). పొట్టలోని హానికర క్రిములను సంహరిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కంటిచూపునకు పదును పెట్టి కళ్లను తేజోవంతంగా ఉంచుతుంది. కనుకనే ఉగాదిపచ్చడిలో ఇది ప్రధాన ద్రవ్యంగా చోటుచేసుకుంది.

ఉగాది రోజున దీపారాధనకు ఆవునెయ్యిని వాడండి!


ఉగాది మనకు సంవత్సరాది. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తానలేచి, అభ్యంగన స్నానం చేయడం అతిముఖ్యమైన విధి. ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులూ దేవిని ఆరాధిస్తారు. అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రధారణ, భగవత్పూజ పంచాగ శ్రవణం, ఉగాది పచ్చడి భక్షణం మంచిది.

అలాగే ఉగాది రోజున అభ్యంగన స్నానానికి అనంతరం పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. మీకు నచ్చిన లేదా ఇష్టదేవతా పూజ చేసుకోవచ్చు. పూజకు ఉగాది పచ్చడి నైవేద్యం, పసుపు రంగులు పుష్పాలు వాడాలి. ఉగాది పండుగ రోజున ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు పూజ చేయవచ్చు. దీపారాధనకు రెండు ప్లస్ రెండు దూది వత్తులు, ఆవునెయ్యి వాడాలి. 

అలాగే ఉగాది నాడు ఇంతకుముందు చూడని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మంచిది. ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవములు నిర్వహించడం, లేదా మీ శక్తి చేయించగలిగే పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

రియల్ మాడ్రిడ్ ఇదువేలకోట్ల విహరకేంద్రం

త్వరలోదుబాయ్ లో...













వీడియో


స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌కు పాకిస్థాన్‌లో గౌరవం!

http://www.hindustantimes.com/Punjab/Chandigarh/Honour-Bhagat-Singh-in-Pak-civil-group/SP-Article1-829701.aspx

Bhagat Singh
భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌కు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్ర్య సమరంలో భగత్ సింగ్ పాత్ర, మనదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలకు సైతం ఉపయోగపడింది. 

ఉగ్రవాదం, నియంత, సర్వాధికారాలపై పోరాటం చేసిన భగత్ సింగ్‌ను పాకిస్థాన్‌లోని సివిల్ సొసైటీ గ్రూప్ గౌరవించింది. భగత్ సింగ్ వర్థంతి (శుక్రవారం మార్చి 23)ను పురస్కరించుకుని ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడింది. 

మార్చి 23వ తేదీ, 1931వ సంవత్సరం ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భగత్ సింగ్ ఉరిశిక్షకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉరి వేసిన గడ్డపైనే భగత్ సింగ్‌కు గౌరవం దక్కడం గమనార్హం. భగత్ సింగ్ వర్థంతిని పురస్కరించుకుని వరల్డ్ పంజాబ్ కాంగ్రెస్ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జమాన్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలచే గౌరవించబడాల్సిన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌ సింగ్ అని కొనియాడారు.

ఇంకా తమ గ్రూప్ పాకిస్థాన్‌లో ఉన్న లాహోర్‌లో భగత్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భగత్ సింగ్‌ ఉరిశిక్షకు గురైన ప్రాంతం ప్రస్తుతం షట్మన్ చౌక్ అని పిలువబడుతోంది. దీనిని భగత్ సింగ్ చౌక్‌గా పేరు మార్చాలని జమాన్ డిమాండ్ చేశారు.

News Summary: Legendary freedom fighter Bhagat Singh should be honoured in Pakistan as heroes are not limited to one country or religion and they transcend all borders in their fight against oppression, extremism and dictatorship, head of a leading civil society group said today.

వేప... కరివేప... ఒక కథ

అహంకారం నెత్తికెక్కితే నాలుక చిమచిమమంటుంది. మాటలు జర్రున జారుతాయి. గొప్పకు పోతే తిక్క కుదురుతుంది.
అనగనగా ఒక వేపచెట్టు.
దాని పక్కనే ఒక కరివేపాకు చెట్టు.
రెండూ ఫ్రెండ్సు.
కాని కాలం కలకాలం ఎవర్నీ ఒకలా ఉంచదు.
రాను రాను కరివేపాకుకు అహంకారం పెరిగింది. పొగరు చిటారుకొమ్మకు ఎగబాకింది.
ఒకరోజు అది వేపచెట్టుతో ఇలా అంది- గురువా వేపచెట్టూ. నీకు నా సంగతి తెలుసునా? నేను నీకంటే గొప్ప. ఎలా అంటావేమో.... నా పేరు ముందు కరి ఉంది. కరి అంటే ఏనుగు. జంతువుల్లోకెల్లా ఏనుగు ఎలా గొప్పో అలా చెట్లలోకెల్లా నేనే గొప్ప. వేప కంటే కరివేపాకు గొప్ప. అందుకే నా కోసం అందరూ ఆత్రపడతారు. కూరల్లో వేయడానికి తహతహలాడతారు. నీదగ్గర ఏముంది... మొత్తం చేదు... యాక్ అంది.
ఆ మాటలకు వేప చిన్నబుచ్చుకుంది.
చల్లటి నీడనిచ్చే నన్ను ఇంతలేసి మాట అంటుందా అని వనదేవతను ప్రార్థించింది.
రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. తపస్సు వీడని వేప పట్టుదలను చూసి వనదేవత ప్రత్యక్షమయ్యింది. ఏం కావాలి నీకు అని వేపను అడిగింది. ‘తల్లీ... నా కంటే తనే గొప్పనని కరివేపాకు అంటోంది. దాని పొగరు అణుచు’ అంది. వనదేవత అందుకు సమ్మతించింది.

‘‘మూడొందల అరవై రోజులూ కరివేపను వాడినా... అన్ని రోజులకూ ప్రారంభదినం లాంటి ఉగాది రోజున అందరూ నీకోసం వెతుక్కుంటారు. నీ ప్రమేయం లేకుండా ఉగాదిని జరుపుకోరు. అంతేకాదు ఇన్నాళ్లూ కూరతోపాటు కరివేపను కూడా తినేవారు. ఇకమీదట కరివేపను వాడినా దాన్ని తీసిపారేస్తారు. ఇక మీదట అది వాడుకుని పారేయడానికి అది ఒక గుర్తుగా మారుతుంది... దాని పొగరు అలా అణుగుతుంది’’ అని వనదేవత మాయమైంది.
అప్పట్నించి కరివేపాకు బతుకు అలా అయ్యింది.
వేప ఇలా వెలుగుతోంది.
 
- కల్పన

ఉగాది నాడు శ్రీమద్రామాయణ పారాయణం చేయండి!



Rama
చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఏ రోజున వుంటే ఆ రోజున ఉగాది పండుగ పరిగణిస్తారు. ఇంకా బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున శ్రీరామునిని ఆరాధించడంతో పాటు శక్తి ఆరాధనకు కూడా విశిష్టమని పురోహితులు చెబుతున్నారు. 

అలాంటి ఉగాది పండుగ రోజున శ్రీరామ చంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ఇంకా శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాయణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.

ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకుని, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయండి. తిలకధారణ, నూతన వస్త్రాల ధారణ అనంతరం భగవంతుడిని పూజించాలి. పూజానంతరం పెద్దల ఆశీస్సులను పొందడం, దేవాలయ సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

21, మార్చి 2012, బుధవారం

ఐదు మంచి చిన్ని కధలు





విశ్వాసము -- ఒక సారి గ్రామము లో అందరూ ఒక చోట వర్షం కోసం ప్రార్దించ గుమిగూడారు, అందులో ఒకే ఒక పిల్లవాడు మాత్రమె గొడుగు తో వొచ్చాడు...... 
 
 












భరోసా -- పసి పిల్లలను గాలిలో ఎగరేస్తే వాళ్ళు నవ్వుతూ వుంటారు ఎందుకంటే, ఎగరేసేవాళ్ళు, వాళ్ళను తప్పకుండా పట్టుకుంటారని.....
























ఆశ -- రేపు పొద్దున్నకల్లా బ్రతికివుంటామో లేదో తెలియదు కాని, పొద్దున్నే లేవాలని ప్రతీ రాత్రి పడుకునే ముందు అలారం పెట్టుకుంటాం............
















నమ్మకం -- రేపటి కోసం  చాలా పెద్ద పనులు ఆరంబిస్తాం, ఇంతకు అవి అవి అవుతాయో, కావో కోడ తెలియకుండా ..........
 


















అతి నమ్మకం -- ప్రపంచం బాధపడటం చూస్తూనే వుంటాం, మనకు తెల్సు ఇలాంటి ఘటనలు జరుగుతున్నవి , జరుగుతవి అని ఐనా పెళ్లి చేసుంటాం .......