ఇది చదివాక, కోసే ముందు, వొండె ముందు, తినే ముందు , తిన్నాక ఆహార వృధాను అరికట్టండి. ఈ గోల ఈ మధ్య బాగా ఎక్కువ అఇంది.
వృధా కథ!
ఎం.కోటేశ్వరరావు
ఇథియోపియా, సోమాలియా, సబ్ సహారా దేశాలలో ఏటా పెరుగుతున్న అన్నార్తుల సంఖ్యను తగ్గించటం ఎలా అని అందరూ ఆలోచిస్తుంటే ఆహార వృధాను అరికట్టటం ఎలా అని ఐరోపా పార్లమెంట్ చర్చిస్తోంది. మొత్తం కాకపోయినా కనీసం వృధాలో సగమైనా తగ్గించండి అంటూ మొరపెట్టుకుంటోంది. వృధాగా పడేస్తున్న ఆహారం ఐరోపా పర్యావరణ రక్షణకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. మెకెన్సీ గ్లోబల్ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రపంచంలో ప్రతిరోజూ కోటి టన్నుల ఖాద్య తైలాలను లేదా అన్ని ఆహార పదార్ధాలలో 30 శాతాన్ని వృధా చేస్తున్నట్లు వెల్లడించింది. ఐరోపాలో గృహాలు, హోటళ్లలో ఎక్కువగా వృధా జరుగుతున్నట్లు పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉత్పాదక దశలోనే వృధా అవుతోంది. 'పొలం నుంచి పళ్లెంలోకి' వచ్చే మధ్యలో జరుగుతున్న వృధాలో 2025 నాటికి కనీసం సగమైనా తగ్గించేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకోవాలని, 2013ను ఆహార వృధా వ్యతిరేక సంవత్సరంగా పాటించాలని ఐరోపా యూనియన్ పిలుపిచ్చింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి