4, డిసెంబర్ 2011, ఆదివారం

పెద్దలే బాధ్యులు..


పెద్దలే బాధ్యులు..

పిల్లలు అబద్ధాలు చెప్పడం నుంచి వక్రమార్గాలను పట్టడం వరకూ చాలా విషయాల్లో పెద్దలదే బాధ్యత. ఎన్నో అధ్యయనాలు పెద్దలు చేస్తున్న నిర్వాకాలను ఎండగడుతున్నాయి. ఫేస్‌బుక్‌ను తెరవడం నుంచి చాటింగ్ చేయడం వరకూ పలు సందర్భాల్లో తప్పుడు సమాచారం ఇవ్వాలని పిల్లలను పెద్దలే ప్రోత్సహిస్తున్నారని తాజా సర్వేలో తేలింది. ముఖ్యంగా పదినుంచి 15 ఏళ్లలోపు వయసున్న పిల్లలను ఫేస్‌బుక్‌కు ఆకర్షితులను చేయడం, వాటిని అబద్ధాలు, అభూత కల్పనలతో నింపేయడం ఒక దుష్ట సంప్రదాయం. సామాజిక కట్టుబాట్లకు తిలోదకాలిచ్చి, కొత్తతరంలోకి అడుగుపెట్టాలన్న తమ బలమైన కోరికను తీర్చుకోవడానికే పిల్లలను పెద్దలు పావులుగా వాడుకుంటున్నారని మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ జరిపిన తాజా సర్వేలో తేలింది. తప్పుడు సమాచారం ఇవ్వడం, అబద్ధాలను ప్రచారం చేయడంతో ప్రారంభమయ్యే పిల్లల జీవితాలు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదకరమైన మలుపులు తిరుగుతాయో, ఎంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయో గ్రహించలేకపోతున్నారని మైక్రోసాఫ్ట్ రీసెర్చి తేల్చిచెప్పింది. పిల్లలు చెడిపోవడానికి పెద్దలదే బాధ్యతని స్పష్టం చేసింది. పద్ధతి మార్చుకొని, పిల్లల జీవితాలను తీర్చిదిద్దాలని సూచించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి