ప్రభుత్వం పనితీరు
ఒక ప్రాంతంలో దొంగలు ఎక్కువగా పడుతున్నారని గస్తీ కోసం ఒక నైట్ వాచ్‌మేన్‌ను నియమించాలనుకుంది ప్రభుత్వం.
ఆ వాచ్‌మేన్ సరిగ్గా పనిచేస్తున్నాడో లేదో ఎలా తెలుస్తుంది? అందుకోసం ఆయనపై ఒక నిఘా సూపర్‌వైజర్‌ని నియమించారు. వాళ్లిద్దరికీ వేతనాలు ఇవ్వాలి కదా! అందుకోసం ఒక అకౌంటెంటును, టైం కీపర్‌ను తీసుకున్నారు. వీరందరినీ పర్యవేక్షించేందుకు ఒక ఆఫీసరును వేశారు. ఆయనకు ఒక సెక్రటరీని, ఒక బాయ్‌ని కూడా ఇచ్చారు. తీరా చూస్తే బడ్జెట్ ఎక్కువైపోయింది. ఉద్యోగాల్లో కోత విధించాలని పైనుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వాచ్‌మేన్‌ను తొలగించారు.
ఏ లోటూ రానివ్వమండి!
"మీ హోటెల్లో అద్దెకు గదులున్నాయా?''
"ఉన్నాయండి.''
"టీ, కాఫీ, ఫలహారాలు సప్లయ్ చేస్తారా?''
"ఉండవు కానీ, సప్లయ్ చేస్తామండి.''
"భోజనం?''
"సప్లయ్ చేస్తామండి.''
"మందు కావలిస్తే?''
"సప్లయ్ చేస్తామండి.''
"వెరీగుడ్! అన్నట్టు రూంలో దోమలున్నాయా?''
"లేవు గాని వాటినీ సప్లయ్ చేస్తాములెండి!''
తీరిన కోరిక
"మా ఆవిడ ఖరీదైన ఇంట్లో ఉండాలని పోరు పెట్టేది. ఈ నెలతో అది తీరబోతోంది'' చెప్పేడు వరదరాజులు.
"ఎలా? ఖరీదైన ఇంటికి మారబోతున్నావా?'' అడిగాడు గోవిందరాజులు.
"కాదు, మా ఇంటాయన అద్దె పెంచాడు'' తాపీగా చెప్పేడు వరదరాజులు.
పునరావృతం కారాదు
"మన అమ్మాయికి మంచి గుణవంతుడ్ని, అందగాడిని, తెలివైనవాణ్ణి వరుడిగా తీసుకురావాలని ఆలోచిస్తున్నాను'' చెప్పేడు భర్త ఏకాంబరం.
"అవునవును. ఈ విషయంలో మానాన్న చేసిన పొరపాటు మీరు చేయకూడదు సుమా!'' సలహా ఇచ్చింది భార్య తాయారు.
ముందు జాగ్రత్త చర్య
"మానసిక వేదన తగ్గడానికి ఏమైనా మాత్రలున్నాయా అంకుల్?'' అడిగాడు చింటూ.
"ఇవిగో, ఇవి రెండు మాత్రలు వేసుకుంటే ఎలాంటి బాధైనా చిటికెలో పోతుంది'' చెప్పేడు మెడికల్ షాపు మనిషి.
"థాంక్స్ అంకుల్- డబ్బులివిగోండి!''
"మాత్రలెవరి కోసం?''
"మా నాన్నకిలెండి. ఈ రోజు నా ప్రోగ్రెస్ కార్డు చూపించాల్సి ఉంది'' చెప్పి తుర్రుమన్నాడు చింటూ.
అలాంటి చీరలు లేవా?
"ఎన్ని వందల చీరలు చూసినా మీకు నచ్చట్లేదు. ఇంతకూ మీకు ఎలాంటి చీర కావాలమ్మా?'' చీరల దొంతర్ల మధ్యనుండి తలకాయ బయటికి పెట్టి నీరసంగా అడిగాడు కొట్టువాడు కోటిరత్నం.
"మా పక్కింటావిడ మూర్ఛపోయే చీర'' ఠపీమని చెప్పింది మంగతాయారు.
- కె. ఎల్లారెడ్డి, తాడిపత్రి, అనంతపురం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి