18, ఫిబ్రవరి 2012, శనివారం

ఐఎఎస్ + ఐపిఎస్ = కోడే --> ఎద్దు

ఈ టపా కి పెట్టిన టైటిల్ చూసి ఇదేదో రసాయన శాస్త్రం లో గణితం కలిపి కొడుతున్నా అనుకునేరు. నా ఎదవ తెలివి తేటలు కాకపోతే, ఈ సోది చెప్పేదేదో సరిగా చెప్పేస్తే పోలే...
సరే సరి, దారిలోకి వోచ్చేస్తున్నాను, నాకు చిన్నప్పటినుండీ కొన్ని పదాలు వింటే లాగు వూడి వొళ్ళు చెమటల్తో తడిసి ముద్ద అయ్యేది, ఆ పదాలలో టాప్ టెన్ లో వుండేవి ఈ ఐఎఎస్ , ఐపిఎస్.

ఇప్పుడు కొన్ని నిజాలు రాస్తాను చదవండి.
ముఖ్యగమనిక, అందరిని ఒకే గాటికి కట్టడం లేదు, నాకు గుర్రానికి , గాడిదకి తేడా తెల్సు. మీకు తెల్సిన మంచి వాళ్ళు వుంటే బట్టలు చిన్చుకోమాకండి , ఈ టపా వెధవల గురించి రాస్తున్నాను ....
దిన పత్రికల్లో లలో చదివే వాడిని, మొదటి దెబ్బకే గ్రూప్-1 కొట్టిన రైతు బిడ్డ, పదో దెబ్బకు  ఐపిఎస్ కొట్టిన రిక్షా కార్మికుడు. చెప్పగా లాగు వూడి వొళ్ళు చెమటల్తో తడిసి ముద్ద అయ్యేది అని. ఇలాంటివి చదివి తే మనిషి అన్నవాడికి ఎవ్వడికి ఐనా ఎంతో కొంత చలనం రావల్సిదే, అదే నాకు జరిగేది కాని కాస్త ఎక్కువగా..... ఈ మధ్య అవె దిన పత్రికల సమాచారం తల పిచ్హి ఎక్కిస్తున్నా చలనం కలగ లేదు. కాని ఈ రోజు నాకు జరుగుతున్న అనుభవం నా చేత రాయిస్తున్న టపా (అనుభవం  మరో సారి పంచుకుంటా)

అస్సలు విషయం .... ఐఎఎస్ + ఐపిఎస్ = కోడే --> ఎద్దు

కోడే పుట్టిన మొదటి ఏడాది వోరకు ఆహ వోహో , రెండవ ఏడాది మొదలు అది సీతయ్య టైపు 'దాని మాట అదే వినదు'. మానవుడు వొట్టి వెధవ, వాడి ముందా ఈ తొర్రి నాటకాలు, అప్పుడు జనాలకు ఈ కోడే ఆగడాలు ఎక్కడో కాలి ఓ మంచి రోజు ఎద్దు కొట్టేస్తారు (ఎద్దు కొట్టే అనుభవం మనిషి అన్న వాడికి ఎవ్వడికి రాకోడదు, దాన్ని బరించడం కంటే చావడం మేలు, అనుభవం అంటే, కొన్ని చూసినా చాలు తెలుస్తుంది వాటి మజా).
ఇప్పుడు మన కోడే, కోడే కాదండో అది ఎద్దు, అంటే సినిమాలో *****  నుంచి పాలిటిక్స్ ***** లా .

ఎద్దు అయ్యాక దాని పని అంటారా, ఏముంది పెట్టిన గడ్డి తిని పోసిన కుడితి తాగి , చెప్పిన పని చెయ్యడం. ఎలాగు అది బండి లాగడం , అరక లాగడం లాంటి పనులు తప్ప దేనికి పని రాదు కదా....

మన రైతు బిడ్డలు, రిక్షా కార్మికులు  ఐఎఎస్ , ఐపిఎస్  లు (కోడే --> ఎద్దు) గా మారి, ఎవడో ఎదవ , సన్నాసి చెప్పినవి విని తల ఆడిస్తూ, పనులు చేసేస్తూ , రోజు కావాల్సిన గడ్డి తిని పోసిన కుడితి తాగి నా లాంటి , నీ లాంటి సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
ఎందుకంటే వీళ్ళకు వేరే ఏ పని లేదు గా "బండి లాగడం , అరక లాగడం తప్ప". వీళ్ళు ఆడ ఐనా మొగ ఐనా సంసారానికి పని చెయ్యరు, ఎద్దు లా.
ఈ నా కో* లను టైటానిక్ ఎక్కించాలి. ఆరోజు ఎంతో దూరం లేదు. వీళ్ళలో చాలామంది కి విదేశాలలో కొలువు, అదేనండి విదేశాంగశాఖ, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ జీవితాలు ఎద్దు లానే. అందరి దగ్గరా గడ్డి, కుడితి కావాలి. వీళ్ళ బతుకు

ఏదో సినిమాలో మహేశ్ బాబు చెప్పినట్టు "ఏ దేశం లో వున్నాం అని కాదు అన్నయ్య, గడ్డి తిని , కుడితి తాగామా లేదా".................

1 కామెంట్‌: