తత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మార్చి 2012, శుక్రవారం

ధనం

currencyధనమంటే ఇక్కడ ప్రాపంచిక సంపత్తి అని అర్థం కాదు. వాస్తవానికి పురాణేతిహాసా లు, వేద వేదాంగాలు, ఉపనిషత్తుల్లో చెప్పబడి న దానిని అనుసరించి ధనం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనబడేవి నాలుగు రకా లు. వాటిని ఆర్జించడమనేది భగవంతుడు మనకు విధించిన నియమాల్లో ప్రధానమైనది. మొదటగా వాటి పరమార్థం గురించి తెలుసుకుందాం.ధర్మం: మనిషి ప్రాపం చిక ప్రలోభాలకు గురై పెడదారి పట్టకుండా నిర్ణీతమైన వలయ రేఖలో చలింపజేసేది ధర్మ మార్గం.అర్థం: ఇహలోకంలో చెల్లుబాటయ్యే ధనాన్ని, పరలోకాన చెల్లుబాటయ్యే ధనాన్ని ఇక్కడ మనం అర్థంగా భావించవచ్చు.

కామం: కామం అంటే కేవలం స్త్రీ పురుష సంగమానికి దారితీసే లైంగిక కోరిక అనే అర్థం మాత్రమే కాదని ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాలి. పరమేష్టి మనకు విధించిన కర్తవ్యాన్ని నెరవేర్చడం ద్వారా భగవంతుని సంతృప్తి పరచాలనే కోరికను సదా కలిగియుండాలని దీని అసలైన భావం.మోక్షం: మోక్షమనేది మనను జనన మరణ చక్ర వ్యూహం నుండి విముక్తుడిని చేసే సాధ నమని గుర్తించాలి. మోక్షాన్ని సాధించడం ద్వారా మన ప్రారబ్ద కర్మను అనుసరించి మర ల మరల సంప్రాప్తమయ్యే రక్త మాంస నిర్మి తమైన ఈ దేహం మరోమారు జన్మకు నోచు కోరాదని, పాపపంకిలమైన ఈ దేహాన్ని మరో సారి మన జీవుడు ఆశ్రయించరాదని కోరుకో ని వారెవరూ ఉండరు. అయితే మోక్షాన్ని సా ధించడం ఎలా అన్నది ప్రతి వారికీ కలిగే స మాధానమే లేని సందేహం. కానీ మోక్షాన్ని ఎలా సాధించాలనే విషయం గ్రహించినట్లయి తే అది అందరికీ అందుబాటులో ఉండే అ త్యంత మధురమైన ఫలం. ఆ విషయాన్ని గ్రహించని వారికి ఎప్పటికీ అది అందని ద్రాక్షపండే అన్నది నిర్వివాదాంశం.

ఎప్పుడైతే మనం జనన మరణాలు అనేవి క లుగుతాయని, మనం చేసే పాప పుణ్యాలు వా టిని నియంత్రిస్తుంటాయని విశ్వసిస్తామో, అ ప్పుడు ఈ దేహం అశాశ్వతమైనదని, ఈ దేహా న్ని అంటి పెట్టుకొని ఉండే ప్రాపంచిక విష యాలు అశాశ్వతమైనవన్న సత్యాన్ని గ్రహించ గలుగుతాం. భగవంతుడు మనకు విధించిన ఆర్జన అనే ప్రముఖమైన కర్తవ్యాల్లో రెండవదై న ధనమన్నది కూడా అశాశ్వతమైనదే అని గ్ర హించ గలుగుతాం. అశాశ్వతమైన ధనం మన కేల అని అందర్నీ దాని పట్ల విముఖులను చేయ డం అనేది ఇక్కడ చర్చించడంలోని పరమార్థం కాదు. వాస్తవిక ధనమన్నది ఏమిటనేది అందరూ తెలుసుకోవాలనేదే మా అభిమతం. ప్రాపంచిక, పారమార్థిక ధనాలనేవి రెండు రకాలు.

coinsమానవుడు పారమార్ధిక ధనాన్ని విస్మరించి ప్రాపంచిక ధనం గురించి ప్రతియొక మాన వుడు అహర్నిశలూ శ్రమిస్తుంటాడు. సాటి వా డితో సరిపోల్చుకుంటే తానెంత అధికుడనే అంశాన్ని ప్రధానంగా భావిస్తుంటాడు. ప్రాపం చిక ధనం ఎన్ని వందల వేల కోట్లు ఉన్నప్పటి కీ అవి మనదేశంలో మాత్రమే చెల్లుబాటు అ వుతుంది. కారణం ఏమైనప్పటికీ అదే మనం అమెరికానో లేదా దుబాయికో లేక సింగపూ రుకో వెళతామని అనుకోండి మన దేశంలో చెల్లుబాటయ్యే రూపాయి ఆయా దేశాల్లో చెల్లుబాటు అవుతాయా అని అడిగితే మన దేశంలో చెల్లుబాటయ్యే రూపాయి పరాయి దేశాల్లో చెల్లవని ప్రతి ఒక్కరూ అంగీకరించే వి షయం. అలాంటప్పుడు మనం ఆయా దేశా ల్లో చెల్లుబాటయ్యే డాలర్లనో లేక దీనార్లనో లే క డాలర్లు, యెన్‌లనో ఎక్స్‌చేంజి ద్వారా పొం ది నిశ్చింతగా ఆయా దేశాలను సందర్శిస్తాం.

మనకు ఎన్ని వందల కోట్లు ఉన్నప్పటికీ పరా యిదేశంలో అవి ఎలా చెల్లవో అదే విధంగా ఈ ధరిత్రిపై చెల్లుబాటయ్యే ప్రాపంచిక ధనం మనం ఎంతగా సం పాదించినప్పటికీ అది పరలోకంలో చెల్లదని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విష యం. మన దేశాన చెల్లుబాటయ్యే ధనం (రూ పాయి) పరాయి దేశాన చెల్లుబాటు కాదని గ్ర హించినప్పుడు పరాయి దేశపు ధనం కోసం ఎ లా ఎక్స్‌చేంజ్‌లను ఆశ్రయిస్తామో, అదే విధం గా ఇహలోకాన చెల్లుబాటయ్యే ధనం పరలో కాన చెల్లుబాటు కాదని గ్రహించినపుడు పర లోకాన చెల్లుబాటయ్యే పారమార్ధిక ధనం కో సం మనలోని జీవుడు వెంపర్లాడుతాడు. కానీ ఎప్పటికప్పుడు మనను ఆవహించియుం డే మాయ వల్ల జీవించి ఉన్నంత కాలం పార మార్ధిక ధనం కన్నా, అశాశ్వతమైన ప్రాపంచి క ధనం కోసమే అహర్నిశలూ పరితపిస్తాం.

ఈ క్రమంలోనే జీవుడు అశాశ్వతమైన దేహం ఉన్నంత కాలం ఇహలోక ధనార్జన కోసమే అహ ర్నిశలు పరితపించి పరమార్థిక ధనహీను డైనాడని గ్రహించిన అతని వారసులు అతడి మరణానం తరం దశదానాలు చేసి అతడికి ఉత్తమగతులు కల్పించాలని యథాశక్తి కృషి చే స్తారు. కానీ ఆ విధంగా వారసులు తన పితృ దేవులకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని చేసే ప్రతీ చర్యా ఎటువం టివంటే మనం ఏదైనా ఊరికి వెళ్ళే క్రమంలో ఇంటి దగ్గర కట్టుకున్న సద్దిమూట వంటివి. సద్దిమూ ట ఎప్పటికీ నిరం తరంగా మన వెంట వస్తుందారాదు.

ఎక్కడికక్కడ మనం ఆహారాన్ని సమకూర్చుకోగలి గిన పుడు మనకు సద్దిమూట ఎలా అవసరం ఉండదో, పారమార్థిక ధనార్జన క్రమంలో మనం జీవించినంత కాలం మనం చేసే సన్మార్గ పయనం, పుణ్యక్షేత్ర సంద ర్శనం, దైవనామస్మరణ, యజ్ఞ యాగాదులు, దానధ ర్మాది క్రతువుల వంటి సద్కర్మలవల్ల మనం ఆర్జించే శుభఫలితా ల ను పారమార్థిక ధనా న్ని అనుసరించి సద్ది మూట ల వంటి మరణానంతర దానాదుల అవస రం ఏర్పడదు. జీవి సద్గతులను పొందగల గుతుంది. ఇటువంటి పారమార్థిక ధనం కోసమే ఎప్పటికీ మనం పరితపించాల్సింది. ఇదే మనం సంపాదించవలసిన వాస్తవిక ధనం.

Arvindhe-Aghori

29, ఫిబ్రవరి 2012, బుధవారం

ఏది భయం! ఏది అభయం!

‘వైరాగ్యమేవ అభయం, భయం లేకపోవడం నుంచి ైవె రాగ్య భావన కలుగుతుంది’ అని భర్తృహరి సుభాషితం చెబుతోంది. భయం ఉన్నంతకాలం, ఏ పని చేయాలన్నా ‘ఏవైనా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందేమో!’ అని వారిని వెనక్కి లాగుతుంది. ఎప్పుడు తమలోని భయాన్ని పారద్రోలతారో అప్పుడు వారి మనసు వైరాగ్యం దిశగా మళ్లుతుంది. భయాన్ని దూరం చేయడమంటే... ఋజువర్తన, ధర్మాచరణ, న్యాయపాలన... వంటివి కలిగి ఉండటం అని అర్థం. భ్రాంతి గొల్పే భయం కాకుండా, మనలను తీర్చిదిద్దే భయం అవసరం. ఏ భయం ఉండాలి, ఏ భయం ఉండకూడదు... అనే విచక్షణా జ్ఞానం ప్రతిఒక్కరికీ అవసరం. దానిపై అవగాహన కలిగించేందుకే ఈ ప్రయత్నం...

తప్పు చేయడానికి భయపడాలి. పాపం చేయడానికి భయపడాలి. అన్యాయం చేయడానికి భయపడాలి. అధర్మ ప్రవర్తనకు భయపడాలి. హింస చేయడానికి భయపడాలి. ధర్మసంరక్షణకు భయపడకూడదు. అహింసామార్గంలో ముందుకుసాగడానికి భయపడకూడదు. న్యాయసాధనకోసం పోరాటం చేయడానికి భయపడకూడదు. పుణ్యకార్యాలు చేయడానికి భయపడకూడదు. ఒప్పు చేయడానికి భయపడకూడదు.

భయం మానవలక్షణం
అభయం దైవీ లక్షణం. అందుకే భగవంతుడి హస్తం అభయముద్రలో దర్శనమిస్తుంది. అనవసర భయాన్ని దేవుళ్లు పోగొడతారనడానికి ఇది సూచిక. మంచి భయం, చెడ్డ భయం అని భయాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు పండితులు. అక్కర్లేని భయం వల్ల పిరికితనం, అవసరమైన భయం వల్ల విజయం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. రాక్షస రాజైన హిరణ్యకశిపుడికి ఏ భీతీ లేకపోవడం వలనే... ఋషులను, సాధువులను, పసిబాలుడైన ప్రహ్లాదుడిని హింసించాడు. విష్ణుమూర్తి చేతిలో మరణించాడు. స్త్రీలోలత్వం కారణంగా రావణుడు... సోదరులు, పుత్రులను పోగొట్టుకొన్నాడు. చివరకు రాముడి చేతిలో కన్నుమూశాడు. వరగర్వంతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని దుర్భాషలాడాడు. నూరు తప్పులు పూర్తవ్వగానే శ్రీకృష్ణుని చేతిలో చచ్చాడు. పాపభీతి లేనివారు ఏ పొరపాటు చేయడానికైనా వెనుకాడరనడానికి పురాణాలు, ఇతిహాసాలలోని ఈ ఉదంతాలే ఉదాహరణలు.

మానవులకు ధర్మభీతి, పాపభీతి, న్యాయభీతి... వంటి భీతులు ఉండితీరాలన్నది శాస్త్రోక్తి.
ధర్మభీతి... ధర్మబద్ధంగా జీవించినవారికి విజయం లభిస్తుందనడానికి పాండవులే ఉదాహరణ. పదమూడేళ్ల ్లపాటు అష్టకష్టాలపాలైనప్పటికీ ధర్మాన్ని వీడలేదు. ‘అధర్మం చేస్తే చెడు జరుగుతుందేమో!’ అనే భయంతో ధర్మబద్ధంగా ఉంటారనడానికి ఇదే నిదర్శనం.

