18, ఫిబ్రవరి 2012, శనివారం

మార్పుకోసం

గళ్ల లుంగీ... కోరమీసం... ముఖానికి పెద్ద గాటు, కుంకుడు గింజంత పెద్దసైజు పుట్టుమచ్చ, మెడ కు కట్టుకున్న కర్చీప్‌. ఒకప్పటి తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించే దొంగ ఉరఫ్‌ విలన్‌ లేక దుర్మార్గుడు. వాటికి గంగులు, రత్తయ్య లాంటి చిత్ర విచిత్రమైన పేర్లు ఉంటాయి. ఇప్పటి తెలుగు సినిమాలలో ఉండే విలన్లు డాన్‌లుగా రూపాంతరం చెందారు. వా ళ్లు విదేశాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని అవసరమైతే హీరోనే అక్కడికి రప్పించుకుంటారు. విలనీయులంటే ఇలాగే ఉండాలి అని తెలుగు ప్రేక్షకులు కళ్లు పెద్దవి చేసుకుని మరీ ఈ చిత్రా లను ఎంతో ఓపిగ్గా చూశారు. ఇప్పుడు తెలుగు సిని మా నిర్మాతలు విలన్లను ఏ కోణంలో ఎలా చూపించాలా అని బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు.

కట్‌ చేస్తే మన రాజకీయరంగం కూడా సినీరంగాన్ని పోలి ఉం టోంది. రెంటికీ సారూప్యం బాగానే కనిపిస్తోంది. అ యితే తెలుగు సినిమాలలో విలనీయులను అప్పుడే పుట్టిన పిల్లోడు కూడా ఇట్టే కనిపెట్టేస్తాడన్నమాట. కా నీ రాజకీయాలలో విలన్లు ఎవరో హీరోలు ఎవరో కనిపెట్టడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఒకప్పటి రాజకీ య నేతలకు కొన్ని ప్రత్యేక నాయకత్వ లక్షణాలతోబా టు నిస్వార్థం, పరోపకారం, నీతి, నిజాయితీలాంటి ల క్షణాలను పుణికిపుచ్చుకున్నట్లు కనిపించేవారు. రానురానూ రాజకీయ నేతలు కూడా పరోపకారం ముసుగులో ఎన్నో అక్రమాలు చేసేస్తున్నారు. అయినా ప్రజలకు ఇవేమీ పట్టవు. ఎలక్షన్లలో ఎవరు వాళ్ల కు డబ్బులిస్తే ఓటు వాళ్లకే అని డిసైడ్‌కి వచ్చేస్తారు.

పైగా ఎవడొచ్చినా చేసేదేముంటుంది కనుక అని ఓ వైరాగ్య డైలాగ్‌ కొడతారు మరీ... ఇక ప్ర జల నుంచి ఓట్లను చాలా ఈజీగా రాబట్టేయడం అలవాటుచేసుకున్న నేతలు అసెంబ్లీలో, బైట త మ అసలు రూపాన్ని బైటపెడుతుంటారు. మారే కాలంతోబాటు అన్నీ మారిపోతున్నాయి. ఈరోజు ల్లో రామాయణ, భారత కథలను కూడా గ్రాఫిక్స్‌ మాయాజాలంతో కాల్పనికతను జోడించి తీసేస్తారు.గతంలో మహాభారత యుద్ధం సైతం బాణాలతో, గదలతో ముష్టిఘాతాలతో సాగేది. రామాయణం అంతే రాముడు మహాబలసంప న్నుడైనా, బాణాలతో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కొద్ది పాటి మెరుపులు మెరిపించేవాడు. టెక్నాలజీ పెరిగింది గ్రాఫిక్‌ మయా జాలం దేవుళ్లనుసైతం వశం చేసుకుంది.

కాలం మా రింది టెక్నాలజీ పెరిగింది మరి దేవుళ్లు సైతం మారిన కాలానికి తగ్గట్టు యుద్ధాలు చేస్తున్నారు. ఇవన్నీ కూ డా మార్పునకు సంకేతాలు. మార్పు తప్ప ఏదీ శాశ్వ తం కాదు ప్రపంచంలో అన్నీ మారుతాయి అంటారు. మారాల్సిందే. తప్పదు మరి! కాలం ఇంత మారినా దేవుళ్లు, మనుషులు, దొంగలు, సైతం సంస్కరణల బాటపట్టి మారు తుంటే మన రాజకీయ నాయకులు మాత్రం దశాబ్దాల క్రితం నాటి స్క్రిప్‌‌టను మార్చడం లేదు. డైలాగులు మారడం లేదు. అందుకే కాలం మా రింది స్క్రిప్ట్‌ మార్చండయ్యా అనేది. మురికివాడల్లో ముక్కుచీమిడి కారే పిల్లలను ముద్దుపెట్టుకుంటూ కెమెరాలకు ఫోజులిచ్చే సాంకేతికత ఇందిరాగాంధీ రాజ కీయాల్లోకి వచ్చిన కొత్తనాటిది.

సరే నానమ్మ వారసత్వంతో ఆమె మనవడు రాహుల్‌గాంధీ రాజ కీయ శిక్షణలో భాగంగా పేదవారి గుడిసెల్లో దూరి వాళ్లు తినే భోజనం చేయడం లాంటి పనులు జనాలకు నవ్వు తెప్పిస్తున్నాయి. కాలేజీలకు వెళ్లి రాజకీ యాల గురించి మాట్లాడితే పిల్లచేష్టలు అనుకోవచ్చు. 60 ఏళ్లు దాటి, రిటైర్‌మెంట్‌కు చేరువైన వారూ అవే నాట కాలా? తల్లిదండ్రులనే మా ఆవిడ వద్దంటుంద మ్మా !అంటూ వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న కాలమిది... అలాగే దశాబ్దాల తరబడి ఓదార్పులు అంటూ జ నం మీద పడితే నమ్ముతారా? ఆన్‌లైన్‌లో పంట లు పండించవచ్చునని నమ్మేవారు సైతం పంట పొలాల వెంటపడి రైతులకే నా జీవితం అంకితం అని ఎంత కాలం చెబుతారు. దళితుల అభ్యున్నతి కోసమే పుట్టామని ఎంత కాలం చెప్పుకుంటారు.

18 85లో కాంగ్రెస్‌ పుట్టాక, వచ్చిన తొలి ఎన్నికల్లో చెప్పి న మాటల నుండి నిన్నమొన్న పుట్టిన పార్టీ వరకు అ న్ని పార్టీల ఎన్నికల ప్రణాళికలో అవే డైలాగులు పేద రిక నిర్మూలన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి వగైరా... వగైరా, తళతళలాడే ఖద్దరు డ్రెస్సు, మెడలో కండువా. ప్రతిసారి బడ్జెట్‌పై చెబుతారు అదేంటీ ఆ కొత్త సీసాలో పాతసారా! అని అలానే మీరు పార్టీల పేర్లు మారుస్తున్నారు తప్ప అదే వ్యాపారం, అవే డైలా గులు, అదే స్క్రిప్ట్‌. స్క్రిప్ట్‌ మార్చండి. కొత్త డైలాగులు చేర్చండి...

- నండూరి రవిశంకర్‌

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి