11, మార్చి 2012, ఆదివారం

ఈ సైట్ మీకు తెలుసా?


  • -వెంకట్ హేమాద్రిబొట్ల
ఈ రోజున మనలో ఎంతోమంధి ఇంట్లో ఎంత సమయం గడుపుతున్నా మో అంతే సమయం, ఆ మాటకొస్తే ఇంకా ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతున్నాం. అలాంటప్పుడు ఇంట్లో ఎలా హ్యాపీగా ఉందాం అనుకుంటామో అలాగే ఆఫీసులో కూడా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఈ ఆఫీస్ పనుల్లో కొన్ని చిన్నచిన్న ఒక్కోసారి పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకి సమాధానాలు, సూచనలు ఇచ్చే సైట్ ఒకదాని గురించి తెలుసుకుందాం.
http://www.humansolutions.org.uk/index.html
అటు యాజమాన్యానికీ ఇటు ఉధ్యోగులకూ చక్కటి సూచనలు ఇచ్చే సైట్ అడ్రస్ ఇది.
మానవ వనరులు ఒక కంపెనీ పురోగతిలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి. సంస్థలో పనిచేసే ఉద్యోగుల బాగోగులు పట్టించుకుంటే, వారికొచ్చే చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తే, ఆ సంస్థ యొక్క ఉత్పాదకత పెరుగుతుందని చెప్తుందీ సైట్. అలాగే ఉద్యోగులకి, ఈ సమస్యలని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అని సూచిస్తుంది.
వత్తిడి
ఇందులో భాగంగా ఈ విషయంలోని పలు అంశాలని చెబుతూ ముందుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న వత్తిడి గురించి ముందుగా ప్రస్తావించబడింది.
* వత్తిడి అంటే ఏమిటి? వత్తిడి యొక్క కారణాలు - * మీరు లేక మీ సహోద్యోగులు వత్తిడి ఎదుర్కొంటున్నారా?
* మీ సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ విధుల నిర్వహణలో వత్తిడి ఎదుర్కొంటున్నారా? అది తెలుసుకోవడం, నివారించడం ఎలా?
బెదిరింపులు, వేధింపులు..
* ఆఫీస్‌లో బెదిరింపులకు, వేధింపులకు ఎవరైనా పాల్పడుతున్నారా?
* నేను బెదిరింపులు/ వేధింపులకు గురవుతున్నాను. నేనేం చేయాలి?
* నా సహోద్యోగికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ఏం చేస్తే మంచిది?
* నేనేదో అందరినీ బెదిరిస్తాను అనే ముద్ర నాకు కలుగకూడదు. ఎలా?
* ఒక మేనేజర్‌గా ఇలాంటి సమస్యలు ఏవీ నా ఆఫీసులో ఉండకూడదు.
వౌనంగా భరిస్తూ, బాధపడుతూ ఉండకుండా వాటిని ఎదుర్కొని, పరిష్కరించుకోవడానికి సూచనలు ఇందులో ఉన్నాయి.
వివక్ష
* నేను వివక్షకి గురవుతున్నాను. పరిష్కారం ఏమిటి?
* నా సహోద్యోగి వివక్షకి గురవుతున్నారు. ఏం చేయవచ్చు?
* నేను ఒకరిని వివక్షకి గురి చేస్తున్నాను అని అపవాదు రాకుండా ఎలా మసలుకోవాలి?
* సంస్థలో ఎవరూ ఇలాంటి పరిస్థితి వేరే ఉద్యోగి వల్ల ఎదుర్కోకుండా ఉండాలంటే ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి అని యాజమాన్యానికి సూచనలు.
ఇలా ఈ సమస్యలన్నిటినీ ఎలా సాల్వ్ చేయాలన్నది వివరిస్తారు.
మనస్పర్థల పరిష్కారం - సమిష్టి కృషి ఆవశ్యకత
ఏ పని అయినా సమిష్టి కృషి ద్వారానే సాధ్యమవుతుంది. కాని ఇందులో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు, యాజమాన్యం వీటిని ఎలా అధిగమించాలి అని తెలియజేస్తుంది తరువాతి సెక్షన్. ఇందులో వివిధ అంశాలు:
* మనస్పర్థలు ఎందుకు ఉత్పన్నమవుతాయి?
* వాటి నివారణ ఎలా?
* మనస్పర్థలు వచ్చినపుడు ఏ విధంగా సర్ది చెప్పాలి?
* వాటిని ఎలా పరిష్కరించాలి?
* సమిష్టి కృషి ఎలా వీలవుతుంది. ఆ కృషి ద్వారా మంచి ఫలితాలు సాధించే ప్రయత్నం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి