ఇక్కడ, నాకున్న తెలుగు పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలని లేదు. నేను చాలా వరకు ఎవరో వ్రాసిన, చెప్పిన వాటిని ఒకచోట చేర్చి నా ఆనందం కోసం నేను దాచుకుంటున్న పేజీలు. మీకు నచ్చితే తప్పక చదవండి, మరొకరితో పంచుకోండి. నాకు నచ్చిన విధంగా వ్రాయాలి అనుకుంటున్నాను, నాకు సొంత పైత్యం ఎక్కువ అయింది అనిపిస్తే మందలించండి.
నిజం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిజం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
9, ఏప్రిల్ 2015, గురువారం
28, జులై 2013, ఆదివారం
15, ఆగస్టు 2012, బుధవారం
పట్టుదల దాని ఫలితం
Man builds himself bionic hands (యాహూ న్యూస్ లింక్ )
After the accident, Sun Jifa, 51, of Guanmashan, Jilin province, in northern China, desperately needed to work on his family farm, according to the Daily Mail. “I survived, but I had no hands,” he explained. (EuroPics/CEN)
“I couldn’t afford to buy the false hand the hospital wanted me to have, so I decided to make my own,” Jifa says. He spent eight years handcrafting prototypes before finally creating metal hands that could grip and hold. (EuroPics/CEN)
The devices depend on a series of wires and pulleys inside, and are controlled by movements in his elbows, he said. “I made this from scrap metal for virtually nothing,” Jifa says. (EuroPics/CEN)
“There is no need to pay hospitals a fortune.” He says he will further develop the design for other disabled people. (EuroPics/CEN)
“The only drawback is that steel is quite heavy,” he concedes. “So they’re tiring to wear and get hot or cold in the extremes of summer and winter.” (EuroPics/CEN)
17, మార్చి 2012, శనివారం
2, మార్చి 2012, శుక్రవారం
విలువలకు ఐకన్ ఆమ్లా!
ఆదర్శం
|
|
|
7, జనవరి 2012, శనివారం
భద్రం బి కేర్‌ఫుల్ (కెసినోలు... కలియుగ మయసభలు)
| ఈ పచ్చి నిజం చదివే ముందు, మొన్ననే నా స్నేహితుడు సతీష్ (ఇల్లందు , ఖమ్మం జిల్లా) ఇలా నే కేసినోల వెంట తిరిగి జనాలకు నెత్తిన టోపీ పెట్టీ, పెళ్ళాం, పిల్లాడిని మరియు తల్లి తండ్రులను గాలికి వొదిలి వాడు గాల్లో కలిసాడు.... సో బికేరుఫుల్ బ్రదర్స్........ | ||||||||
|
4, డిసెంబర్ 2011, ఆదివారం
పెద్దలే బాధ్యులు..
పెద్దలే బాధ్యులు..
పిల్లలు అబద్ధాలు చెప్పడం నుంచి వక్రమార్గాలను పట్టడం వరకూ చాలా విషయాల్లో పెద్దలదే బాధ్యత. ఎన్నో అధ్యయనాలు పెద్దలు చేస్తున్న నిర్వాకాలను ఎండగడుతున్నాయి. ఫేస్‌బుక్‌ను తెరవడం నుంచి చాటింగ్ చేయడం వరకూ పలు సందర్భాల్లో తప్పుడు సమాచారం ఇవ్వాలని పిల్లలను పెద్దలే ప్రోత్సహిస్తున్నారని తాజా సర్వేలో తేలింది. ముఖ్యంగా పదినుంచి 15 ఏళ్లలోపు వయసున్న పిల్లలను ఫేస్‌బుక్‌కు ఆకర్షితులను చేయడం, వాటిని అబద్ధాలు, అభూత కల్పనలతో నింపేయడం ఒక దుష్ట సంప్రదాయం. సామాజిక కట్టుబాట్లకు తిలోదకాలిచ్చి, కొత్తతరంలోకి అడుగుపెట్టాలన్న తమ బలమైన కోరికను తీర్చుకోవడానికే పిల్లలను పెద్దలు పావులుగా వాడుకుంటున్నారని మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ జరిపిన తాజా సర్వేలో తేలింది. తప్పుడు సమాచారం ఇవ్వడం, అబద్ధాలను ప్రచారం చేయడంతో ప్రారంభమయ్యే పిల్లల జీవితాలు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదకరమైన మలుపులు తిరుగుతాయో, ఎంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయో గ్రహించలేకపోతున్నారని మైక్రోసాఫ్ట్ రీసెర్చి తేల్చిచెప్పింది. పిల్లలు చెడిపోవడానికి పెద్దలదే బాధ్యతని స్పష్టం చేసింది. పద్ధతి మార్చుకొని, పిల్లల జీవితాలను తీర్చిదిద్దాలని సూచించింది.
3, డిసెంబర్ 2011, శనివారం
జీవితం లో చావు ఎప్పుడో తెలిస్తే మనిషి చేయగల పని
జీవితం లో చావు ఎప్పుడో తెలిస్తే మనిషి చేయగల పని
Randy Pausch Last Lecture: Achieving Your Childhood Dreams
మరో వీడియో
ప్రతీ తెలుగు వాడు చూడదగ్గ వీడియో
ప్రతీ ఒక్క బారతీయుడు (ముక్యంగా ప్రతీ తెలుగు వాడు) చూడదగ్గ వీడియో. ప్రతీ $/ అమెరికా కలకు ముందు తప్పక చూడాల్సిన వీడియో. గొప్పలు చెప్పుకునే ప్రతీ తల్లి తండ్రి చాల నేర్చుకోవలసిన సమయం ఇది. ఇంత మంచి వీడియో చిత్రీకరించిన సోదరులకు నా ధన్యవాదాలు.
25, నవంబర్ 2011, శుక్రవారం
సిసలైన భాషా ప్రేమికుడు
సిసలైన భాషా ప్రేమికుడు
| |
వన్ మ్యాన్ ఆర్మీ
| |
|
మీ కంప్యూటర్ తెరమీది చిత్రమిదే!
దానిలో భాగంగానే ఆయన నేపా వ్యాలీలో వైన్ తయారీ గురించి ఓ కథనాన్ని తయారుచేసే పనిలో పడ్డాడు. దానికోసం తీసిన ఫొటోల్లో ఇది ఒకటి. 1996లో తీసిన ‘బ్లిస్’ అనే ఈ ఫొటో, ఐదేళ్ల తర్వాత ప్రపంచమంతా ప్రాచుర్యం పొందింది. కారణం... 2001లో బిల్‌గేట్స్ దీన్ని ‘విండోస్ ఎక్స్‌పి’ డెస్క్‌టాప్ కోసం వాడారు.
14, నవంబర్ 2011, సోమవారం
మతం మానవత్వానికి అడ్డుకాదు
మతం మానవత్వానికి అడ్డుకాదు
రఘుపతి వస్తానని పోన్ చేశాడు.
సరే, రారా . ఇంటివద్దే ఉన్నాను అన్నాను.
ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు. ఎటూ వెళ్లడంలేదు.
మిత్రులుకూడా చాలామంది రావడం తగ్గించేశారు. ఎవరి పనులు వాళ్లకు.. సమయం సరిపోవడంలేదేమో.
పనమ్మాయిని పిలిచి మేడమీద గది శుభ్రంచేయమన్నాను. ఆ గది నా సామ్రాజ్యం. అయితే అక్కడికి వెళ్లి చాలా వారాలయింది. అంతకు ముందు ప్రతి శని, ఆదివారాలు నా మిత్రులతో, మేడపై గదిలో చాలా సరదాగా గడచిపోయేవి. కొందరితో పేక ఆట, కొందరితో చదరంగం, చందు, నాగరాజు వంటివారితో సాహిత్య చర్చ. ఇలా ఉండేది నా వారాంతపు జైత్రయాత్ర.
వీరందరిలోకీ రఘుపతి నాకు ప్రాణస్నేహితుడు. మాది చిన్ననాటి స్నేహం. మావి పక్కపక్క ఊర్లు. వాడి ఊరి స్కూల్లో నేను రెండేళ్లు చదువుకున్నాను. అప్పటినుండీ స్నేహం గత యాభై ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. చిన్ననాటి స్నేహం పర్సులోని కరెన్సీ నోట్లవంటిది. అప్పుడప్పుడూ తాకి చూసుకుంటే కలిగే ఆనందం వేరు. వాడు, వాడి ఆర్థిక స్థితి వాణ్ని డాక్టరు చదివించాయి.
నేను ఓ కాలేజీ అధ్యాపకునిగా నాలుగేళ్లక్రితం రిటైరయ్యాను. నా కొడుకూ, కోడలూ కెనడాలోఉంటారు. నేనూ, శ్రీమతి ఇక్కడ హైదరాబాదులో మారేడ్పల్లిలో ఉంటాం. ఇక, డాక్టరుగా రఘుపతి బాగా సంపాయించాడు. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నా, కూతురూ, అల్లుడూ ఇక్కడే ఉంటారు. వాడూ నేనూ నెలకోసారైనా కలుస్తూ ఉంటాం. వాడు మా యింటికి వస్తే అదో ప్రత్యేకమైన సందర్బం. వస్తూ వస్తూ వాడు ఖరీదైన విదేశీ మద్యం సీసా తెస్తాడు. మా ఆవిడవేసే ఉల్లిపకోడీలు తింటూ ఏవేవో మాట్లాడుకుంటూ గడిపేస్తాం.

మార్కెట్టుకు
వెళ్లివచ్చి, భోంచేసి పడుకున్నాను. లేచేసరికి సాయంత్రం నాలుగు గంటలైంది,
ఎంతగా నిద్రపట్టింది అనుకుంటూ.. స్నానంచేసి, టీ తాగుతూ కూచున్నా. ఇంతలో
రఘుపతి రానే వచ్చాడు. వాడికి టీ అందించి క్షేమ సమాచారం కనుక్కున్నది నా
శ్రీమతి. కాసేపు అక్కడే కూచుని, మేడపైకి వెళ్లాం.
వెళుతూనే.. టీవీ ఆన్ చేశా. ఆదివారం కదా పాత సినిమా ఏదైనా వస్తుందేమోనని. అయితే హోం మంత్రి పాటిల్ రాజీనామా చేశాడని ప్లాష్ న్యూష్. అలా మా మాటలు రాజకీయలలోకి మళ్లాయి. గత నాలుగురోజులుగా దేశాన్ని కుదిపివేసిన ముంబాయిపై దాడులు చర్చనీయాంశంగా మారింది. కళ్లు నీటితో నిండాయి. మనసు మూగబోయింది. ముష్కరులు ఎందుకోసం ఇంత దారుణానికి పాల్పడ్డారో నాకు అర్థంకాలేదు.
ధనం కోసం కాదు, మతం కోసం కాదు. చనిపోయిన వారిలో అన్నిమతాల వారూ ఉన్నారు కదా అని నా అనుమానం. ఒక దేశాన్ని, దేశ సంపదనూ నాశనం చేయాలనుకునే.. ఉగ్రవాదులు ఇటువంటి దాడులకు పాల్పడుతుంటారేమో.. అని రఘు అన్నాడు. కానీ దీనివలన వారికి కలిగే లాభం ఏమిటి మా మనసులు ఆక్రోశించాయి.
పట్టుమని -20 ఏళ్ళు కూడాలేని యువకులు కరడుగట్టిన నరహంతకులుగా మారడానికి దోహదపడుతున్న అంశం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం ప్రపంచానికి లేదా అని ప్రశ్నించుకున్నాం. మాలో వేల వేల సందేహాలు.. ఇంతలో వేడి పకోడి తీసుకువచ్చింది పనిమనిషి. అక్కడి వాతావరణం ఆమెకు అర్ధంకాలేదు.
ఛలోక్తులతో సరదాగా ఉండే నా గదినిండా ఆవేదనల అలలు వ్యాపించి ఉండడం గమనించి ఎంతోనెమ్మదిగా వచ్చి ప్లేట్లు అక్కడ పెట్టి అంతే నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక దాడి ఎన్ని వేల లక్షల గుండెలను పిండి వేస్తుందో అర్ధమైంది నాకు. అల్ ఖైదా, ముజాహిదీన్ ఎవరైనా ఇతరులను చంపడంద్వారా తాము సాధించగలుగుతున్నది ఏమిటి.. అని ప్రశ్నించుకున్నాం, సమాధానం లభించలేదు.
ఊహలనిండా వేదన ఘనీభవించింది. దాడిలో చనిపోయినవారి త్యాగాలను స్మరించుకున్నాం. అపార్థానికి, ఆవేశానికి విజ్ఞత ఉండదని అన్నాను.నిజమే...మూర్ఖత్వం అంత త్వరగా పాఠాలు నేర్చుకోదని అన్నాడు రఘుపతి. మామధ్య కాసేపు మౌనం ఆవరించుకుంది.
ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తిరిగి నావైపు చూసి నీకో సంఘటన చెప్పాలి . ఇది చరిత్ర, ఇది వాస్తవం.. ముంబై దాడుల నేపధ్యంలో ఇది నీకు చెప్పాలనిపించింది అని ఆగాడు. చెప్పమని కళ్ళతోనే అర్ధించాను.

నేను డాక్టరుగా
చాలా సమావేశాలకు హాజరయ్యేవాడిని. అలా అవయవ మార్పిడికి సంబంధించి ఓ
సమావేశంలో ప్రసిద్దవైద్యుడు చేరనయ్య కలిశాడు. అపుడు మామధ్య అవయవ మార్పిడి
గురించిన చర్చ జరిగింది. ప్రస్తుతం వైద్య శాస్త్రం ఈ అంశంపైనే తీవ్రంగా
ఆలోచిస్తోంది. ఆ సమయంలో ఆయన ఈ విషయం చెప్పాడు. డా. చేరనయ్య దేశంలోనే
ప్రముఖుడైన హ్రుద్రోగనిపుణుడు.
ప్రస్తుతం పాకిస్తాన్‌లో కూడా ఆయన స్వచ్చందంగా తన వైద్యసేవలందిస్తున్నారు. మన దేశంలో గుండెమార్పిడి చేసిన తొలి డాక్టర్ ఆయన. ఇక్కడ గుర్తించవలసిన అంశం ఏమిటంటే.. యాదృశ్చికంగా జరిగిన సంఘటన. మానవత్వానికీ, మంచితనానికీ ప్రేరణగా నిలిచిన సంఘటన కావడం. సరే, విషయానికి వస్తాను. డాక్టర్ తొలి గుండే ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఓ మహిళకు గుండె మార్పిడి అత్యవసరంగా జరిపించాలి. దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ దాతకోసం వెదుకుతున్నారు.. ఫలితం కనిపించలేదు. అపరేషన్ తేదీ దగ్గరపడింది. రోగికి ప్రాణాపాయం పెరిగిపోతోంది. ఏంచేయాలో పాలుపోలేదు. ఇలా ఉండగా ఓ రోజు రాత్రి పదకొండు గంటలకు చేరనయ్య ఉంటున్న ఊరిలోని ఆసుపత్రినుండే ఫోను వచ్చింది.
ఒక ప్రమాదంలో గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న ఒక మహిళ గుండె దానం చేయడానికి ఆమె భర్త అంగీకరించినట్టు వార్త. ఇది విన్న చేరనయ్య ఆనందపడ్డాడు. దేశంలో గుండెమార్చే ఆపరేషన్ చేసే తొలి వ్యక్తిగా నిలువనున్నందుకు సంతోషించాడు. మరునాడు ఉదయమే సంబంధిత వ్యక్తులతో మాట్లాడాడు. చట్టపరమైన ఇబ్బందులను తెలిపాడు.
అయితే మరణిస్తున్న తన భార్య శరీరావయవాలు మరొకరికి జీవితాన్ని ప్రసాదించడం తనకు ఎంతో గర్వకారణం అని అతనన్నాడు. ఆపరేషన్ పూర్తయింది, రోగి కోలుకుని మరో పదేళ్లు బ్రతికింది. అర్థం కానట్టు రఘుపతి వైపు చూశాను.
చెబుతానని, చేత్తో సైగ చేసి...
ఇంతకూ ఈ విషయంలో విశేషం ఏమిటని కదూ నీ చూపులకర్ధం అన్నాడు.
తల ఊపాను
ఓ క్షణం ఆగి, చేతితో నా చేయిపై తట్టి....
గుండె ఆపరేషన్ చేయించుకున్న మహిళ ముస్లీం. ఆమెకు తన గుండె దానం చేసిన స్త్రీ హిందువు. ఈ అపరేషన్‌తో చరిత్ర సృష్టించిన వైద్యుడు క్రిస్టియన్. మతం మానవత్వానికి అడ్డుకాదు అనడానికి ఇది నిదర్శనం. అన్నాడు.
నా కళ్లు చెమ్మగిల్లాయి.
మరి మతంకోసం మారణకాండ సృష్టించడం ఎలా సాధ్యం.. ఆలోచిస్తున్నాను. . . .
టైం అయిపోయింది.. నేను వెళతానురా, అంటూ.. రఘుపతి బయలుదేరాడు.

ఆ బస్సులో స్వార్థం పిచ్చికుక్కలా పరుగెట్టింది
ఆ బస్సులో స్వార్థం పిచ్చికుక్కలా పరుగెట్టింది
టిక్కెట్లు కొట్టే కార్యక్రమం ప్రారంభించాడు కండక్టర్. ఎక్కేంతవరకూ బతిమాలి ఎక్కిన ప్రయాణికులు, అన్ని గంటలపాటు ఇప్పుడెలా నిలబడాలా అని ఆలోచిస్తూ దిగులుగా నిలుచున్నారు. కూర్చుని ఉన్న ప్రయాణికులు మాత్రం సొంత జాగీరులా గర్వంగా కూర్చున్నారు. బస్సు లోపల చివరగా వెనుక ఉండే పెద్ద సీటులో పద్ధతి ప్రకారం ఐదుగురు విశాలంగా కూర్చున్నారు. ఆ కూర్చున్న వారిలో ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలు.
వారు కొంచెం సర్దుకోగలిగితే ఇంకొకరు ఫ్రీగా కూర్చునే అవకాశం ఉంది. అది గమనించిన ఒక గర్భిణీ "ఏమండీ! మా పిల్లాడు... మద్రాసు వరకూ నిలబడి ప్రయాణించాలంటే వాడికి కాళ్లనొప్పులు పుడతాయేమో. కొద్దిగా సర్దుకొని వాడిని కూర్చోపెట్టుకోండి" అంటూ ప్రాధేయపడింది. మనల్ని కాదులే అన్నట్లు మొహం తిప్పుకున్నారు పిల్లలు కలిగిన ముగ్గురు తల్లులూను.
వారిలో ఏ ఒక్కరైనా ఆ పిల్లవాడిని ఒడిలోనైనా కూర్చోపెట్టుకోవచ్చు. అయినా మొహాలు తిప్పుకున్నారు. ఆ సీటు పర్మనెంట్‌గా తమదే అయినట్లుగా ఫీలయిపోతున్న మిగిలిన ఇద్దరు మగ మహారాజులు "ఈ సీట్లో కూర్చోవలసింది అయిదుగురేనమ్మా!" కొంచెం విసుగ్గా అన్నారు. కూర్చోవలసింది అయిదుగురే కానీ పిల్లాడు నిలబడలేడేమోనని మళ్ళీ ప్రాధేయపడిందా తల్లి. అదీ తన స్వార్థం కోసం కాదు. కేవలం కొడుకు కోసం ప్రాధేయపడింది.
"పిల్లాడు నిలబడలేడని తెలిసినప్పుడు బస్సెక్కకూడదమ్మా! తరువాతి బస్సులో రావలసింది" సమాధానమిచ్చాడు ఇంకో మగమహారాజు. "ఎక్కేటప్పుడు సీట్లు లేవని తెలిసినా ఎక్కేస్తారు. తర్వాత కూర్చున్న వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు. ఛ! ఛ!" విసుక్కున్నాడు ఇంకోఆయన. టిక్కెట్లు కొడుతూ వారి సంభాషణను విన్న కండెక్టర్ విననట్టే "ఏమిటమ్మా?" అంటూ ఆమెని ప్రశ్నించాడు.
కండక్టర్ వైపు దీనంగా చూస్తూ అతడే ఈ బస్సుకు సర్వాధికారి, తప్పక ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించి పిల్లాడికి సీటు ఇప్పించగలడని సమస్యను అతడితో మొరపెట్టుకుందా పిచ్చితల్లి. ఆమె వైపు పరిశీలనగా చూసిన కండక్టర్ ఆమెనో గర్భిణీ స్త్రీగా గుర్తించాడు. "సాటి ఆడవారి కోసం మీరైనా సర్దుకోకపోతే ఎలాగమ్మా? కొద్దిగా సర్దుకోండి" అంటూ కూర్చున్న ఆడవారినుద్దేశించి చెప్పాడు.
"ఏమయ్యా ఇది ఎంతమంది కూర్చునే సీటనుకుంటున్నావ్?" అంటూ ఎగిరిపడుతూ ప్రశ్నించారు సీట్లో ఉన్నవారంతా ముక్తకంఠంతో. మీ ఇష్టం నాకెందుకు అన్నట్లుగా వారికి సమాధానం చెప్పకుండా టికెట్లు కొట్టే కార్యక్రమంలో మునిగిపోయాడు కండక్టర్. బస్సులోపలి సమస్యలతో తనకేమీ సంబంధం లేనట్లు నేషనల్ హైవే మీద వేగంగా పరుగెడుతోందా ఎక్స్‌ప్రెస్ బస్సు.
"ఎక్కేటప్పుడు ఎలాగైనా నిలబడతాం అని కండక్టర్‌ని బ్రతిమాలి మరీ ఎక్కుతారు. తీరా ఎక్కాక ఇంతే! మనం కనుక సర్దుకొని ఉంటే మద్రాసు వెళ్ళేటప్పటికి నలిగి పిప్పి అయిపోతాం... తెలుసా? ఆ నిజం తెలుసు కాబట్టే సర్దుకోలేదు" అని లోగొంతుతో పక్కన కూర్చుని ఉన్న ఆడవారితో చెప్పాడో మగమహారాజు.
నిల్చుని ఉన్న వాళ్ళు వాళ్ళ మాటల్ని వింటున్నారే తప్ప ఎవ్వరూ సర్దుకోమని చెప్పలేదు. కనీసం చిన్న పిల్లవాడినైనా కూర్చోపెట్టుకోమని చెప్పడం కానీ జరగలేదు. నిల్చున్న కొందరు నిల్చునే నిద్రపోతూ ఉన్నారు. బస్సు కుదుపులకు అప్పుడప్పుడూ ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తున్నారు. కొంతమంది నిల్చుని అనర్గళంగా రాజకీయాల్ని గురించి చర్చిస్తూ పక్కవారికి పరమ బోర్ కొట్టిస్తున్నారు.
"ఈ బస్సుల్లో ప్రయాణం అంటేనే పరమ బోర్ గురూ! ఎంచక్కా లగ్జరీ బస్సు ఎక్కాల్సింది" అంటూ పక్కనున్న ప్రయాణికుడితో మొరపెట్టుకుంటున్నాడు ఓ యువకుడు. కండక్టర్ సీటు పక్కన నిల్చుని ఉన్న నాని వెనుక జరుగుతున్న సంభాషణను జాగ్రత్తగా వింటూ ఎవరైనా సర్దుకుంటారేమోనని చూస్తున్నాడు. వాళ్ళలో అలాంటి ఉద్దేశం లేకపోయేసరికి నిల్చున్న ప్రయాణికుల్ని తోసుకుంటూ వెనుక సీటు వద్దకు వెళ్లాడు.
అక్కడ గర్భిణీ స్త్రీ తన కుమారునితోపాటు నానా అవస్థలు పడుతూ నిలబడి ఉంది. "ఆడవారు మీరైనా సర్దుకుని ఆ పిల్లవాడిని కూర్చోపెట్టుకోవచ్చు కదా? వెనక సీట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరుగురు కూర్చోవచ్చు" సీట్లో కూర్చున్న ఆడవారిని చూస్తూ వాళ్ళనుద్దేశించి చెప్పాడు నాని.
" ఈ సీట్లో ఎంతమంది కూర్చోవాలో నీకు తెలుసా?". అన్నాడొకాయన
"అయిదుగురే కూర్చోవాలని తెలియదు కాబోలు పాపం!" వ్యంగ్యంగా ఇంకొకాయన అన్నాడు.
నానికి వాళ్ళ మాటలు ఎంతో కోపం తెప్పించాయి. "అవును ఐదుగురే కూర్చోవాలి. కానీ ఎలాగో తెలుసా? మీలా కాళ్ళు చాపుకుని కాదు. మీ ముందున్న ముగ్గురు కూర్చునే సీటు వెనుక ముగ్గురు కూర్చోవాలి. ఇద్దరు కూర్చునే సీటు వెనుక ఇద్దరే కూర్చోవాలి. అంతేకానీ పెళ్ళి భోజనాల బంతిలో కూర్చున్నట్లు కూర్చోకూడదు. సర్దుకోండి.. సర్దుకోండి" అంటూ కొంచెం గట్టిగా దబాయించాడు నాని. అయినా వారిలో ఏమాత్రం చలనం రాలేదు.
ముందున్న యువకుడొకడు నానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళని సర్దుకోమని దబాయించాడు. మళ్ళీ ఇంకో ఇద్దరు. తర్వాత ముగ్గురు, అలా దాదాపు ఓ ఇరవైమంది నానిని సపోర్ట్ చేశారు. సీట్లో కూర్చున్న మగవాళ్లిద్దరూ కొద్దిగా భయపడినట్లు వారి ముఖ కవళికల్ని బట్టి తెలుస్తోంది. ఇంత గొడవ జరుగుతున్నా ఆర్టీసీ బస్సు ఆగకుండా పోతూనే ఉంది. సమస్యల్లోంచే నాయకుడు పుడతాడు.
ప్రస్తుతం బస్సులోని సమస్యను లాజిక్‌గా ధైర్యంగా ఎదుర్కొని నిల్చున్న తోటి ప్రయాణికుల సపోర్టుతో చిన్న సైజు నాయకుడైపోయాడా బస్సులో నాని. నిల్చున్న వారి సపోర్ట్‌తో మళ్ళీ సర్దుకోమని వాళ్ళను దబాయించాడు నాని. కూర్చున్నవారిలో ముగ్గురు స్త్రీలు కుడివైపుకి, ఇద్దరు పురుషులు ఎడమవైపుకి సర్దుకున్నారు.
దాంతో సీటు మధ్యలో చిన్నపిల్లాడేం కర్మ పెద్దవారే విశాలంగా కూర్చునేంత ఖాళీ ఏర్పడింది. నానీని అందరూ మెచ్చుకోలుగా చూశారు. తన బాధను అర్థం చేసుకుని తనకు సహాయం చేయవచ్చిన అతడి వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసిందా యువతి. "రా బాబు! కూర్చుందాం" అని పిల్లవాడిని పిలిచి కూర్చోబోయిందా పిచ్చితల్లి. ఇంతలో చుట్టుప్రక్కల ప్రయాణికుల వైపోసారి చూస్తూ మెల్లగా పిల్లాడితో సీట్లో గబుక్కున కూర్చున్నాడు నాని. దీంతో నిర్ఘాంతపోతూ చూసిందా యువతి.
బస్సు వేగంగా పోతూనే ఉంది. బస్సు వేగానికి చల్లటి గాలి బస్సులోకి ప్రవేశిస్తోంది. హాయిగా సీట్లో కూర్చున్న నాని కనురెప్పలు చల్లటి గాలికి బరువెక్కసాగాయి. ఆ గర్భిణి మాత్రం అలా నిల్చునే ఉంది.
గాంధీ, నెహ్రూలకంటే మగాళ్లులేరా?
గాంధీ, నెహ్రూలకంటే మగాళ్లులేరా?
ఆగస్టు 15.. అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చింది.. ఇండియాకు... అది సాధించింది ఎవరు? ప్రతి ఆగస్టు 15న రాజకీయనాయకులు కానీ, అధికారులుకానీ, పుస్తకాల్లోగానీ.. గాంధీ, నెహ్రూ కుటుంబాలవారే తెచ్చారన్నట్లుగా ప్రచారం చేసేశారు. స్వాతంత్య్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు.. మన తాతలు, ముత్తాతలతో పాటు, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి, భగత్‌సింగ్. ఇలా ఎంతోమంది త్యాగఫలం మనం అనుభవిస్తున్నాం.
అలాంటిది... కేవలం రెండుకుటుంబాల వారే చేసినట్లుగా.. ప్రతి ఆగస్టు 15వ తేదీన నాయకులు.. తెల్లటిబట్టలు కట్టుకుని.. ఓ టోపీని కొనుక్కుని.. అది కూడా... అతని అసిస్టెంట్ కొంటే తెచ్చిపెట్టుకుంటారు. కానీ స్వంతంగా వెళ్ళి కొనరు... మన ఇంట్లో సంక్రాంతికి, ఇతర పండుగలకు పిండి వంటలు కొనుకున్నట్లు... రాజకీయనాయకులు టోపీలు కొనుక్కుని.. ఆరోజు తూతూమంత్రంగా కానిచ్చేస్తారు.. ఇది ఎంత దురుదృష్టకరం... అని సంచలన రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు.
పోసాని ముఖ్య అతిథిగా 'ఆగస్టు 15' అర్థరాత్రి 12 గంటలు' అనే చిత్రం ఆడియో వేడుకలో (సోమవారం, 14 నవంబర్ 2011) ఆదివారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన పై విధంగా మాట్లాడారు.

17, జులై 2011, ఆదివారం
జగమెరుగని ఝాన్సీరాణి
జగమెరుగని ఝాన్సీరాణి
ఆ తర్వాత బ్రిటిష్‌వారిపై పోరాడుతూ వీరమరణం పొం దటం.. ఇవన్నీ 23 ఏళ్ల జీవితం లోనే ముగిసిపోయాయి. 1857 నాటి పరిస్థితుల గురించి.. లక్ష్మీబాయి జీవితం గురించి విష్ణుభట్ మరాఠీలో రాసిన పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు మృణాల్ పాండే ఇటీవల ఇంగ్లీషులోకి అనువదించారు. దాని నుంచి- లక్ష్మిబాయి జీవితంలోని ముఖ్య మలుపులు.. ఘట్టాలు మీ కోసం అందిస్తున్నాం..
"ఝాన్సీకి వెళ్లాలనుకున్న తర్వాత నాకు రాము మామ చెప్పిన అనేక విషయాలు గుర్తుకువచ్చాయి. రాము మామ చెప్పిన సమాచారం ప్రకారం- ఝాన్సీ ఉత్తర భారతదేశంలోని పెద్ద నగరాల్లో ఒకటి. జనాభా పదిహేను లక్షల దాకా ఉంటారు. దేశంలోని అతి పటిష్ఠమైన కోటల్లో ఝాన్సీ కోట కూడా ఒకటి. పూణేలో పేష్వాలు బలహీనపడిన తర్వాత గ్వాలియర్ మాదిరిగానే ఝాన్సీ కూడా స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఝాన్సీని పాలించిన రాజులలో చాలామందికి పిల్లలు లేరు. హిందూ సమాజంలోని ఉన్నత కులాల వారి మాదిరిగానే వారు కూడా మగపిల్లలను దత్తత తీసుకొనేవారు. మహారాజు మరణించిన వెంటనే అతని దత్తత కుమారుడు పరిపాలన చేపట్టేవాడు.
ఝాన్సీ మహారాజు గంగాధరరావు రెండు సార్లు పెళ్లి చేసుకున్నాపిల్లలు పుట్టలేదు. మగపిల్లవాడిని దత్తత తీసుకోవాలనే గంగాధరరావు అభిమతానికి బ్రిటిష్ పాలకులు అడ్డుపుల్ల వేశారు. అతను పెట్టుకున్న దరఖాస్తులకు కలకత్తాలోని గవర్నర్ జనరల్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. పిల్లలు లేరనే బాధతో గంగాధరరావు మరణించాడు. అతని భార్య లక్ష్మీ బాయి ఒక పన్నెండేళ్ల కుర్రాడిని దత్తత తీసుకుంది. బ్రిటిష్ పాలకులు ఆ దత్తతను కూడా చట్టబద్ధం చేయటానికి అంగీకరించలేదు. ఈ లోపులో సిపాయి తిరుగుబాటు జరిగింది.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మీ బాయే పగ్గాలు చేపట్టింది...అసలేం జరిగిందంటే..''
పెరిగింది ఇలా..
తల్లి బతికి ఉంటే- ఛాబిలీని అసలు ఇంటి నుంచి బయటకు రానిచ్చేవారు కాదేమో! ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల - ఛాబిలీ కూడా తండ్రిలాగానే ఉదయాన్నే యాగశాలకు వచ్చేసేది. అక్కడే ఆడుకునేది. అక్కడే తినేది. మధ్యాహ్నం నిద్ర వస్తే అక్కడే పడుకొనేది. చుట్టూ ఉన్నది మగపిల్లలే కావటంతో, వారితోనే ఆడేది. చదవటం, రాయటంతో పాటు ఆమె విలువిద్య, గుర్రపుస్వారీ వంటి విద్యలు కూడా నేర్చుకుంది. అలా చూస్తుండగానే- ఛాబిలీకి పన్నెండేళ్లు వచ్చేశాయి. మోరోపంత్ ఆమెకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఛాబిలీ జాతకం ఎవరికీ నప్పేది కాదు. దీనితో అనేక మంది వెనక్కి వెళ్లిపోయారు. అంతే కాకుండా- బాగా చదువుకున్న తన కూతురును పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేయటం అతనికి ఇష్టం లేదు.
సరిగ్గా అదే సమయంలో గంగాధర రావు భార్య చనిపోయింది. అతను మళ్లీ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కాని అతనికి పిల్లను ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. కొందరి జాతకం అతనికి నప్పలేదు. మరి కొందరు అతని గురించి వచ్చిన వదంతులకు భయపడ్డారు. ఈ వదంతుల ప్రకారం-
కొన్ని సార్లు గంగాధరరావు తన దర్బారు నుంచి నేరుగా రాణివాసానికి వెళ్తాడు. అక్కడ మగ దుస్తులను వదిలేసి, పట్టుచీర, పావడా కట్టుకుంటాడు. చేతికి గాజులు వేసుకుంటాడు. ముక్కుకు పుడక పెట్టుకుంటాడు. కాళ్లకు పట్టీలు కూడా పెట్టుకుంటాడు. అలాంటి సమయంలో కేవలం ఆడవాళ్లతోనే మాట్లాడతాడు. మగవారితో మాట్లాడడు. అంతే కాకుండా నెలలో నాలుగు రోజులు మైల ఉందని- విడిగా ఒక గదిలోకి వెళ్లిపోతాడు. (మహిళలకు రుతుస్రావం అయినట్లు). ఆ సమయంలో దర్బారుకు రాడు. నాలుగవ రోజు స్నానం చేసి..పూజలు చేసిన తర్వాతే తిరిగి దర్బారుకు వస్తాడు. ఈ సమయంలో గోర్డన్ సాహెబ్ అనే అధికారి బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉండేవాడు. గంగాధరరావు గురించి వచ్చిన వదంతులు ఆయనకు కూడా చేరాయి. గోర్డన్ సాహెబ్ ఒకసారి గంగాధరరావును కలిసాడు. "నాకు చాలా కాలంగా ఒక అనుమానం ఉంది. మీరు మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.
ఒక మహిళ ఎంత భయం భయంగా బతుకుతుందో మేము కూడా అదే విధంగా జీవిస్తున్నాం. అందుకే నేను కూడా ఒక మహిళలా గాజులు వేసుకుంటున్నా..నాలుగు రోజులు విడిగా కూర్చుంటున్నా..'' అని సమాధానమిచ్చాడు. మోరోపంత్ ఈ విషయాలన్నీ ఆ నోట, ఈ నోట విన్నాడు. గంగాధరరావు తొలి భార్యకు ఒక బిడ్డ పుట్టి చిన్నప్పుడే చనిపోయాడు. అందువల్ల గంగాధరరావు మగవాడు కాకపోయే అవకాశం లేదని మోరోపంత్ భావించాడు. గంగాధరరావు ప్రవర్తన ఎలా ఉన్నా రాజ్యపాలన మాత్రం బావుండేది. దీనితో గంగాధరరావుకు ఛాబిలీని ఇచ్చి పెళ్లి చేయటానికి మోరోపంత్‌కు ఎటువంటి అభ్యంతరం లేకుండా పోయింది. గంగాధరరావుకు పెళ్లి సంబంధాలు చూస్తున్న వారితో ఈ విషయం చెప్పాడు.
అనుమానపు మొగుడు..
లక్ష్మిబాయి సంసారం మొదటి నుంచి అంత ఆనందంగా గడవలేదు. గంగాధరరావుకు తన కన్నా చాలా చిన్నదైన లక్ష్మిబాయిపై అనుమానం ఎక్కువ. దీనితో ఆమెను రాణివాసం నుంచి కూడా బయటకు రానిచ్చేవాడు కాడు. పడకగదిలోనే ఉంచి తాళం పెట్టేవాడు. మగవాళ్లు ఎవరూ ఆమె మహలు వైపు కూడా చూడటానికి వీలులేకుండా కొందరు మహిళా సైనికులను కాపలా పెట్టాడు. ఇంత కట్టుదిట్టం చేయటం వల్ల లక్ష్మిబాయి మనస్తత్వంలో అనేక మార్పులు వచ్చాయి. అమ్మాయిగా ఉండటం కన్నా అబ్బాయిగా పుడితేనే మేలని భావించేది. చిన్నప్పుడు స్వేచ్ఛగా మగపిల్లలతో తిరిగిన రోజులు ఆమెకు గుర్తుకువస్తూ ఉండేవి. దీనితో ఆమె కొన్ని సార్లు మగవాళ్ల బట్టలు వేసుకుంటూ ఉండేది. పెళ్లి అయిన కొద్ది రోజులకే గంగాధరరావు అనారోగ్యం పాలయ్యాడు. మరణశయ్యపై నుంచి గోర్డన్ సాహెబ్‌కు కబురుపెట్టాడు. "నా భార్య ఇంకా యుక్తవయస్సులో ఉంది. పిల్లలు లేరు.
అందువల్ల మా బంధువుల పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోవటానికి అంగీకరించండి..'' అని అడిగాడు. గంగాధరరావు అంటే గోర్డన్ సాహెబ్‌కు కొంత సానుభూతి ఉంది. దీనితో అతను కలకత్తాలో ఉన్న తనపై అధికారులకు విషయాన్ని వివరిస్తూ ఒక ఉత్తరం రాశాడు. కానీ కలకత్తాలో అధికారుల వ్యూహం మరోలా ఉంది. "గంగాధరరావుకు పిల్లలు లేరు. అందువల్ల ఝాన్సీని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టండి. మీరు చీఫ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాధ్యతలు చేపట్టండి'' అని కలకత్తా నుంచి సమాధానమొచ్చింది. ఇక చేసేదేమీ లేక- గోర్డన్ సాహెబ్ ఝాన్సీ సామ్రాజ్యాన్ని తన అదుపులోకి తీసుకున్నాడు. ఇంతలో గంగాధరరావు మరణించాడు. గోర్డన్ సాహెబ్ మాత్రం లక్ష్మిబాయి పట్ల సానుభూతితోనే వ్యవహరించాడు. కోటలో కొద్ది భాగాన్ని ఆమెకు ఇచ్చాడు. గంగాధరరావు వదిలి వెళ్లిన సంపదను కూడా ఆమెకే వదిలేసాడు.
అన్నీ అడ్డంకులే..
బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా సిపాయిలు తిరుగుబాటు చేస్తారనే వార్తలు దావానలంలా వ్యాపించటం మొదలుపెట్టాయి. దీనితో బ్రిటిష్ పాలకులు- సంస్థానాధీశులపై పట్టుబిగించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. లక్ష్మిబాయి పెట్టుకున్న దత్తత అర్జీలకు సమాధానాలు ఇవ్వలేదు. ఆమెకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను కూడా నిలుపుచేశారు. ఈ పరిస్థితుల్లో మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. కొందరు బ్రిటిష్ అధికారులను చంపేశారు. దీనితో ఝాన్సీ కంటోన్మెంట్‌లో నివసించే అనేక మంది బ్రిటిష్ అధికారులకు వణుకుపుట్టింది. ప్రజాభిప్రాయం తమకు వ్యతిరేకంగా ఉందని బ్రిటిష్ అధికారులు గమనించారు. తమకు సాయం చేయమని లక్ష్మిబాయిని కోరారు.
జూన్ 8, 1857..
రాజ్యంలో ప్రశాంతత ఏర్పడేవరకూ ఆమే సర్వాధికారిణి అని..అయితే బ్రిటిష్‌వారి ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ఆమె గోర్డన్ సాహెబ్, ఇతర బ్రిటిష్ అధికారులకు రక్షణ కల్పించాలనే షరతు కూడా ఆ వర్తమానంలో ఉన్నాయి. దాన్ని చదివిన లక్ష్మిబాయికి విపరీతమైన కోపం వచ్చింది. "నన్ను ఒక రాణిగానే మీరు గుర్తించలేదు. కలకత్తాలో జరిగిన రాజ్యాధీశుల సమావేశానికి పిలవలేదు. నా భర్త చివరి కోరికగా- ఒక బిడ్డను దత్తత తీసుకుంటానంటే అంగీకరించలేదు. నేను కాశీ, ప్రయాగ తీర్థయాత్రలకు వెళ్తానంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు మీ ప్రాణాల మీదకు వచ్చింది కాబట్టి, ఇవన్నీ ఇస్తున్నారా? మిమల్ని దయతో మా దగ్గర ఉంచుకోవాలా? బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేసిన సైనికులు దీనికి అంగీకరిస్తారా? మీరు మా దగ్గర రక్షణ పొందుతున్నారని తెలిసిన తర్వాత వాళ్లు మమ్మల్ని వదులుతారా? '' అని అవేశంగా మధ్యవర్తిని ప్రశ్నించింది. బ్రిటిష్ వారి ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది..
అర్థరాత్రి అయింది. అందరూ ఉద్విగ్నంగా ఉన్నారు. చీకటి మాటున గోర్డన్ సాహెబ్ ఒంటరిగా రాణిమహల్‌కు వచ్చాడు. "నా భార్యకు ఏడోనెల. బయట పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. బ్రిటిష్ ప్రజలు కనిపిస్తే చంపేస్తున్నారు. కంటోన్మెంట్‌లో సిపాయిలు రేపు తిరుగుబాటు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మీరు రక్షణ ఇవ్వకపోతే- మా ప్రాణాలకు ముప్పు తప్పదు. నా భార్యను, పుట్టబోయే బిడ్డను కాపాడండి..'' అని లక్ష్మిబాయిని వేడుకున్నాడు. లక్ష్మిబాయి మనసు కరిగింది. మహిళలకు, పిల్లలకు రక్షణ ఇవ్వటానికి అంగీకరించింది. మర్నాడు ఉదయం ఏడు గంటలకు బ్రిటిష్ అధికారుల భార్యలు, పిల్లలు రాణివాసానికి రహస్యంగా వచ్చేశారు.
జూన్ 9, 1857..
ఉదయం పది అయింది. ఒక్క సారి పెద్ద అల వచ్చినట్లు.. సైనికులందరూ రోడ్ల మీదకు వచ్చారు. సైనిక క్యాంపును కాపలా కాస్తున్న బ్రిటిష్ అధికారులను విచక్షణారహితంగా చంపేశారు. క్యాంపుకు నిప్పు అంటించారు. ఆ తర్వాత సైనికులందరూ రాణివాసం దగ్గరకు వచ్చారు. "మీరే మాకు సర్వ సైన్యా«ధ్యక్షురాలు. మీ ఆదేశాలు మేం పాటిస్తాం..'' అని పెద్దగా నినాదాలు చేయటం మొదలుపెట్టారు. సైనిక దుస్తుల్లో రాణి లక్ష్మిబాయి వారి ముందుకు వచ్చింది. "పెద్ద యుద్ధం ఇంకా ముందు ఉంది. మనందరం కలిసికట్టుగా పోరాడితేనే శత్రువును తరిమి తరిమి కొట్టగలుగుతాం..'' అంటూ ప్రసంగించింది లక్ష్మీబాయి. ఝాన్సీ ప్రాంతానికి తాను రాణిగా పాలనాబాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించింది. ఆయుధాల కర్మాగాలన్నింటిలోను ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సైనికులకు బ్రిటిష్‌వారు తగ్గించిన వేతనాలను తిరిగి పెంచుతున్నట్లు ప్రకటించింది.
పరిపాలన షురూ..
ఆమె స్నానం కోసం పదిహేను నుంచి ఇరవై పెద్ద పెద్ద గుండిగలతో నీళ్లను కాచేవారు. స్నానం తర్వాత తెల్లని చందేరీ పట్టు చీరను కట్టుకొనేది. కాశీ, ప్రయాగ తీర్థయాత్రలకు బ్రిటిష్ పాలకులు అంగీకరించకపోవటంతో- లక్ష్మిబాయి తన శిరోజాలు తీయించుకోలేదు. శాస్త్ర ప్రకారం- శిరోజాలు తీయించుకోని విధవరాలు - కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తే తప్ప భగవంతుడిని పూజించకూడదు. అందువల్ల ప్రతి రోజు లక్ష్మిబాయి తులసి మొక్కకు పూజ చేసేది. ఆ తర్వాత శివప్రార్థనకు ఉపక్రమించేది. మధ్యాహ్న భోజనం తర్వాత ఆమె కొద్ది సేపు విశ్రాంతి తీసుకొనేది. కొన్నిసార్లు ఆమె దర్బారుకు మగదుస్తులలో వచ్చేది. పంచె, పైన కోటు, కుచ్చుతలపాగా పెట్టుకొనేది. నడుముకు బంగారు ఎంబ్రైడరీ చేసిన గుడ్డ కట్టుకొనేది. దానికే కత్తి వేళ్లాడుతూ ఉండేది. కొన్ని సార్లు ఆమె ఆడవేషంలో కూడా దర్భారుకు వచ్చేది. భర్త మరణం తర్వాత లక్ష్మిబాయి ముక్కుపుడక పెట్టుకోవటం మానేసింది.
మట్టి గాజులు వేసుకోవటం మానేసి- బంగారు గాజులు మాత్రమే ధరించేది. మెడచుట్టూ ఒకే వరస ఉన్న ముత్యాలు, చేతికి వజ్రాల ఉంగరం పెట్టుకొనేది. నాకు తెలుసున్నంత వరకూ ఆమె ఎప్పుడూ ఇతర ఆభరణాలు ఏమీ ధరించలేదు. ఆమె జుట్టును గుండ్రంగా చుట్టుకొనేది. కొన్ని సార్లు జడ కూడా వేసుకొనేది. ఆమె దర్బార్ హాలులో కూర్చున్నప్పుడు తెల్ల శాలువాను నెత్తి మీద నుంచి కప్పుకొనేది. రాజ ప్రధాని లక్ష్మణ రావు ఆమె ముందు నిలబడి ఉండేవాడు. ఎనిమిది నుంచి పది మంది సిబ్బంది ఆమె జారీ చేసిన ఆదేశాలను నమోదు చేస్తూ ఉండేవారు. లక్ష్మిబాయి ఏ వివాదాన్నయినా చాలా సులువుగా పరిష్కరించేది. కొన్నిసార్లు నేరస్తులను ఆమే స్వయంగా కర్రతో కొట్టేది.
చూడటమే వేడుక..
లక్ష్మిబాయి గుర్రపు స్వారీని గాని, రథయాత్రను గాని చూడడం ఒక వేడుక. ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉండేది. ఆమె ర«థాన్ని రెండు వైపులా బంగారు జరీతో ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ కర్టెన్లతో మూసేసేవారు. మెరిసిపోయే ముత్యాల సెట్‌తో పాటు అందమైన పట్టుచీర కట్టుకొనేది. మగబట్టలు కట్టుకున్నప్పుడు తలపాగ తప్పనిసరిగా ఉండేది. ఆమె రథంతో పాటు నలుగురు అందమైన అమ్మాయిలు పక్కన పరిగెడుతూ ఉండేవారు. వీరికి చిన్నతనం నుంచి రాణి పక్కన రథంతో పాటు పరిగెత్తటాన్ని శిక్షణ ఇచ్చేవారు. సాధారణంగా వీరు దక్షిణభారతదేశానికి చెందినవారై ఉండేవారు.
అందమైన ఈ అమ్మాయిలు ఒక చేతిలో బంగారపు కర్రలు, మరో చేతిలో బంగారపు విసనకర్రలు పట్టుకొని పరిగెడుతూ ఉంటే- వారిని చూడటానికి వందలమంది గుమిగూడుతూ ఉండేవారు. రథం ముందు కొందరు వాయిద్యాలు వాయిస్తూ వెళ్తూ ఉండేవారు. వెనక దాదాపు రెండు వందల మంది సైనికులు నడుస్తూ ఉండేవారు. వీరందరితో పాటు - రథం వెనక ప్రధానితో సహా అనేక మంది ముఖ్యాధికారులు కూడా ఉండేవారు. లక్ష్మిబాయి గుర్రం స్వారీ చేసేటపుడు ఇంత ఆర్భాటం ఉండేది కాదు. కొద్దిమంది అధికారులు, సైనికులు మాత్రమే ఆమె వెంట ఉండేవారు. రాత్రి అయితే ఆమెకు దారి చూపించటానికి కాగడాలను మోసేవారు కూడా ఉండేవారు. కాని చాలాసార్లు లక్ష్మిబాయి వారిని దాటి చీకట్లోనే కోటలోకి వెళ్లిపోయేది.
వందేళ్లకు ఇంగ్లీషులోకి...
లక్ష్మీబాయిని బ్రిటిష్ వాళ్లు చంపేసిన తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో కూడా బతుకుతెరువు కోసం ప్రయత్నించి చివరికి నిరాశతో స్వగ్రామం చేరుకున్నాడు. తాను ఉత్తరభారత దేశంలో చూసిన సంఘటనలన్నిటితోను మరాఠీలో ఒక పుస్తకం రాశాడు. దాని పేరు మజాప్రవాస్: 1857 చా బండాసి హకీకత్ (నా ప్రయాణాలు: 1857 తిరుగుబాటు కథ). ఈ పుస్తకాన్ని ఆయన దాదాపు 30 ఏళ్ల తర్వాత రాస్తే అది అచ్చయి బయటికి వచ్చింది. 1907లో దానిలో ఝాన్సీ సంస్థానం గురించి ప్రముఖంగా ప్రస్తావించాడు. ఈ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు- విష్ణుభట్ స్వయంగా చూసినవి. మరికొన్ని వాళ్లు వీళ్లు చెప్పగా విన్నవి. దాదాపు వందేళ్ల తర్వాత ఈ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు మృణాల్ పాండే ఇంగ్లీషులోకి అనువదించారు.
అనువాదం : సివిఎల్ఎన్ ప్రసాద్
7, జులై 2011, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)