19, మార్చి 2012, సోమవారం

ఇంద్రియ నిగ్రహం అవసరం


హితవచనం
మనిషి కోర్కెలు కళ్లాలు లేని గుర్రాల వంటివి. ఎన్ని తీరినా కొత్తవి పుట్టుకొస్తుంటాయి. ఒక జబ్బు ఉంది. ఉర్దూలో దాని పేరు, ‘జొవా అల్ బఖ్.్ర’ దీని చిహ్నాలు ఏమంటే ఆకలి తీవ్రంగా, అడూ ్డఅదుపూ లేకుండా ఉంటుంది. మనస్సుకు ఏది కావాలనిపిస్తే అది, ఎంత కావాలనిపిస్తే అంత, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తింటాడు, కాని ఆకలి మాత్రం తీరదు. దీని మాదిరే మరొక వ్యాధి ఉంది. దానిపేరు ‘‘ఇస్తెసెఖా’’. ఈ జబ్బులో చెంబులకు చెంబులు నీరు తాగినా దప్పిక తీరదు. ఈ వ్యాధులవంటివే కోర్కెలు కూడా!

కొందరికి పాపకార్యాలు చేయడమంటే ఎంతో ఇష్టం. ఆ పనులు చేసి, వాటి ఫలితమనుభవించే వరకు ఆ మనసు కుదుటపడదు. ‘గజ్జి’ జబ్బు గలవానికి ఎంతగా గోకితే అంత హాయిగా ఉంటుంది. అయితే ఆ తరవాత ‘‘ఓరి దేవుడా! నేనెందుకంతగా గోక్కున్నాను’’ అని బాధపడవలసి వస్తోంది. పాపకార్యాల మీద ప్రేమ కూడా అలాంటిదే.

అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కోరిక వెంబడి పడవద్దు అని చెబుతున్నారు. కోరికలను అదుపులో ఉంచుకోవాలి. మొదట కష్టంగా ఉంటుంది. ఆందోళన కలుగుతుంది. ఓపికతో పాటిస్తే అనుకున్నది సాధించవచ్చు. హృదయానికి, మనస్సుకు సంఘర్షణ జరుగుతుంది. నష్టాన్ని గుర్తించిన మనస్సు దాని ఒత్తిడిని ఎదుర్కొని అనుకున్నది సాధించాలని ప్రయత్నిస్తుంది. ఇంద్రియ నిగ్రహం అన్నివేళలా పాటించాలి. అప్పుడే సత్ఫలితాలను సాధించవచ్చు.

- షేఖ్ అబ్దుల్ హఖ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి