
అందుకే ప్రతి వస్తువులోను ఇతర వస్తువుల లక్షణాలు అంతో ఇంతో ఉన్నాయని పెద్దలు చెప్తారు. భూమిలో సగ భాగం భూమి అయితే మిగి లిన సగ భాగంలో నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్ని కలిసి ఉంటాయి. అలాగే మిగిలిన భూతాల్లో కూడా. ఎండమావిలో నీరున్నట్లు తో చడం, ఆకాశజలం వంటివి పంచీకరణకు ఉదాహరణ. అదేవిధంగా మానవ దేహం కూడా పంచభూతాత్మకమే. మనం వ్యక్తిగతంగా, సమష్ఠి గా చేసే కర్మలను బట్టి దైవమే పంచభూతాల ద్వారా ఆయా కర్మ ఫలాలను అందిస్తాడు. అం దుచేతనే పంచభూతా త్మకమైన మానవుడు మంచి విషయాలకు పంచభూతాలను సాక్షులుగా తీసుకుంటాడు.
శరీరమే పంచభూతాలమయం..

పంచభూతాలను తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు
‘నీ వెవరివో నాకు తెలియదు. వెళ్లిపో!’ అన్న దుష్యంతునితో శకుంతల ‘విమలయశోనిధీ! పురుష వృత్త మెఱుంగుచు నుండు జూవె వేదములును పంచభూత ములు...’ (భారతం, ఆదిపర్వం, 4-80)- ‘మన ఇద్దరికీ వివాహం జరిగిన విషయం పంచ భూతాలకు తెలుసు’ అన్నది. పూర్వం ఒక గురువు తన శిష్యలను పిలిచి తలా ఒక అరటి పండునిచ్చి ‘అబ్బాయిలూ! ఎవ్వరూ చూడకుండా, ఎవ్వరి కంట పడకుండా వీటిని తిని రండిరా!’ అన్నాడు. ఒకడు గురుకులంలోనికి వెళ్లి తలుపులు బిడాయించు కొన్నాడు. మరొకడు నిండా దుప్పటి కప్పుకొన్నాడు. అలాగే మరికొంత మంది. అందరూ అరటిపండ్లు తిని వచ్చేశారు. ఒక్కడు మాత్రం తినకుం డానే వచ్చి ‘ఎవ్వరూ చూడకుండా తినటం నావల్ల కా లేదండీ!’ అంటూ పండును గురువుేక తిరిగి ఇచ్చివేశాడు.
‘ఎందుకురా?’ అన్నాడు గురువు. ‘ఎక్కడికి వెళ్లినా నేల, గాలి, ఆకాశం ఉన్నాయండీ వాటి కంట పడకుండా తినలేకపోయానండీ!’ అన్నాడు వినయంగా. మనం మంచివి కానివ్వండి, చెడువి కానివ్వండి- ఏ పనులు చేస్తున్నప్పటికీ ‘ఎవ్వరూ చూడటం లేదులే!’ అనుకోవటం పొరపాటు. సాటి మనుషలు, అధికారులు, రక్షకభటులు మొదలైన వాళ్లు చూడకపోవచ్చు. పంచభూతాలు చూస్తూనే ఉంటాయి. వాటి కళ్లుకప్పటం మన తరం కాదు. మనం చేసే ప్రతిపనికీ అవి ప్రత్యక్ష సాక్షులు. అందుకే పంచభూతాల పట్ల ప్రతి వ్యక్తి భక్తిశ్రద్ధలు కలిగివుండా లి. అవే మనుకు ప్రత్యక్ష దైవాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి