12, మార్చి 2012, సోమవారం

మిక్స్చ్‌ర్ (3-11)


అడ్డొచ్చే జాతీయగీతం

ఇద్దరు కొత్త కానిస్టేబుళ్లు మాట్లాడుకుంటున్నారు.
'మా తమ్ముడికి పరీక్షల్లో సున్నాలొచ్చినప్పుడు కొట్టాలని లాఠీ ఎత్తుతాను కాని ... వీలు కావట్లేదోయ్'' వాపోయాడు పి.సి. నెం. 220.
"అదేం?'' ఆశ్చర్యపోయాడు పి.సి.నెం. 120.
"ఏం చేయనూ? నేను కర్ర తీయగానే జాతీయగీతం ఎత్తుకుంటాడు. కర్ర పారేసి సెల్యూట్ చేయక తప్పట్లేదు'' చెప్పేడు 220.

పుట్టినరోజులేవీ?
"గాడిద పెద్దదా? గుర్రం పెద్దదా?'' ప్రశ్నించింది టీచర్ రోజీ.
"ముందు వాటి డేటాఫ్ బర్త్‌లు తెలిస్తే గానీ ఏది పెద్దదో చెప్పడం కష్టం టీచర్'' బదులిచ్చాడు రాము.

అందుకే వచ్చా!
"ఏరా నిన్న మాదిరే ఈ రోజూ లేటుగా వచ్చావు?'' కోపంగా అరిచింది టీచర్.
"లేటుగా వస్తే ఇంటికి పంపిస్తానన్నారుగా'' ఠపీమని చెప్పాడు విద్యార్థి.

అందుకే వచ్చా!
"ఏవండోయ్! మీకు గుర్తుందా? మన పెళ్ళై ఈ రోజుకు సంవత్సరం. ఆఫీసునుండి వచ్చేప్పుడు ఓ నాటుకోడి పట్రండి ... కోసుకుందాం'' స్కూటర్ స్టార్ట్ చేస్తున్న భర్తకు వినిపించేలా అరిచింది కాంతం.
"ఎందుకే కాంతం? మనం చేసిన తప్పుకు దాన్ని బలిచేయడం!'' బాధగా మూలిగి, బండి ముందుకు పోనిచ్చాడు రాంబాబు.

తీర్పు
రమేష్‌కి ఇంటర్నెట్ చాటింగ్ ద్వారా రమోలా పరిచయం అయింది. ఇద్దరి అభిరుచులు కలిశాయి. ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల తర్వాత రమోలాకి గతంలో పెళ్లయిందని తెలిసి, కోపంగా కోర్టుకెక్కిన రమేష్‌ని జడ్జి ఇలా ప్రశ్నించాడు...
"ఏం చేస్తుంటావు?''
"క్రీడాకారుడ్ని''
"ఏ ఆట?''
"క్రికెట్''
"క్రికెట్‌లో ఏంటి?''
"స్పిన్నర్''
"స్పిన్నర్ చేతికి కొత్త బంతి దొరకదనే విషయం తెలీదా? వేషాలు కట్టిపెట్టి ఏలుకో'' తీర్పు ఇచ్చాడు జడ్జి జగన్నాథం.

ఎర్రగళ్ల క్యాలండరు
కొత్త క్యాలండరు కొనడానికి వెళ్లిన విద్యార్థి వీరగం«ధానికి ఎన్ని రకాల క్యాలండర్లు చూసినా నచ్చట్లేదు. విసిగిపోయిన కొట్టువాడు "ఇంతకీ నీకు ఎలాంటి క్యాలండరు కావాలి?'' చిరాగ్గా అడిగాడు.
"ఎర్రగళ్లు ఎక్కువుండే సెలవుల క్యాలండరు'' పరధ్యానంగా చెప్పేడు వీరగంధం.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి