సొంత పైత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సొంత పైత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, సెప్టెంబర్ 2013, శనివారం

ఒక అసమర్ధుడు ఇంకో అసమర్దుడిని గోకడం ఎంతవరకు సమంజసం ??...

ఇంకా  ఎన్ని రోజులు చంపుకతింటారు జనాలను వీళ్ళ వెధవ తెలివితేటలతో. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే ఇంకో వెధవ. ఈయేన గోరు జనాలను వొడ్డున వేసాడు , ఇంకోరిని గోకి తెచ్చి ఆయనతో వుతకేస్తాడు. అస్సలు వీళ్లల్లో ఎవడన్నా  పోతే బాధ పడేవాళ్ళు ఎంతమంది?....

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

చదువుకొ(కు)న్న వారిలో కుల పిచ్చి అధికం

నీను ఒక మహానుభావుని ప్రవచనాల కోసం గూగుల్ చేస్తే, 'google search engine' లో నుండి 'Auto search' చూపిన సంబంధిత సమాచారం చూసి మతి చెదిరింది. అనాగిరికులకు ఎన్ని పట్టాలు వున్నా కుల గజ్జి మాత్రం వొదిలేలా లేదు. ఎన్ని అనుకున్నా ఏమి లాబం? ఎవ్వడికి వాడు మారాలి, వేరేవాడు మార్చలేడు. ప్రవచనాలు ఎ కులం వాళ్ళు చెబితే ఏమి? సారాంశం ముఖ్యం కాని. మారండి మహా ప్రభో, దయచేసి మారండి....!!

27, అక్టోబర్ 2012, శనివారం

ఇదిగో తోక, అదిగో పులి (జాతీయ మీడియా, తెలుగు మీడియా)

గత ఇదు రోజుల నుండి మీడియా వార్తలు చదివి, వీడియోలు చూసి ఆగబట్టలేక రాస్తున్నా....

రెండు నిండు ప్రాణాలు పోగొట్టుకొని ఆ కుటుంబం విషాదంలో వుంటే, మన జాతీయ మీడియా, తెలుగు మీడియా రాసిన రాతలు


మరి మన తెలుగు మీడియా తక్కవ తినకుండా... ఇదిగో 

TV9 వాడు మరీ రెండు ఆకులు ఎక్కువ చదివి మీమే information FBI కి ఇచ్చాం అని చాటింపు.
అస్సలు పోలీస్ report లో ఏముందో మీరే చదవండి.

ఇంకా వేరే పత్రికలు/పుత్రికలు చదవే వోపిక లేదు, అక్కడ ఇంకా ఎంత చండాలంగా రాస్తున్నారో...

గడ్డి తిని పెరిగిన మనుషులను ఎవ్వరు ఏమి చెయ్యలేరు. ఈ సమాజం లో ప్రతీ గల్లీ లో వున్నారు నర రూప రక్కసులు. ఈ మీడియా ముందు జనాలను పక్క దోవ పట్టించడం మానక పోతే చివరకి మిగిలేది శూన్యం. 

ముందుగా రెండు ఆత్మలకు శాంతి కలగానని దేవుడిని ప్రార్దిస్తూ... ఆ కుటుంబానికి ఇకనైనా మంచి జరగాలని కోరుకుంటూ......
అక్షర దోషాలు  మన్నిచండి, ఈ టపా మంచి సమాచారం పంచడం కోసం రాయడం జరిగినది. అభ్యంతరం వున్న తెలియజేయగలరు.



8, ఏప్రిల్ 2012, ఆదివారం

అన్నమో రామచంద్రా, పెరుగన్నమో రామచంద్రా

(అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలున్న దయచేసి మన్నించండి)
ఇది నా బాల్య స్మృతి, ఎందుకో టపా రాయాలనిపించింది. చిన్నప్పుడు ఇంట్లో పెరుగు కుండ నిండుగా వుండేది. రోజుకు మూడు సార్లు పెరుగన్నం తిన్నా ఇంకా తినాలనిపించేది.
పొద్దున్నే లేవగానే నీను ప్రతీ రోజు "అన్నమో రామచంద్రా, పెరుగన్నమో రామచంద్రా" అనే పాట అందుకునే వాడిని, మా అమ్మ కోపంతో రోజు మమ్ముల్ని నీ ఆకలి కేకలతో వేధించడం దేనికి నువ్వు తింటే ఎవరన్నా వోద్ధన్నారా !... వెళ్ళి కావాల్సినంత తిను అంటూ, చూస్తా వుండరా నీకు అన్నీ వున్నా పెరుగన్నం మాత్రం దొరకదేమో చూడు అని పాట ఆపమని అడిగినా మనం వింటేగా ....

నిజం చెబుతున్నాను, పొద్దున్నే మీగడ పెరుగు, చద్దన్నంతో ఎ ఆవకాయో, టమాటో పచ్చడో "పచ్చి/వూరగాయ", వుసిరికాయ పచ్చడో, గోంగూర పచ్చడో, నిమ్మకాయ పచ్చడో, సాంబారో, రసమో, పప్పో, బెండకాయ పులుసో, దోసకాయ కూరో, సొరకాయ పులుసో, ఆలుగడ్డ వేపుడో వేసుకొని తింటే "నా సామి రంగా" ఆ రుచి వర్ణణాతీతం....

కాలేజీ రోజుల్లో ఒక తమిళ్ వార్డెన్ వుండే వాడు, తను పెరుగు వేసుకున్నాకే వేరే కూరో, పులుసో, పచ్చడో వేసుక తినేవాడు, అది చూసి నాకు చాలా వింతగా అనిపించేది. నా అలవాట్లు ఈ దొరకు ఎలా అబ్బినాయో తెలియక తికమక పడుతూ ఆగబట్టలేక ఒక రోజు అయ్యోరిని అడిగేసాను, ఆయనో చిన్న నవ్వు నవ్వి, మా గ్యాంగ్ అంతా ఇలానే తింటాం. నీవోరకు నువ్వేదో కనిపెట్టా అనుకుటున్నావ్, ఇవన్నీ మీము ఎప్పుడో కనుగొన్నాం సార్ అన్నాడు, ఆ దెబ్బకు మైండ్ బ్లాక్ అయనట్టు  గుర్తు.....

పులిహోరలో, నిమ్మరసం అన్నంలో పెరుగు అదుర్స్...

రాములోరి దయవల్ల ఇదిగో ఇవ్వాళ ఇలా నిమ్మరసం అన్నం పెరుగుతో తింటూ టపా రాస్తున్నాను...



మరికొన్ని విచిత్రాలు ...........






మీరు ఓసారి ట్రై (ఇంతకుముందు చెయ్యకపోతే)  చేసి అనుభవం పంచుకోండి. మీకు తప్పక నచ్చి తీరుతుంది.......