ఇక్కడ, నాకున్న తెలుగు పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలని లేదు. నేను చాలా వరకు ఎవరో వ్రాసిన, చెప్పిన వాటిని ఒకచోట చేర్చి నా ఆనందం కోసం నేను దాచుకుంటున్న పేజీలు. మీకు నచ్చితే తప్పక చదవండి, మరొకరితో పంచుకోండి. నాకు నచ్చిన విధంగా వ్రాయాలి అనుకుంటున్నాను, నాకు సొంత పైత్యం ఎక్కువ అయింది అనిపిస్తే మందలించండి.
అవి-ఇవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఏప్రిల్ 2015, గురువారం
8, జూన్ 2014, ఆదివారం
అయ్యగారికి సెగ తగిలేసరికి, తిక్క రేగింది......
ఒకప్పుడు తను ధర్నా అని పిలిస్తే సగం రాష్ట్రము తగలబడి పోయి, పది మంది హరీ అనేస్తే Mr తెలంగాణా నయా తుగ్లక్ ఎంతో సంతోసించేవాడు.
ఇప్పుడు సామాన్యుడు ఎక్కడ అప్పు తీరక, మళ్లీ అప్పు పుట్టక ఎలా పూట గడపాలో తెలియక ఆక్రోశం తో ధర్నా చేస్తే అది మాత్రం ఏదో కొంపలు తగల పడి పోతున్న ఫీలింగ్ లో వున్నాడు. అవును లే మన కొంపలో ముగ్గురు మంత్రులు (ముఖ్య 'ముక్కు' తో సహా) ఒక MP . మన కడుపు నిండింది గా !! సామాన్యుడు బతికితే ఎంత ? చస్తే ఎంత ?
తనకు తెలియకుండా మంత్రి చేసాడు అనడం, పత్రికలు ఏదో రాసాయి అనడం ఈ నయా చిరంజీవికే చెల్లింది.
నీవు నేర్పిన విద్యే నీరజాక్ష.......
Webdunia news page link (Copy content below)

కొంపలు తగలబడ్డాయా.. దిష్టిబొమ్మలు తగలేస్తున్నారు : కేసీఆర్
తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి పట్టుమని పది రోజులు కూడా కాలేదని, ఇంతలోనే ఏవో కొంపలు తగలబడినట్టు తన దిష్టిబొమ్మలు తగలేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఒక మంత్రి తెలిసో తెలియకో ప్రకటన చేశారని, దీనిపై నానా యాగిరి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. దీనికి భారత రిజర్వు బ్యాంకు అనుమతి కావాలన్నారు. రుణమాఫీ ప్రక్రియను 10 -15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రుణమాఫీ కాలపరిమితిపై మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి కేవలం నాలుగు రోజులే అయిందని, దానికే ఏవో కొంపలు మునిగిపోయినట్టు దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని, అది మంచి పద్దతికాదని కేసీఆర్ హితవు పలికారు. ఇతర పార్టీల నేతల మాటలు నమ్మవద్దని కేసీఆర్ సూచించారు.తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి పట్టుమని పది రోజులు కూడా కాలేదని, ఇంతలోనే ఏవో కొంపలు తగలబడినట్టు తన దిష్టిబొమ్మలు తగలేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఒక మంత్రి తెలిసో తెలియకో ప్రకటన చేశారని, దీనిపై నానా యాగిరి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. దీనికి భారత రిజర్వు బ్యాంకు అనుమతి కావాలన్నారు. రుణమాఫీ ప్రక్రియను 10 -15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రుణమాఫీ కాలపరిమితిపై మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి కేవలం నాలుగు రోజులే అయిందని, దానికే ఏవో కొంపలు మునిగిపోయినట్టు దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని, అది మంచి పద్దతికాదని కేసీఆర్ హితవు పలికారు. ఇతర పార్టీల నేతల మాటలు నమ్మవద్దని కేసీఆర్ సూచించారు.
5, జూన్ 2014, గురువారం
బంగారం వేసుక తిరిగే ముందు ఆలోచించండి.
బంగారం వేసుక తిరిగే ముందు ఆలోచించండి........
అంతకన్నా కొనేముందు 100 సార్లు ఆలోచించండి. నీను చాలా సార్లు చూసాను అవసరం లేకున్నా ఏదో ఆర్భాటం (ఎవరికోసమో తెలియదు కాని, ఆ పెద్ద పెద్ద గొలుసులు, అవసరం లేని ఆ వడ్డాణాలు, వీళ్ళను చూసి వాళ్ళు, వాళ్ళను చూసి వీళ్ళు రెచ్చి పోయి display లు అవసరమా? ). ఈ గొడవ USA లో పని లేని అమ్మలక్కలకు మరీ ఎక్కువ. ఇది కాక, safe lockers గొడవ, కొన్నోడికి నిద్ర లేకపోవడం, దొంగలు, హత్యలు, కేసులు ఇవన్ని అవసరమా?......... అవసరం ఐతే ఇంకో కిలో కొనండి, దూల తీరుద్ది......

28, జులై 2013, ఆదివారం
17, మార్చి 2013, ఆదివారం
ఇదేమి ఖర్మ దేవా ......
ఆంధ్రజ్యోతి న్యూస్ లింక్
శివుడు, దుర్గ.. హిందూ దేవుళ్లు కాదు!
వారంతా అతీంద్రియ శక్తులు..
శివుడు, దుర్గ.. హిందూ దేవుళ్లు కాదు!
వారంతా అతీంద్రియ శక్తులు..
శివారాధన మతపరమైనది కాదు
హిందుత్వం మతం కాదు!..
హిందువులకు దైవపూజ తప్పనిసరి కాదు
పన్ను మినహాయింపుపై ఐటీ ట్రిబ్యునల్ ఆదేశం
ముంబై, మార్చి 16: శివుడు.. గణపతి.. హనుమంతుడు.. దుర్గాదేవి! వీళ్లంతా ఎవరు!? వీళ్లంతా హిందూ దేవుళ్లు, దేవతలు అని చెప్పేరు కనక!! ఈ మాటంటే ఆదాయ పన్ను శాఖ ట్రిబ్యునల్ ఒప్పుకోదు! వాళ్లు ఏ మతానికీ సంబంధించిన వారు కాదని.. ఈ విశ్వంలోని అతీంద్రియ శక్తులని ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చింది! వారి ఆలయాలకు విరాళం ఇచ్చినా అది 'మతపరమైన' కార్యక్రమాల కిందకు రాదని స్పష్టం చేసింది. హిందూ దేవుళ్ల ఆరాధన, ఆలయాల నిర్వహణ కోసం పెట్టే ఖర్చును మతపరమైనదిగా భావించలేమని తేల్చి చెప్పింది.
అందువల్ల... ఈ ఖర్చుకు ఆదాయ పన్ను చట్టం ప్రకారం మినహాయింపు వర్తిస్తుందని నాగపూర్ ఆదాయ పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. అంతేకాదు... "హిందూయిజం అంటే ఒక మతమూ కాదు. వర్గమూ కాదు. అందులో వేర్వేరు వర్గాలున్నాయి. వివిధ రూపాల్లో వేర్వేరు దేవుళ్లను పూజిస్తారు. అసలు.. హిందూ జీవన శైలిని ఆచరించే వ్యక్తి దేవుడిని పూజించడం తప్పనిసరి కాదు'' అని తేల్చి చెప్పింది. నాగపూర్‌లో శివ మందిర్ దేవస్థాన్ పంచ్ కమిటీ సంస్థాన్ అనే ఓ సంస్థ ఉంది.
2008లో ఆ సంస్థ భవన నిర్వహణ, అన్నదానం, ప్రార్థనలు, టైలరింగ్‌లో శిక్షణ, యోగా శిక్షణ, ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు రూ.82,977 ఖర్చు చేసింది. ఈ ఖర్చుకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. అయితే, భవన నిర్వహణ, అన్నదానం, పండుగ ప్రార్థనలు, రోజువారీ ఖర్చులు 'మతపరమైన ఖర్చుల' కిందకు వస్తాయని, వీటికి పన్ను మినహాయింపు ఇవ్వడం కుదరదని ఆదాయ పన్ను శాఖ కమిషనర్ తెలిపారు. సంస్థాన్ విన్నపాన్ని తోసిపుచ్చారు. సంస్థాన్ మొత్తం ఖర్చులో ఐదు శాతం కంటే అధికంగా మతపరమైన కార్యక్రమాలకు ఖర్చు చేశారని, మతేతర కార్యక్రమాలకు కేవలం రూ.6700 మాత్రమే ఖర్చు చేశారని కమిషనర్ పేర్కొన్నారు.
వీటికి పన్ను మినహాయింపు వర్తించదని స్పష్టం చేశారు. ఆయన ఆదేశాన్ని సవాల్ చేస్తూ సంస్థాన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. వాస్తవానికి, నిర్దిష్ట కులం లేదా నిర్దిష్ట మతం ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలకు పన్ను మినహాయింపు వర్తించదని ఆదాయ పన్ను చట్టం చెబుతోంది. అయితే, తమ ఆలయం నిర్దిష్టంగా ఒక్క కులం, లేదా మతానికి పరిమితం కాదని సంస్థాన్ వాదించింది. "కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ఎవరైనా మా ఆలయంలోకి రావచ్చు. విగ్రహాలను ఏర్పాటు చేయడం మతపరమైన చర్య కాదు'' అని తెలిపింది. ఈ వాదనలతో ఐటీ ట్రిబ్యునల్ కూడా ఏకీభవించింది.
"శివుడు, హనుమంతుడు, దుర్గాదేవి తదితరులను పూజించడానికి, ఆలయ నిర్వహణకు చేసిన ఖర్చులను మతపరమైనవిగా భావించలేం'' అని తీర్పు చెప్పింది. సాంకేతికంగా చూస్తే... హిందుత్వ అనేది ఒక మతం, ఒక వర్గం కాదని తెలిపింది. "ఇక్కడ 'వర్గం' అంటే, ఒకే చట్టం, ఒకే తరహా నిబంధనలకు లోబడి ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు. వీరందరికీ ఒకే రకమైన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఇది క్రైస్తవానికి, ఇస్లామ్‌కు వర్తిస్తుంది. కానీ, హిందూయిజానికి వర్తించదు. ఎందుకంటే, సాంకేతికంగా హిందూయిజం మతమూ కాదు. వర్గమూ కాదు'' అని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. సంస్థాన్ మతపరమైన కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని చెప్పడానికి ఆధారాలు ఏవీ లేవంటూ కమిషనర్ ఆదేశాలను తోసిపుచ్చింది.

28, మే 2012, సోమవారం
కరివేపాకులో ఎన్ని ఔషధగుణాలున్నాయో మీకు తెలుసా!?
భోజనం చేసే సమయంలో కూరల్లో కరివేపాకు కనిపిస్తే చాలు... తీసి పక్కనబెట్టేస్తుంటాం. మీరిలా చేస్తున్నారంటే.. తప్పకుండా ఈ కథనం చదవాల్సిందే. కూరల్లో కరివేపాకు పక్కనబెట్టడం ఇకపై చేయకండి. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.
భారతీయ వంటకాల్లో కరివేపాకు వాడటం పరిపాటి. అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో కరివేపాకు వాడకం పెరిగిపోతోంది. ఇందుకు కారణం కరివేపాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలే.
- కరివేపాకును తినడం ద్వారా కేశాలు మృదువు అవుతాయి.
- చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం పోవడాన్ని నివారిస్తుంది.
- మహిళలు గర్భం ధరించినపుడు కరివేపాకు పొడిని అన్నంలో గానీ, నిమ్మరసం లేదా జ్యూస్‌లో గానీ అర స్పూన్ వేసుకుని తాగితే వాంతులను నిరోధిస్తుంది. ఇంకేముంది..? ఇక కూరల్లో కరివేపాకు కనిపిస్తే అలాగే నమిలి మింగేస్తారు.. కదూ.
నాకు తెల్సి చాలామంది కరివేపాకు ను నూనెలో బాగా వేపుతారు, మాడ్చేయ్యమాకండి అలానే కరివేపాకును పక్కన పెట్టమాకండి.
30, ఏప్రిల్ 2012, సోమవారం
ఒక్క కాగితం కండువా వాడటం ఎలా (Joe Smith, TED Talk)
ఈ వీడియో చూడటం కాదు, దయచేసి పాటించండి......
Joe Smith - How To Use One Paper Towel
Joe Smith - How To Use One Paper Towel
24, ఏప్రిల్ 2012, మంగళవారం
సాహస వీరుడు (Dean S Potter)
ఈ మధ్య మన సినిమాలలో చేస్తున్న గారడీలలో కొంతవోరకు ఐనా నిజం లేదు కాని.... Dean S Potter విన్యాసాలు చూడండి.......
వీరుని సాహసానికి మచ్చుతునక .... ఈ మధ్యే China లో .......
వీరుని గురించి
National Geographic Society......
Beyond the Edge: Fly or Die: Dean Potter
మరికొన్ని సాహసాల వీడియో .....
మరిన్ని వివరాలకోసం ....
http://deanspotter.com/
20, ఏప్రిల్ 2012, శుక్రవారం
మీ ప్రపంచాన్ని తిప్పేసే గొప్ప చెక్క బొమ్మల వీడియోలు
ఇవన్నీ ఎంతో వొపిక, సహనం మరియు కళానైపుణ్యం తోనే సాద్యం....
మాయల దేవత చెక్క బొమ్మ
డిసెంబర్లో
మాయల దేవత చెక్క బొమ్మ
మాయల దేవత చెక్క బొమ్మ (వర్షంలో పాడుతూ)
డిసెంబర్లో
12, ఏప్రిల్ 2012, గురువారం
ఆధార్ కార్డ్.. కోతిమీర్ కట్ట సన్ ఆఫ్ పలావ్ ఊరు గోంగూర కట్ట
Reference: Webdunia News Link
తాజాగా ఓ ఆధార్ కార్డు చిరునామా చూసిన జనం పగలబడి నవ్వుతున్నారు. కారణం ఏంటయా.. అంటే ఆ కార్డుపై అడ్రెస్.. కొతిమీర్ కట్ట సన్ ఆఫ్ పలావ్.. ఊరు గోంగూర తోట, అంటూ అనంతపురం జిల్లా పేరుతో ఓ సెల్ ఫోన్ ఫోటోను కూడా జోడించడం అధికారుల పనితీరును అద్దం పడుతోంది.
ఆధార్ కార్డ్ తయారీ వ్యవహారం కొతిమీర్ కట్ట.. గోంగూర తోటలానే ఉందని ఎద్దేవా చేస్తున్నారు ఈ వ్యవహారాన్ని చూసిన జనం.
30, మార్చి 2012, శుక్రవారం
ఖరముపాలు Vs గోవుపాలు
ఈ టపాలో నీను ఎవ్వరిని కించే పరిచే వుద్దేశ్యం తో రాయడమ లేదు, ముక్యంగా "వేమన పండితుడిని , గంగి గోవును, ఖరంను", మీ అభిప్రాయం ప్రకారం తప్పక మార్పులు చేస్తానని హామీ ఇస్తూ....
మన వేమన పండితుడు చెప్పినట్లు ఖరము పాలు ఒక కుండ కంటె చిక్కని ఆవుపాలు గరిటెడు మేలు. నాకు తెల్సి ఇది అప్పట్లో వేమన గారు సైన్స్ రిజల్ట్స్ , ఈ జెర్సీ ఆవుల పాలు "genetically modified" లను దృష్టిలో పెట్టుకొని చెయ్యలేదు. ఒకవేళ వేమన గారు ఈ రోజు వుండివుంటే పద్యం తప్పక మార్చి చెప్పేవాడు కావొచ్చు. ఇది నా వూహ మాత్రమె
పద్యం
గంగి గోవుపాలు గరిటడైనను చాలు
కడవెడైనను నేమి ఖరముపాలు
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ
|
|
సారాంశము
ఖరము పాలు ఒక కుండ కంటె చిక్కని
ఆవుపాలు గరిటెడు మేలైనట్లుగా భక్తితో
చేసిన కూడు పట్టెడు చాలును కదా!
|
|
మార్చిన పద్యం
ఖరముపాలు గరిటడైనను చాలు
కడవెడైనను నేమి
గోవుపాలు
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ
|
|
సారాంశము
ఆవుపాలు ఒక కుండ కంటె చిక్కని
ఖరము పాలు గరిటెడు మేలైనట్లుగా భక్తితో
చేసిన కూడు పట్టెడు చాలును కదా!
|
|
ఖరం పాల వుపయోగాలు కోసం ఇక్కడ నొక్కండి --
genetically modified ఆవుపాల వల్ల ఎదురయ్యే ఇబ్బందుల కోసం ఇక్కడ నొక్కండి --
28, మార్చి 2012, బుధవారం
27, మార్చి 2012, మంగళవారం
మనకూ కావలి ఒక మోడి లాంటి నాయకుడు
పూర్తి వీడియో చూడండి......
24, మార్చి 2012, శనివారం
జనకుడు జ్ఞాని ఎలా అయ్యాడు?
జనకుని రాజర్షిగా, జ్ఞానిగా అందరూ ఎందుకంటున్నారో, అందులోని విశేషమేమిటో తేల్చుకుందామనుకున్నాడు ఒక సాధువు. నేరుగా జనకుని ఆస్థానానికి వెళ్ళాడు. జనకు డప్పుడు మంత్రులతో మంతనాలు జరుపుతున్నాడు. ప్రజల బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటున్నాడు. కప్పం చెల్లించని సామంతరాజులపై కోపం ప్రకటిస్తున్నాడు.
ఎతైన సింహాసనం మీద కూర్చున్న జనకునికి పరిచారకులు అటూ ఇటూ నిలబడి వింజామరలు వీస్తున్నారు. ఒకరు పాదాలు ఒత్తుతున్నారు. ఆయన కిరీటంలో పొదిగిన మణిరత్నాలు జిగేలుమంటున్నాయి. ఎటుచూసినా ఆడంబరమూ, అతిశయమే. సాధువు ఇదంతా గమనిస్తున్నాడు. అతనకీ వరస ఏమీ నచ్చలేదు. ఇతడన్నీ లౌకికవిషయాలే మాట్లాడుతున్నాడు. లౌకికమైన సిరిసంపదలతో తులదూగుతున్నాడు. ఇతడు రాజర్షీ, జ్ఞానీ ఎలా అవుతాడు? ఇతణ్ణి జ్ఞాని అన్నవాళ్ళు పరమ అజ్ఞానులు - అనుకున్నాడు.
సాధువు ఆస్థానంలోకి అడుగు పెడుతున్నప్పుడే అతని మీద జనకుని దృష్టి పడింది. మంత్రులతో మాట్లాడుతూనే అతనిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అతని మనోభావాలను అంతర్దృష్టితో గమనిస్తూనే ఉన్నాడు. సాధువును తన వద్దకు పిలిపించుకున్నాడు. సాధువు వేషంలో ఉన్నావు కానీ, నువ్వు నిజమైన సాధువువి కావు అన్నాడు. సాధువు తెల్లబోయాడు. ఎప్పుడూ ఇతరులలో తప్పు లెంచే స్వభావం నీది. దానితోనే నీ సమయమంతా ఖర్చయిపోతోంది. భగవధ్యానానికి నీకు తీరికేదీ?
సాధువు మరింత నివ్వెరపోయాడు. నా దృష్టిలో నువ్వు నేరస్థుడివి. రాజుగా నిన్ను శిక్షించక తప్పదు. నీకు మరణశిక్ష విధిస్తున్నాను. వారం రోజుల్లో నిన్ను ఉరితీస్తారు. సాధువు గజగజ వణికిపోతూ నిలబడ్డాడు. జనకుడు అలా ప్రకటించిన వెంటనే భటులు సాధువును తమ అదుపులోకి తీసుకున్నారు. చెరసాలకు తరలించారు.
అతడికి రోజూ ఉప్పులేని కూరలు, కారం కలిపిన తీపిపదార్థాలు ఆహారంగా పెట్టమని జనకుడు సేవకులను ఆదేశించాడు. అయితే ఆ సాధువు వాటి రుచిని పట్టించుకునే స్థితిలో ఉన్నాడా? కళ్ళు మూసినా తెరచినా అతనికి ఉరికంబమే కనిపిస్తోంది. తన మెడ చుట్టూ ఉరితాడు బిగుసుకుంటున్న దృశ్యమే కళ్ళముందు కదులుతోంది. కంటిమీద కునుకే కరువైపోయింది. ఆ వారంరోజుల్లోనే అతడు మరణభయంతో, మనోవ్యధతో చిక్కి శల్యమైపోయాడు. ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చేశాయి.
ఏడవరోజున సాధువును ఉరి తీయడానికి సన్నాహాలు చేయమని జనకుడు ఆదేశించాడు. తను కూడా ఉరి తీసే ప్రదేశానికి వెళ్ళాడు. భటులు చెరోవైపూ చేతులు పట్టుకుని, అతికష్టంమీద అడుగులు వేస్తున్న సాధువును తీసుకొచ్చి జనకుని ముందు నిలబెట్టారు. మృత్యుభయంతో సాధువు స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత స్పృహ వచ్చింది. అప్పుడు జనకుని ఆదేశంపై సేవకులు అతనకి ఉప్పు కలిపిన పాలు ఇచ్చారు. సాధువు ఆ పాలను గడగడ తాగేశాడు.
పాలు బాగున్నాయా? పంచదార సరి పోయిందా? అని ప్రశ్నించాడు జనకుడు చిరునవ్వుతో. ఎందుకడుగుతావు మహారాజా! ఈ వారంరోజులుగా పదార్థాల రుచిని గమనించే స్థితిలో ఉన్నానా నేను? నాకు ప్రతిక్షణమూ, ప్రతిచోటా ఉరికంబమే కనిపిస్తోంది, అన్నాడు సాధువు. జ్ఞానబోధకు ఇదే తగిన సమయమనుకున్నాడు జనకుడు.
ఈ వారం రోజులూ నువ్వు ఏం చేస్తున్నా, ఏం తింటున్నా, నీ దృష్టి చేస్తున్నవాటిమీద, తింటున్నవాటిమీద లేదు. కేవలం ఉరికంబమే నీకు కనిపించింది. అలాగే నేను రోజూ ఉదయం నుంచి రాత్రివరకూ అనేకమైన లౌకికివిధులు నిర్వర్తిస్తున్నా నా దృష్టి మాత్రం ఎల్లవేళలా పరబ్రహ్మతత్త్వం పైనే లగ్నమై ఉంటుంది. విశేషధ్యానంతోనే నాస్థితిని సాధించాను. నేనీ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉండగలను. నా మనస్థితి ఎటువంటిదో ఇప్పుడైనా అర్థమైందా?
ఇక ముందెప్పుడూ ఇతరుల లోపాలను ఎంచే ప్రయత్నం చేయకు. నీ బాగు నువ్వు చూసుకో. ఇతరులలో మంచినే చూడడం నేర్చుకో. తపస్సుతో , ధ్యానంతో పరమసత్యాన్ని తెలుసుకో. ప్రపంచానికి అతీతంగా ఉంటూనే ప్రపంచ క్షేమం కోసం పనిచెయ్యి. ఇక వెళ్ళు!. సాధువుకు జనకుని ఔన్నత్యం, తన అల్పత్వం అర్థమయ్యాయి. అతనికి శిరసు వంచి నమస్కరించి అక్కడినుంచి నిష్క్రమించాడు.
23, మార్చి 2012, శుక్రవారం
ఆయువుపట్టు వేపచెట్టు
|
22, మార్చి 2012, గురువారం
20, మార్చి 2012, మంగళవారం
సంపన్నుడెవరు?
ఏ వ్యాపారం చేసినా, ఎంత సంపాదించినా ఎవరైనా కోరుకునేది ఏమిటి? అనుభవించేది ఏమిటి? అని ఎవరికి వారు తమను తాము ఆత్మవిమర్శ చేసుకుంటే ఏమీ లేదనే సమాధానమే గంటాపథంగా వినపిస్తుంది. అలా లేదనే సమాధానం ఇచ్చిన వ్యక్తి ఎంత సంపన్నుడైనా అతడు వాస్తవిక సంపన్నుడు అయినట్లేనా అనే ప్రశ్న కచ్ఛితంగా ఉద్భవిస్తుంది. సుసంపన్నమా లేదా దుర్భర దారిద్య్రమా అనేది ఎలా వర్గీకరించాల్సి ఉన్నదంటే... ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ సుఖ సంతోషాలను అనుభవించే దక్షత లేక ఏ సమయంలో ఐటీ దాడులు జరుగుతాయో, ఎక్కడి నుండి దొంగలు ఊడిపడతారో, ఇంతకాలం అహర్నిశలూ కష్టపడి సంపాదించినదంతా ఏమవుతుందో, ఇప్పటి వరకు నేను సంపాదించిన క్రెడిట్ అంతా పోటీదార్లు గద్దలా తన్నుకుపోతారేమో అనే సందేహాలతో అనునిత్యం మానసిక ప్రశాంతత లేని జీవితాన్ని అనుభవించేవాడు నిస్సందేహంగా దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నట్లే అని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం.
ఈ సమాజపు రేసులో వేగంగా పరుగులు తీస్తున్న అధిక సంపన్నుడు అప్పటి వరకు అహర్నిశలూ శ్రమించి కూడబెట్టిన ఆస్తులు కొన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ అవి చాలవనే అత్యాశతో మరో కొన్ని వేల కోట్ల సంపాదన కోసం తల్లడిల్లుతాడు. అందుకోసం అనేక అవినీతి చర్యలకు పాల్పడతాడు. అప్పులు చేస్తాడు. చేసిన అప్పుల్ని అప్పులుగా భావించకుండా ఆస్తులుగా భావిస్తూ తానే అధిక సంపన్నుడినని అనుకుంటూ వేలాది కోట్ల రూపాయల్ని తన ఆడిట్ నివేదికల్లో ప్రకటిస్తూ ఉంటాడు. వాస్తవానికి ఇలాంటి వ్యక్తులు అధిక సంపన్నులని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అది ఎలా అంటే అప్పటి వరకు తనకు ఎన్నో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ అవన్నీ తన చేజారిన క్రమంలోనే వ్యాపారాభివృద్ధికైనా అప్పులు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ తాను అధిక సంపన్నుడనే భ్రమలో జీవితాన్ని గడుపుతుంటాడు. అదే ఆడంబరాన్ని, భోగ లాలసత్వాన్ని ప్రదర్శిస్తుంటాడు. అలా గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలను కూడబెట్టినప్పటికీ ఏనాటికైనా ప్రశాంతత పొందగలుగుతాడా అంటే అదీ లేదు. చివరికి పరిస్థితి ప్రతికూలించి తనకు ఉన్న అప్పులను తీర్చే క్రమంలో ఉన్న ఆస్తులు జప్తు అయినప్పుడు తన యొక్క నిజ స్థితిని గ్రహించి వాపోతాడు.
ఎవరు ఏ విధమైన వృత్తిని స్వీకరించినా సంపాదించిన దానితో తాను, తన కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలనే కోరుకుం టారు. అలా కోరుకునే సామాన్యమైన వారు కానీ అధిక సంపన్నులుగా ఎవరికి వారు భావించే వారు ఎవరైనప్పటికీ కోరుకునేది తన భార్యా బిడ్డలతో ప్రశాంతమైన జీవితం, నిద్రావస్త కలిగినపుడు ప్రశాంతమైన నిద్ర, సహజసిద్ధమైన ఆకలికి తినేది గుప్పెడు మెతుకులు అంతకు మించి ఏముం టుం ది. అలాంటి ప్రశాంత మైన జీవితాన్ని అనుభవించాలంటే ఏ మని షికైనా ఆత్మ సంతృప్తి అవసరం. సమాజంలో ప్రస్తుతం నెలకొన్న స్థితిగతుల దృష్ట్యా అది సాధ్యమేనా అని సందేహానికి అనేక మంది లోనవుతుంటారు. కానీ అది తప్పక సాధ్యమే. వ్యాపారాభివృద్ధి కొరకు అహర్నిశలూ కృషి చేయడం సమంజసమే కానీ వ్యాపారాభివృద్ధి కోసమే అప్పులు చేయడం, అప్పులతో వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడం, అలా అభివృద్ధి చెందిన వ్యాపారం స్థిరత్వం పొందేందుకు మరింత మనో వ్యాకులత చెందడం అనేవి సుసంపన్నుడైన వ్యాపారికి సైతం దారిద్య్రాన్నే తెచ్చిపెడతాయి.
19, మార్చి 2012, సోమవారం
ఇంద్రియ నిగ్రహం అవసరం
హితవచనం
|
|
|
17, మార్చి 2012, శనివారం
చిన్నయ్యగుట్ట మీద చిత్రమైన చరిత్ర
-ద్యావనపల్లి సత్యనారాయణ
గోదావరి
నదికి ఇరువైపులా గల ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని గిరిజనులు, వారి
ఆధ్వర్యంలో రైతులు పూజించే దేవుళ్లు చిన్నయ్య, పెద్దయ్య. చిన్నయ్య
పెద్దయ్య/ చిలుకల్ల భీమయ్య అని స్థానికంగా వినిపించే జానపద గేయంలో చిన్నయ్య
అంటే అర్జునుడు, పెద్దయ్య అంటే ధర్మరాజు, వారితో కూడిన భీముడ్ని
పూజిస్తారు అని స్పష్టమవుతోంది. భీముడ్ని ప్రత్యేకంగా కొలవడానికి
కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి గిరిజన
అమ్మాయి హిడింబిని భీముడు వివాహమాడటంతో స్థానిక గిరిజనులకు ఆరాధ్య
దైవమయ్యాడు. భీముడి కంటే ధర్మరాజు పెద్దవాడు కాబట్టి, అర్జునుడు గొప్పవాడు
కాబట్టి వారిని కూడా పూజిస్తారు. ఐతే ఎవర్ని పూజించే చోటనైనా భీముడ్ని
పూజించడం తప్పనిసరి. అలా చిన్నయ్య గుడి (ఇల్లారి)లో కూడా మనకు భీముడి
చిహ్నాలు, చరిత్రలే ఎక్కువగా కన్పిస్తాయి.