పాపభీతి... ధర్మవిరుద్ధంగా నిర్వర్తించే పనులను పాపకార్యాలు అంటారు. స్త్రీ, వృద్ధ, బాలలను సంహరించడం మహాపాపం. ఇతరులకు కీడు తలపెట్టని గోవులను హత్య చేయడమూ పాపమే. పాపభీతి లేనివారు మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

న్యాయభీతి... ‘అన్యాయానికి పాల్పడటానికి భయపడాలి’ అనేది శాస్త్రవాక్యం. యుద్ధం చేసేటప్పుడు నిరాయుధుడిగా ఉన్న శత్రువుని సైతం చంపకూడదనేది న్యాయం. అందుకే, యుద్ధం చేయడానికి వచ్చిన రావణుడితో, ‘నువ్వు బాగా అలసిపోయావు. ఈ స్థితిలో నీతో యుద్ధం చేయడం అన్యాయం. నేడు పోయి, రేపురా! ’ అని పలికి, న్యాయరక్షకుడయ్యాడు రాముడు.

సామాజిక భీతి... క్రమపద్ధతి, కట్టుబాటులతో ఉన్న సమాజానికి లోబడి ప్రవర్తించినవారు అందరికీ ఆదర్శ ప్రాయులవుతారు. లేనినాడు అరాచకం ఏర్పడుతుంది. అందుకే... కట్టుబాట్లను అతిక్రమిస్తే, సమాజం వెలివేస్తుందనే భయం ఉండి తీరాలంటారు పెద్దలు.

శాస్త్రభీతి... శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తే నష్టం కలుగుతుందనే భీతి ఉండాలి. గణితశాస్త్రంలో ‘రెండు రెళ్లు నాలుగు’ అని తెలియక, ‘రెండు రెళ్లు ఐదు’ అనకుండా ఉండాలంటే, ఆ శాస్త్రం తెలిసుండాలి. అవసరమైన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలేగాని, అజ్ఞానంతో వితర్కం చేయకూడదని, అందుకు శాస్త్రభీతి ఉపయుక్తమవుతుందని శాస్త్రకారులు చెబుతారు.

భయం ఉండకూడదు... ‘భయం’ ఉండకూడదని కూడా శాస్త్రం చెబుతోంది. సృష్టిలోని సకల ప్రాణులకు, అంటే... పేడలోని పురుగు నుంచి, మేడలోని రాజు వరకు ‘ఆహారనిద్రాభయమైథునం’ (ఆహారసంపాదన, నిద్ర, భయం, సంసారం) సమానమే. సకలప్రాణులకు భయం సహజగుణం. జ్ఞానాన్ని సముపార్జించగల శక్తి మనుషులకు మాత్రమే ఉంది. అందువల్ల అనవసర భయాన్ని పోగొట్టుకొనే విచక్షణ కలిగి ఉంటాడు. కాని జ్ఞానంలేని పశుపక్ష్యాదులు భయంతోనే జీవిస్తుంటాయి. మానవులు అవసరమైన భయాన్ని వీడక, అనవసరమైన భయాన్ని దరిచేరనీయక, భయం తాలూకు రేఖలను మాత్రం తమలో ఉంచుకుంటూ జీవించాలి.

జ్ఞాన సముపార్జనతో భయం తొలగిపోవాలి. ‘‘జ్ఞానాదేవపి కైవల్యం... జ్ఞానం వల్లే ముక్తి లభిస్తుంది’’ అని వేదం చెబుతోంది. కర్తవ్య, అకర్తవ్యాలు (చేయదగినవి, చేయకూడనివి) జ్ఞానం ద్వారా మాత్రమే తెలుస్తాయి. (జ్ఞానం వల్ల కలిగే మనోవికాసాన్ని ‘ముక్త’ అంటారు). దీనివలన జీవన్ముక్తులవుతారు.

పెద్దలంటే భయం... గురువు, తల్లిదండ్రులు, జ్ఞానవృద్ధులు... వీరి పట్ల భయభక్తులు కలిగి ఉన్ననాడు, పిల్లలు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని పెద్దలు గర్వపడేలా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. తల్లిదండ్రులు, గురువులు దండిస్తారనే భీతి ఉన్నప్పుడు పిల్లలు తప్పుచేయడానికి భయపడతారు.

నచికేతుడు... నచికేతుడి తండ్రి... యాగపరిసమాప్తి వేళ, బ్రాహ్మణులకు... బక్కచిక్కిన ఆవులను దానమిచ్చాడు. అప్పుడు నచికేతుడు, ‘‘తండ్రీ! ఇటువంటివాటిని దానం చేసి పాపం మూటకట్టుకుంటావా! ఎప్పుడో ఒకప్పుడు నన్ను కూడా ఎవరికైనా దానంగా ఇచ్చేస్తావా!’’ అని ప్రశ్నించాడు. కోపంతో ‘‘నిన్ను యముడికి దానమిస్తాను’’ అన్నాడు తండ్రి. నచికేతుడు యముడి దగ్గరకు వెళ్లి ‘‘నన్ను నా తండ్రి నీకు దానంగా ఇచ్చాడు’’ అన్నాడు. ఆ బాలుడిని చూసి, ‘‘నీకు వరమీయాలనిపిస్తోంది, కోరుకో’’ అన్నాడు యముడు. అందుకు నచికేతుడు, ‘‘యమధర్మరాజా! నాకు జ్ఞానోపదేశం చెయ్యి’’ అన్నాడు. (కఠోపనిషత్తు). తండ్రి చేసే అధర్మాన్ని నిర్భయంగా నిలదీసిన నచికేతునిలో ధర్మభీతి ఉందని అర్థమవుతోంది. తండ్రి అయినప్పటికీ అధర్మంగా ప్రవర్తిస్తే నిలదీయమని చెబుతోంది ఈ కథ. ‘రాముడి దగ్గర నేను తప్పుగా మాట్లాడతానేమో, అధర్మంగా వర్తిస్తానేమో’ అని దశరథుడికి రాముడితో మాట్లాడాలంటే భయంగా ఉండేది. అవసరమైన భీతి మానవులను ఉత్తములుగా చేస్తుంది.
- డా. పురాణపండ వైజయంతి

పారమార్థిక భీతి...

తప్పు చేస్తే నరకానికి పోతారని, మరుజన్మలో నీచమైన జంతుజన్మ ఎత్తవలసివస్తుందనే భయం ఉండవలసిందే. దానినే పారమార్థిక భీతి అంటారు. అయితే, ‘నరకం ఉందా! పునర్జన్మ ఉందా! జంతువులా పుడతామా! నరకంలో చిత్రవధలకు గురవుతామా!’ వంటి వితండవాదం చేసేవారు ఎంతటి పాపానికైనా సిద్ధపడతారు. పారలౌకికమైన భీతి ఉంటే ఇతరులకు అపకారం చేయలేరు.
- డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్

అన్నిటికీ మూలం భయమే...

‘‘రజ్జుసర్పభ్రాంతి’’ మాత్రం ఉండకూడదని శాస్త్రం చెబుతోంది. అంటే అక్కర్లేని భయమన్నమాట. ఒక తాడు చీకట్లో వంకరటింకరగా పడి ఉంటుంది. ఎవరైనా హఠాత్తుగా అటు వచ్చినప్పుడు, సర్పమనే భ్రాంతి కలుగుతుంది. అందుకు కారణం అజ్ఞానం. అది తొలగాలంటే ధర్మభీతి ఉండితీరాలని ఇది తెలియచేస్తోంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ...
క్రోధాద్భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో
బుద్ధినాశాత్ప్రణశ్యతి
కోపం నుంచి మూఢత్వం, (విచక్షణ జ్ఞానం కోల్పోవడం), దానితో జ్ఞాపకశక్తి నశించడం, దాని నుంచి బుద్ధి కోల్పోడం, చివరగా పతనమై పోతారు... అని వివరించాడు.

22, ఫిబ్రవరి 2012, బుధవారం

పంచభూతాలే ప్రత్యక్ష దైవాలు..!

praying-handsపరమాత్ముడు జీవరాశులను సృష్టించడానికి ముందే పంచభూతా లను (ఆకాశం, భూమి, అగ్ని, వాయు, నీరు) సృష్టించాడు. ఒక్కో భూతాన్ని రెండు భాగాలుగా విడదీసి, వాటిలో రెండవ అర్ధభాగాలను నాలుగేసి భాగాలు చేశాడు. ఆ నాలుగు భాగాలను మిగిలిన నాలుగు భూత భాగాలలో కలిపాడు. ఇలా అన్ని భూతాలను కలుపగా ఒక్కొక్క భూతంలో దాని భాగం సగం కాగా మిగిలిన సగ భాగంలో నాలుగు భూతాలు కలిసి ఉంటాయి. అంటే ప్రతి భూతంలోను ఎనిమిది భాగాల లో నాలుగు భాగాలు తన అంశ కలిగి మిగిలిన నాలుగు భాగాలు పం చభూతాలలోని ఇతర భూతాలు అయివుంటాయి.

అందుకే ప్రతి వస్తువులోను ఇతర వస్తువుల లక్షణాలు అంతో ఇంతో ఉన్నాయని పెద్దలు చెప్తారు. భూమిలో సగ భాగం భూమి అయితే మిగి లిన సగ భాగంలో నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్ని కలిసి ఉంటాయి. అలాగే మిగిలిన భూతాల్లో కూడా. ఎండమావిలో నీరున్నట్లు తో చడం, ఆకాశజలం వంటివి పంచీకరణకు ఉదాహరణ. అదేవిధంగా మానవ దేహం కూడా పంచభూతాత్మకమే. మనం వ్యక్తిగతంగా, సమష్ఠి గా చేసే కర్మలను బట్టి దైవమే పంచభూతాల ద్వారా ఆయా కర్మ ఫలాలను అందిస్తాడు. అం దుచేతనే పంచభూతా త్మకమైన మానవుడు మంచి విషయాలకు పంచభూతాలను సాక్షులుగా తీసుకుంటాడు.

శరీరమే పంచభూతాలమయం..
4elementsఅసలు మన శరీరమే ఈ పంచభూ తాలతో నిర్మితమైనది. ఈ పూజ్యభా వంతోనే మన ఋషీశ్వరులు నేలను భూమాత అన్నారు. నీటిని గంగాదేవి గా కొలిచారు. అలాగే అగ్నిహోత్రుడి నీ, వాయుదేవుడినీ, ఆకాశాన్నీ ప్రత్య క్ష దైవాలుగా సంభావించారు. ఈ పంచభూతాలు ఇంత పవిత్రమై నవి కాబట్టే వివాహంలో నూతన వ ధూవరులు ‘మనమిద్దరమూ ఇలాగే జీవితాంతమూ కలిసి మెలిసి నడు ద్దాం!’ అని అగ్నిహోత్రం చుట్టూ ప్రద క్షిణలు చేస్తుంటారు. ‘మా ఇంటికి కోడలుగా వస్తున్న ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకొంటాం!’ అని జల రూపమైన పాలతో ప్రమాణం చేస్తుం టారు. ఏదైనా సందర్భంలో సత్య నిరూపణ చేసుకోవలసి వచ్చినప్పుడు ‘భూదేవి తోడు’ అంటుం టారు. తగాదాపడిన ఉభయ పక్షాల్లో ఒకపక్షంవా రు దేవాలయంలో దీపారాధన చేస్తే, మరొకరు ఆ దీపాన్ని ఆర్పి ప్రమాణం చేయటం మనం చూస్తూ ఉంటాం.

పంచభూతాలను తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు
‘నీ వెవరివో నాకు తెలియదు. వెళ్లిపో!’ అన్న దుష్యంతునితో శకుంతల ‘విమలయశోనిధీ! పురుష వృత్త మెఱుంగుచు నుండు జూవె వేదములును పంచభూత ములు...’ (భారతం, ఆదిపర్వం, 4-80)- ‘మన ఇద్దరికీ వివాహం జరిగిన విషయం పంచ భూతాలకు తెలుసు’ అన్నది. పూర్వం ఒక గురువు తన శిష్యలను పిలిచి తలా ఒక అరటి పండునిచ్చి ‘అబ్బాయిలూ! ఎవ్వరూ చూడకుండా, ఎవ్వరి కంట పడకుండా వీటిని తిని రండిరా!’ అన్నాడు. ఒకడు గురుకులంలోనికి వెళ్లి తలుపులు బిడాయించు కొన్నాడు. మరొకడు నిండా దుప్పటి కప్పుకొన్నాడు. అలాగే మరికొంత మంది. అందరూ అరటిపండ్లు తిని వచ్చేశారు. ఒక్కడు మాత్రం తినకుం డానే వచ్చి ‘ఎవ్వరూ చూడకుండా తినటం నావల్ల కా లేదండీ!’ అంటూ పండును గురువుేక తిరిగి ఇచ్చివేశాడు.

‘ఎందుకురా?’ అన్నాడు గురువు. ‘ఎక్కడికి వెళ్లినా నేల, గాలి, ఆకాశం ఉన్నాయండీ వాటి కంట పడకుండా తినలేకపోయానండీ!’ అన్నాడు వినయంగా. మనం మంచివి కానివ్వండి, చెడువి కానివ్వండి- ఏ పనులు చేస్తున్నప్పటికీ ‘ఎవ్వరూ చూడటం లేదులే!’ అనుకోవటం పొరపాటు. సాటి మనుషలు, అధికారులు, రక్షకభటులు మొదలైన వాళ్లు చూడకపోవచ్చు. పంచభూతాలు చూస్తూనే ఉంటాయి. వాటి కళ్లుకప్పటం మన తరం కాదు. మనం చేసే ప్రతిపనికీ అవి ప్రత్యక్ష సాక్షులు. అందుకే పంచభూతాల పట్ల ప్రతి వ్యక్తి భక్తిశ్రద్ధలు కలిగివుండా లి. అవే మనుకు ప్రత్యక్ష దైవాలు.

13, ఫిబ్రవరి 2012, సోమవారం

నాకు ఎప్పుడూ కష్టాలు కలిగేటట్లు చెయ్యి స్వామీ...!!


విపదః సంతు నః శశ్వత్ తత్ర తత్ర జగద్గురో |
భవతః దర్శనమ్ యత్‌స్యాత్ అపునర్భవ దర్శనమ్ ||
విపదః సంతు సః శశ్వత్ మాకెప్పుడూ కష్టాలు ఉండు గాక! అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నది ఈ భక్తురాలు. ఈమె ఎవరో కాదు, కుంతీదేవి. భాగవతం ప్రథమస్కంధంలో 'కుంతీస్తవ'మని, శ్రీకృష్ణుణ్ణి కుంతీదేవి స్తుతించే సందర్భం వస్తుంది. ఆ శ్లోకాలూ (వాటికి తెలుగు భాగవతంలో పోతన గారి అనువాదాలూ) ఎంతో ఉదాత్తంగా ఉంటాయి.

"అడుగడుగునా నన్నూ, నా బిడ్డల్నీ కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చావు గదా, సందనందనా, నీ ఋణం ఎలా తీర్చుకోనయ్యా! నీ కన్నతల్లి దేవకీదేవిని ఎలా అయితే కష్టాలనించీ, కంసుడి చెర నించీ విడిపించావో, నన్నూ అలాగే రక్షిస్తూ వచ్చావు కదుటయ్యా! నిజానికి ఆమెని కొన్నేళ్ళు కష్టపడ్డ తర్వాత రక్షించావు, నన్నయితే ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికి కాపాడావు గదా!" అంటూ, కుంతి పైశ్లోకం కూడా చెప్తుంది.

జగద్గురు! విపదః సంతు నః శశ్వత్ - జనార్దనా, మాకు వివత్తులు ఎప్పుడూ ఉండుగాక!
తత్ర తత్ర భవతః అపునర్భవ దర్శనమ్ దర్శనమ్ యత్‌స్వాత్

(ఆపదలు వచ్చిన) ఆయా సందర్భాల్లో నీ అపునర్భవ దర్శనమయిన దర్శనము కలుగుతుంది గదా! నీ దర్శనం కలిగితే ప్రాణికి జన్మరాహిత్యమే కనుక మరో పట్టుక చూసే కలిగితే ప్రాణికి జన్మరాహిత్యమే కనుక మరో పుట్టుక చూసే అవసరం ఉండదు. కనుక నీదర్శనం 'అపునర్భవ దర్శనమ్'

'కేవలం సుఖాలే కలిగితే వాటి ధ్యాసలో నిన్ను మర్చిపోతాను, కాబట్టి నాకు ఎప్పుడూ కష్టాలు కలిగేటట్లు చెయ్యి స్వామీ! అప్పడే నిన్ను నిరంతరం స్మరిస్తాను, భజిస్తాను. నీ దర్శనం పొందుతాను' అనేది నిజమయిన భక్తుడి ప్రార్థనయితే, అలాంటి భక్తులను కంటికి రెప్పలా కాపాడటం, ఆ భక్త వరదుడయిన జనార్దనుడి వ్రతం.