|
ఇక్కడ, నాకున్న తెలుగు పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలని లేదు. నేను చాలా వరకు ఎవరో వ్రాసిన, చెప్పిన వాటిని ఒకచోట చేర్చి నా ఆనందం కోసం నేను దాచుకుంటున్న పేజీలు. మీకు నచ్చితే తప్పక చదవండి, మరొకరితో పంచుకోండి. నాకు నచ్చిన విధంగా వ్రాయాలి అనుకుంటున్నాను, నాకు సొంత పైత్యం ఎక్కువ అయింది అనిపిస్తే మందలించండి.
పిల్లలకు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పిల్లలకు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
19, మార్చి 2012, సోమవారం
తెలివి తక్కువ తోడేలు! (కధ)
పేద - గొప్ప(చిట్టి కథ)
|
18, మార్చి 2012, ఆదివారం
సోమరి పని
- పుప్పాల కృష్ణమూర్తి
సభలో కొలువుతీరిన శ్రీకృష్ణదేవరాయలు దగ్గరికి ఒక జంట వచ్చింది. వినయంగా నమస్కరించి ''అయ్యా, మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు పాండయ్య. యుక్తవయసు కూడా వచ్చింది. ఇప్పటికీ మా కష్టంతోనే వాడ్ని పోషించాల్సి వస్తోంది. ఏ పనికి వెళ్లమన్నా వెళ్లడు. బజార్ల వెంట తిరుగుతూ కాలం గడుపుతున్నాడు. వాడి తోటివాళ్ళంతా ఏదో ఒక పని చేసి తల్లిదండ్రుల్ని పోషిస్తున్నారు. వాడికి మీరే బుద్ధి చెప్పి, దారిలో పెట్టాలి'' అని వేడుకున్నారు.
శ్రీకృష్ణదేవరాయలు భటులకు సైగ చేశారు. అది అర్థం చేసుకున్న భటులు పాండయ్యను తీసుకొచ్చారు.
''ఏంటి పాండయ్యా! ఏ పనీ చెయ్యకుండా కాలక్షేపం చేస్తే ఎలా? ఏదైనా పని చెయ్యాలి కదా?'' అడిగారు రాయలువారు.
''అయ్యా! నాదేం తప్పులేదు. నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పట్నించీ పని చేయనీయకుండా గారాబంగా పెంచారు. ఇప్పుడు చేద్దామనుకున్నా పనిరాదని ఎవరూ నన్ను పెట్టుకోవడం లేదు'' చెప్పాడు పాండయ్య.
''నేను నిన్ను పనిలో పెట్టుకుంటా'' అని చెప్పి...
భటులతో ''వీడ్ని తీసుకెళ్లి గుర్రపు శాలలో లద్దె ఎత్తించండి'' ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణదేవరాయలు.
భటులు పాండయ్యని తీసుకెళ్లారు.
''మీకేం భయం లేదు. సోమరితనం పోయి మీవాడు మంచి పనిమంతుడవుతాడు. నిశ్చింతగా ఇంటికెళ్లండి'' అభయమిచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు.
దండంపెట్టి వెళ్లిపోయారా దంపతులు.
లలల
తనకు ఎట్టకేలకు పని దొరికినందుకు సంతోషించాడు పాండయ్య. ఆనందంగా గుర్రపుశాలలోకి అడుగెట్టాడు. తీరా చూస్తే అదంతా చిందర వందరగా, అసహ్యంగా ఉంది. ''నేనీ పని చెయ్యను. వెళ్లిపోతాను'' అని పేచీ పెట్టాడు.
''లద్దె ఎత్తి, పెంటదిబ్బ మీద పడేసి, గుర్రపుశాలను శుభ్రంగా ఉంచుతావో, పనిచేయకుండా రోజుకో వంద కొరడాదెబ్బలు తింటావో నీ ఇష్టం. నిర్ణయించుకో... ఇది రాజుగారి ఆజ్ఞ'' అన్నాడు గుర్రపుశాల కాపలాదారు కాంతయ్య.
''లద్దే ఎత్తుతాను. కొరడా దెబ్బలంటేనే భయమేస్తుంది. అసలే గారబంగా పెరిగాను'' అని తట్ట తీసుకుని లద్దె ఎత్తడం మొదలు పెట్టాడు పాండయ్య.
ఒక గుర్రం దగ్గర లద్దె ఎత్తుతుంటే అందులో ఒక వరహా కనిపించింది. చప్పుడు చేయకుండా, ఎవరికీ కనిపించకుండా గబాల్న దాన్ని జేబులో వేసుకున్నాడు పాండయ్య. ఇంకేమైనా దొరుకుతాయేమోనని వెతికాడు. కాని దొరకలేదు. దాన్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిడండ్రులకు జరిగినదంతా చెప్పి ఆ వరహా ఇచ్చాడు. పాండయ్య తల్లి దాన్ని దాచిపెట్టింది.
మరుసటి రోజు తెల్లవారు జామునే గుర్రపుశాలకు వచ్చి లద్దె ఎత్తుతుంటే మరో వరహా కనిపించింది. దాన్నీ జేబులో వేసుకుని, గుర్రపుశాలంతా శుభ్రం చేశాడు. అక్కడ దొరికే వరహాల కోసం, జ్వరం వచ్చినా, నలతగా ఉన్నా పట్టించుకోకుండా క్రమం తప్పకుండా గుర్రపుశాలకు వెళ్లేవాడు. ఆ వరహా మరెవరికన్నా దొరుకుతుందేమోనని అందరికంటే ముందే వచ్చి గబగబా పనిచేయసాగాడు. ఇప్పుడు పాండయ్యకి పని ఓ వ్యసనంగా మారింది. ఖాళీగా ఉండాలన్నా ఉండలేక పోతున్నాడు. వరహా దొరక్కపోయినా సరే ఎప్పటిలాగే పనిచేయసాగాడు. అలా ఒక్కరోజు కూడా పని మానేయకుండా సంవత్సరం పనిచేశాడు.
ఆ రోజు పనికెళ్లిన పాండయ్యతో ''ఇంక నువ్విక్కడ పని చేయనవసరం లేదు. ఇంటికెళ్లి పోవచ్చు'' అన్నాడు గుర్రపుశాల కాపలా దారు కాంతయ్య.
పాండయ్య బేర్‌మన్నాడు. ఇంటికెళ్లి జరిగిన విషయమంతా చెప్పి వెక్కివెక్కి ఏడ్చాడు. రాజుగారిని అడుగుదామని ముగ్గురూ సభకు వెళ్లారు.
''అయ్యా! మావాడు పనిచేసిన ప్రతిరోజూ గుర్రపుశాలలో ఒక వరహా దొరికింది. వరహా కోసం వాడు రోజూ పనికి వెళ్లాడు. ఈ వరహాలన్నీ మీ గుర్రపుశాలలో దొరికాయి. కాబట్టి అవన్నీ మీకే చెందాలి. మొదటి రోజే ఇద్దామనుకున్నాను. కాని మావాడు పనికి అలవాటు కావాలనే తమకు అందజేయలేదు'' అని మూడు వందల అరవై ఐదు వరహాలను రాయలవారి ముందు పెట్టారు పాండయ్య తల్లిదండ్రులు.
రాయలు చిన్నగా నవ్వాడు.
''తమరివల్ల మావాడి సోమరితనం పోయింది. పని లేకపోతే, పిచ్చివాడై పోతున్నాడు. ఇలా అర్థాంతరంగా పనిలోంచి తీసేస్తే బాధపడుతున్నాడు. దయచేసి, ఏదో ఒక పని ఇప్పించి, మా కుటుంబాన్ని ఆదుకోండి'' అని వినయంగా నమస్కరించారా దంపతులు.
శ్రీకృష్ణదేవరాయలు విలాసంగా నవ్వి ''మీ వాడికి వరహాలు దొరికేలా కాంతయ్య ద్వారా నేనే వాటిని ఏర్పాటు చేశాను. ప్రతిఫలం లేకపోతే ఎవరూ పనిచేయరు. ఆ వరహాలన్నీ మీవే. పాండయ్య ఇంతకాలం పని చేసినందుకు ప్రతిఫలం. వాటితో భూమి కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ బతకండి. చాలామంది తమకు దొరికిన వస్తువుల గురించి చెప్పరు. కానీ మీరు ఇన్ని బంగారు నాణాలను నా దగ్గరికి తెచ్చారు. మీ నిజాయితీని అభినందిస్తున్నాను'' అని చెప్పాడు.
- పుప్పాల కృష్ణమూర్తి
4, మార్చి 2012, ఆదివారం
వద్దంటే సంపద
వలీదాద్ వడ్రంగి పని చేసేవాడు. అతనికి నా అనేవాళ్లు ఎవ్వరూ లేరు. ఒంటరిగా ఉండేవాడు. కష్టపడి పనిచేసేవాడు. అతను సంపాదించిన దాన్లో ఎక్కువ ఖర్చయ్యేది కాదు. మిగిలిన డబ్బంతా ఒక పాత్రలో వేసి దాచిపెట్టేవాడు. ఎవరికే సహాయం కావాలన్నా చేసేవాడు. ఊళ్లో అందరికీ తల్లో నాలుకలా మెలిగేవాడు. అనవసరంగా ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు.
అదే వూరి వాడైన సాహెబ్‌కి వలీ అంటే అస్సలు ఇష్టముండేది కాదు. అందరూ వలీనే పొగుడుతున్నారని అసూయపడేవాడు. ఎలాగైనా ఊరందరి ముందు వలీని చెడ్డవాడిగా చిత్రించాలని విశ్వప్రయత్నం చేశాడు. కానీ అతని మాటలేవీ ఊరి ప్రజలు నమ్మేవాళ్లు కాదు.
కొన్ని రోజులకు వలీ దాచుకున్న డబ్బుతో పాత్ర నిండిపోయింది. 'వెంటనే దీన్ని ఖాళీ చెయ్యాలి. లేకపోతే ఇకపై సంపాదించేది దాచడానికి వేరే పాత్ర లేదు' అనుకున్నాడు వలీ.
ఆ పాత్రను ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లి అతని ముందు కుమ్మరించాడు. 'ఆ డబ్బుకు సరిపడా ఒక బంగారు కంకణం ఇవ్వమని కోరాడు.
అందంగా నగిషీలు చెక్కిన బంగారు కంకణం వలీకి ఇచ్చాడు నగల వ్యాపారి.
అయితే ఆ కంకణాన్ని ఏం చెయ్యాలో వలీకి అర్థం కాలేదు. తనెటూ పెట్టుకోడు కనుక ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఓ చెట్టుకింద కూర్చున్నాడు. అంతలో అతనికి ఒంటెల బారు, వీటిమీద సరుకులు, ఒక వర్తకుడు కనిపించాడు.
''అయ్యా! తమరెక్కడికి వెళ్తున్నారు?'' అడిగాడు వలీ.
''రాజమందిరానికి. యువరాజుగారు కొన్ని కొత్త దుస్తులు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అవి తీసుకెళ్తున్నా'' అన్నాడు వర్తకుడు.
''దయచేసి ఈ కంకణం అతనికి ఇవ్వండి. ఇది వలీ కానుక అని చెప్పండి'' అని ఆ కంకణాన్ని వర్తకుడికి అందజేశాడు.
వలీ పంపిన కంకణం యువరాజుకి ఎంతో నచ్చింది. ప్రతిగా అతను కొన్ని అందమైన సిల్కు వస్త్రాలు అదే వర్తకునితో పంపాడు.
వీటిని తీసుకుని తిరుగు ప్రయాణంలో వలీకి అందజేశాడు వర్తకుడు.
''వీటిని నేనేం చేసుకోను?'' అన్నాడు వలీదాద్.
''నీకు అవసరం లేకపోతే ఎవరికన్నా ఇవ్వు. యువరాజుగారు పంపించారు. నీను ఇస్తున్నాను. అంతే. ఇక వాటిని ఏమైనా చేసుకో'' అన్నాడు వర్తకుడు.
''ఎవరికి ఇవ్వను? నాకెవరూ లేరు. ఇటువంటి సిల్కు దుస్తులు నేనెప్పుడూ వేసుకోలేదు. వీటిని ఎవరికి ఇస్తే బాగుంటుందో నువ్వే చెప్పు?'' అన్నాడు వలీ.
''పక్కరాజ్యంలోని సుల్తాన్ మహారాజుకు ఇవ్వు. ఆయనికి ఇటువంటి సిల్కు దుస్తులంటే చాలా ఇష్టం. వీటిని తప్పక తీసుకుంటారు. నీకు మంచి బహుమానం ఇస్తారు'' చెప్పాడు వర్తకుడు.
బహుమానం అవసరం లేదు. వీటిని తీసుకుంటే చాలనుకుని, వర్తకుడు చెప్పిన ప్రకారమే వాటిని సుల్తాన్ మహారాజుకి పంపించాడు వలీ.
వాటిని చూసి సుల్తాన్ చాలా సంతోషించాడు. వాటికి బదులుగా ఆరు మేలుజాతి గుర్రాలను వలీకి కానుకగా పంపించాడు.
వాటిని ఏం చేసుకోవాలో తెలీక తిరిగి యువరాజుకి పంపించాడు వలీ.
''ఈ వలీ ఎవరు? నాకెందుకు కానుకలు పంపిస్తున్నాడు?'' యువరాజు తన స్నేహితులను అడిగాడు.
''ఇతనెవరో తన సంపదతో మీ మనసు చూరగొనాలని ఇలా విలువైన కానుకలు పంపుతున్నాడు. ఈ సారి అతను తిరిగి ఇవ్వలేనంత గొప్ప కానుక పంపించండి. దాంతో అతని గర్వం అణుగుతుంది'' అన్నారు వాళ్లు.
వెంటనే వలీకి 20 గుండిగల నిండా వెండి నాణేలు పంపాడు యువరాజు.
''ఒంటరిగా ఉండేవాణ్ణి. ఇంత సంపద నేనేం చేసుకోను'' అనుకున్న వలీ దాన్ని సుల్తాన్ మహారాజుకు పంపించాడు. అంత సంపదను చూసి సుల్తాన్ ఆశ్చర్యపడ్డాడు.
''ఈ వలీ ఎవరు? నాకెందుకు ఇన్ని కానుకలు పంపిస్తున్నాడు? అని సుల్తాన్ తన సలహాదారుణ్ణి అడిగాడు.
ఇతనెవరో చాలా గొప్ప ధనవంతుడిలా ఉన్నాడు. తన సంపదతో మీ మనసును ఆకట్టుకోవాలని, తన గొప్పను ప్రదర్శించుకోవాలని ఇంత విలువైన సంపదను పంపిస్తున్నాడు మహారాజా. అతను తిరిగి ఇవ్వలేనంత గొప్ప బహుమతిని పంపించండి. అప్పుడు మీరంటే ఏంటో అతనికి తెలుస్తుంది'' అన్నారు వాళ్లు.
20 గంగాళాల నిండా విలువైన రత్నాలు పంపించాడు సుల్తాన్.
ఇంత సంపద నేనేం చేసుకోను? అనుకున్న వలీ వాటిని తిరిగి యువరాజుకి పంపాడు.
ఇంత విలువైన రత్నాలు పంపించాడు... అసలు ఎవరితను? ఎలాగైనా అతన్నొక సారి చూడాలనుకున్న యువరాజు తన స్నేహితులను వెంటబెట్టుకుని వలీ ఉన్న ఊరికి వచ్చాడు. అలాగే సుల్తాన్ మహారాజు కూడా వలీని చూద్దామన్న కుతూహలం కొద్దీ తన అనుచరులతో బయల్దేరాడు.
ఎలాగో కష్టపడి వలీ ఇంటిదగ్గరికి చేరుకున్నారు యువరాజు, సుల్తాన్ మహారాజులు. కానీ అతను ఇంటిదగ్గర లేడు. అటుగా వెళ్తున్న సాహెబ్‌ని వలీ అంటే ఎవరని అడిగారు.
జరిగిందంతా తెలుసుకున్న సాహెబ్ తానే వలీనని చెప్పి వారి దగ్గర్నుండి విలువైన కానుకలు పొందాలనుకున్నాడు. వారి దగ్గరికి వెళ్లి తనే వలీనని చెప్పాడు కూడా. అది నిజమేనని నమ్మిన సుల్తాన్ మహారాజు, యువరాజులు అతనికి విలువైన కానుకలు ఇవ్వబోయారు.
అంతలోనే వలీ వచ్చి తన ఇంట్లోకి వెళ్లాడు. ఇది గమనించిన సుల్తాన్, యువరాజులు నిజమైన వలీ ఎవరో తెలుసుకోవాలనుకున్నారు.
వెంటనే ఆ ఊరిపెద్దలను పిలిపించారు. వారు సాహెబ్ ఎటువంటి వాడో, వలీ ఎంత మంచివాడో చెప్పారు. నిజం తెలుసుకున్న మహారాజు, యువరాజు సాహెబ్‌ని వంద కొరడా దెబ్బలతో శిక్షించారు. వలీని తమ రాజ్యంలో కోశాధికారిగా నియమించాడు సుల్తాన్.
వలీ నిజాయితీ, నిస్వార్థం యువరాజుకి ఎంతగానో నచ్చాయి. అతణ్ణి తన స్నేహితుడిగా చేసుకున్నాడు.
- మేకల మదన్‌మోహన్ రావు
3, మార్చి 2012, శనివారం
కాకి- ఎద్దు (పిల్లలకు)
చిట్టి కథ
|
|
|
4, ఫిబ్రవరి 2012, శనివారం
తోక తెగిన నక్క! (కధ)
|
21, జనవరి 2012, శనివారం
ఎవరు గొప్ప? ( చిట్టి కథ)
|
14, జనవరి 2012, శనివారం
పనిలో మెళకువలు!
చిట్టి కథ
| |
|
7, జనవరి 2012, శనివారం
చిట్టి కథ
అపాయంలో ఉపాయం
| |
|
12, జులై 2011, మంగళవారం
7, జులై 2011, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)