14, మార్చి 2012, బుధవారం

కాపీ రైట్స్ సమస్య

ఆర్యా, ముందుగా ఒక విన్నపం. నీను ఇక్కడ వాడే బాషలకు బాషలలోని  పదాలకు, అక్షరాలకు  నా దగ్గర ఎటువంటి కాపీ రైట్స్ లెవ్వు. వీటి పైన ఎటువంటి కాపీ రైట్స్ మీ దగ్గరవున్నా చెప్పండి వెంటనే వాటిని వాడటం మానేస్తా. ఈ టపా నీను ఆలోచించే రాస్తన్నాను, ఏదైనా సమస్య వుంటే, దయచేసి  బట్టలు చించుకోవోద్దు.


అవును మీరు ఎప్పుడన్నా కాపీ  రైట్స్ కొనుక్కొని అ ఆ లు నేర్చుకున్నారా? పోనీ, వాడే బాష, దానిలో పదాలకు మీరు ఎప్పుడన్నా కాపీ  రైట్స్ కొనాలి అని ఆలోచించారా? అవును ఈ google లో బ్లాగ్ స్పేస్, fonts, colors కొనుక్కొని blogs రాస్తున్నారా? ఓహో ఇవన్నీ ఉచితమా.... అంటే నీను ఇప్పుడు ఉచితానికి, కాపీ  రైట్స్ కి తేడా తెల్సుకోవాలి కాబోలు......


0 కనిపెట్టిన ఆర్య భట్ట,  కాపీ  రైట్స్ ఉంటేనే వాడండి లేకపోతే తోలు తీస్తా అన్నాడా? ఎవరు తేరగా ఇచ్చారని మనం ఇవన్ని కాపీ  రైట్స్ లేకుండా వాడుతున్నాం? 


copy rights , ఆంగ్ల పదాలు కదా !! మనం తెలుగు అక్షరాలు వుపయోగించి ఎందుకు రాస్తున్నాం? దీనికి మనదగ్గర కాపీ  రైట్స్ ఉన్నాయా? ఎ year లో, ఎప్పుడు, ఎలా, ఎవరిదగ్గర మనం ఈ  రైట్స్ కొన్నాం? ఇక్కడ మనం అంటే తెలుగు వాళ్ళు, తెలుగు వాడే వాళ్ళు. 


 కాపీ  రైట్స్ గొడవ ఈమధ్య బాగా పెద్ద సమస్య గా మారి నాలాంటి చిన్న వాళ్ళను కోడా వదలడం లేదు. 


ఎవరన్నా వేరే బ్లాగ్స్ నుంచి కాపీ చెయ్యడం కచ్చితంగా తప్పే. ఆ తప్పు నీను ఎప్పుడు చెయ్యలేదు, చెయ్యను. ఇది నా ఆన.....



రచయిత(త్రి)లకు ఒక విన్నపం, మీరు రాసే వాటిమీద మీకు 100% కాపీ  రైట్స్ మీవే. మీ రచనలను ప్రచరించే ముందు ఒక చిన్న హెచ్చరిక పెట్టండి " కాపీ  రైట్స్ ఎవ్వరికి ఇవ్వడం లేదు అని ". అది చదివి ఎ తలక మాసిన వెధవ కాపీ చెయ్యడు.


నీను చాల clear గా చెప్పను,
నా బ్లాగ్ లో ఎటువంటి వాణిజ్య ప్రచారాలు లేవు, ఇది ఎటువంటి డబ్బు సంపాదనా ఆశతో మొదలు పెట్టిన బ్లాగ్ కాదు. ఐనా అదేమి పట్టించుకోకుండా .....

నిన్నటి నుంచి ఒక పెద్దమనిషి నీను రాసిన కామెంట్ కి ఇలా బదులు ఇచ్చాడు.


రామ్: రచయితలు రాస్తున్నారు, మా లాంటి వారు ప్రాచుర్యం కలిపిస్తున్నాము
పెద్దమనిషి: అయ్యా మీరు చేస్తున్న పనికి సాహితీ సేవ ముసుగు బాగుండదు. మీ బ్లాగుని రోజూ కొన్ని వేలమంది సందర్శించినప్పుడు ఈ మాట ఒప్పుకుంటాను.
ఇప్పుడు రామ్: అయ్యా !! నా బ్లాగ్ రోజు కొన్ని వేలమంది సందర్శిస్తే నీను కాపీ చెయ్యడం మీకు ఓకే. అంటే మీకు ఉచిత ప్రచారం వేలల్లో కావాలి. బాబు!!! నా తొక్కలో కాపీ బ్లాగ్ కి అంత సీను లేదు. 


రామ్:మీరు రాసే కథలు పత్రికలో ప్రచురించాక అక్కడ వాటి జీవితం ఒక్కరోజే, మా బ్లాగ్ వాటికి ప్రాణం పోస్తోంది.
పెద్దమనిషి: పత్రికల్లో వచ్చిన కథ ఒక్కరోజులో చచ్చిపోయేటట్లైతే బ్లాగులు పుట్టకముందు వచ్చిన కథలన్నీ ఈ పాటికి అందరూ మర్చిపోయి వుండాలి. అలా జరగలేదే.
ఇప్పుడు  రామ్: అయ్యా !! గత 50 years నుండి తెలుగు లో రోజుకు కనీసం మూడు పత్రికలు ఒక్కో కధ చొప్పున ప్రచురించినా అవి ఇప్పటికి సరాసరి 54750 కధలు ఎక్కడో ఒక్కాడ పోగు పడి వుండాలి, ఎక్కడ ఉన్నవో చెప్పు మహానుబావా!! ఎవరు వాటిని పోగు పెట్టారో చెప్పగలరా కనీసం !! నీను పోగేసే బాధ తప్పుతుంది.

రామ్:మీరు మొక్క నాటారు, మీము నీరు పోస్తున్నాం 
 పెద్దమనిషి: మొక్క నాటుకున్నవాళ్ళం నీళ్ళు పోసుకోలేమా... మా రచనలు నచ్చితే (లేదా నచ్చకపోయినా) ఆ రచన ఎందుకు బాగుందో, ఎందుకు బాగలేదో రాయండి.
ఇప్పుడు  రామ్:  అయ్యా !! ఎవరు  నీరు పోస్తే ఈ అడువులు? ఎవరికీ తెల్సు మీకూ ఓ బ్లాగ్ వుంది అని. మీకు బ్లాగ్ వుంది, అక్కడ కామెంట్స్ రాస్తాం సరే, మీలా బ్లాగ్స్ లేని పేద రచయిత(త్రి)ల సంగతో !! అంటే వారి మొక్కలకి మీరే నీరు పోస్తున్నారా?


చివరగా: అయ్యా ఈ తొక్కలో గొడవ ఎందుకు కాని, మీ రచనలు మీరే చేసుకోండి, మీరే చదువుకోండి, మీరే దాచుకోండి, మాకు బహు సంతోషం. "కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని". అమ్మో ఈ సామెత మీద ఎవరికి కాపీ  రైట్స్ వున్నాయో ఏమో....................

ఇన్ని వింత సమస్యలు వుంటే, వేరే మంచి పనులు చెయ్యాలి అని వున్నా, జనాలకు దడిసి ఎపని చెయ్యలేరు. అందుకే మనలో చాలా మంది మనకు ఎందుకు అన్న ధోరణి , ఇది నాకు ఇవ్వాళ కళ్ళు తెరిపించిన విషయం....

ఈ టపా మీద కామెంట్స్ రాయాలి అనుకుంటే, దయచేసి ఇక్కడే రాయండి, దయచేసి నాకు మెయిల్ రాయమాకండి......

6 కామెంట్‌లు:

  1. రాము గారు, మీ ఆవేదన సబబే.
    ఐతే మీ బ్లాగులో text selection ఎందుకు ఆపేశారు ? ఎవరూ copy చేసుకోవద్దనా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ గారు, మీరు నా ఆవేదనను అర్ధం చేసుకున్నదుకు ధన్యవాదాలండి. Text Selection నీను కావాలని control చెయ్యలేదు. ఎక్కడో ఒక టపా లో చదివి ఆ ఆముదం "script" నా టపాకి రాసాను, కాని అది google chrome లో పని చెయ్యలేదు, మీ కామెంట్స్ చదివితే తెల్సింది ఆ ఆముదం పనిచేస్తోంది అని. ఆ జిడ్డు వెంటనే తోలిగిస్తాను.

      తొలగించండి
  2. తాళాలు పెట్టినా, విరగ్గొట్టక మానం అంటారు ! అసలు ఇంటికే తాళాలు పెట్టకూడదంటారు.

    శ్రీనివాసు గారు మంచి లొసుగు కనిబెట్టి నట్టు ఉన్నారు ఈ తాళాల విషయం లో. బ్లాగోదరులు ఏమి చెబ్టారో చూడాలి !


    జిలేబి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు మీ వాక్యాలకు ధన్యవాదాలండి, నా టపాలో ఎక్కడా తాళాలు వెయకండి, వేసినా పగలగొట్టండి అన్నసమాచారం లేదండి. దయచేసి మరో సారి చదవండి.
      కాపీ రైట్స్ సమస్య నన్ను తట్టి లేపినప్పుడు, కొన్ని బ్లాగ్స్ తిరగేసాను, 98% బ్లాగ్స్ లో కాపీ కార్యక్రమాలు విరివిగా జరిపి టపాలు రాసారు.
      కాపీ రైట్స్ లేకుండా కాపీ చేసారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ: బ్లాగ్స్ లో జనాలు కాపీ చేస్తున్న చిత్రాలు 'pictures', videos , animated stuff వారు గీసి /తీసి ఉపయోగిస్తున్నారా? లేక కాపీ రైట్స్ కొనుక్కొని చేస్తున్నారా?

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. ధన్యవాదాలండి, మీ కోణం నుండి టపా చదివతే అర్ధమైంది, సరి చేసాను.

      తొలగించండి