చిన్నయ్య ఇల్లారి ఆదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలంలో ఉంది. ఈ ఇల్లారి ప్రదేశం పవిత్రతకే కాకుండా ప్రకృతి సౌందర్యానికి కూడా పెట్టింది పేరు. హైదరాబాద్ నుంచి సుమారు 230 కి.మీ.లు ప్రయాణించి (కరీంనగర్, చొప్పదండి మీదుగా) లక్షెట్టిపేట చౌరస్తా చేరుకొని, అక్కడి నుంచి 5 కి.మీ.ల దూరంలో వచ్చే వెంకట్రావుపేట మీదుగా 10 కి.మీ లు ప్రయాణించి చెల్లంపేట గూడేనికి చేరుకుంటే దానికి ఒక కి.మీ. దూరంలోనే ఉంటుంది ఈ చిన్నయ్య దేవర స్థలం.
చిత్రమైన విగ్రహాలు..
చిన్నయ్య ఇల్లారికి సుమారు రెండు కి.మీ.ల ముందే ఒక సెలయేరు పారుతూంటుంది. అన్ని కాలాల్లోనూ భక్తులు, పర్యాటకులు దీని దగ్గరే ఆగి వంటా వార్పూ చేసుకోవాలి. ఈ సెలయేరు ఎతె్తైన పచ్చని చెట్ల మధ్య నుంచి పారుతూండటం ఒక సుందర దృశ్యం. ఆంధ్రాలోని మారేడుమిల్లి పర్యాటక కేంద్రాన్ని చూసిన వారికి దానితో దీనికి పోలిక కన్పిస్తుంది.
చిన్నయ్య ఇల్లారి తూర్పు అభిముఖంగా ఉన్న ఒక చిన్న గుడిసె లేదా పాక. అందులో మధ్యలో చిన్నయ్య దేవుడిగా చెప్పే నల్లని విగ్రహముంది. దానే్న అల్లుబండ అని కూడా అంటారు. నిజానికి అది గజానమని (వినాయకుని) పోలికలతో ఉంది. దాని చుట్టూ రెండు అడుగుల ఎతె్తైన ఏనుగులు, ఎద్దులు, గుర్రాల బొమ్మలు తమ వీపులపై పల్లకీలను మోస్తున్నట్లుగా గంటలతో అలంకరించబడి ఉంటాయి. ఇవి మట్టితో చేసి కాల్చబడిన టెర్రాకోట్ బొమ్మలు. వీటి వెనుక ముందు కూడా ఇలాంటివి చిన్నచిన్న బొమ్మలు వందల్లో ఉంటాయి. వాటిని భక్తులు తమ కోర్కెలు తీరినందుకు, తమకు సంతానం కలిగినందుకు మొక్కు చెల్లింపుగా చేయించినవి. ఇలా ఇక్కడ చెల్లింపులు జరుగుతాయి. కాబట్టే ఈ ఊరి పేరు చెల్లంపేట అయ్యిందేమో!
చిన్నయ్య ఇల్లారికి ఎడమ పక్కన పెద్దయ్య ఇల్లారి ఉంది. ఇది మొదటి దానికంటే చిన్నగా ఉంటుంది. ఇందులో రెండు అల్లుబండలుంటాయి. మనసులో ఒక పని గురించి తలచుకొని ఒక అల్లుబండను రెండు చేతులతో లేపే ప్రయత్నం చేస్తే ఆ పని విజయవంతంగా జరిగేటట్లయితే ఆ బండ లేవదని, ఆ పని ఫెయిలయ్యేటట్లయితే ఆ బండ అవలీలగా పైకి లేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ అల్లుబండలు/ విగ్రహాల ముందే రైతులు/ భక్తులు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇస్తారు. వాటి రక్తంతో తడిసిన బండారిని (పసుపు) గోండు/ నాయకపు పూజారి మంత్రించి ఇస్తాడు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల రైతులు ఆ బండారిని అత్యంత పవిత్రంగా భావించి, తమ పంట పొలాలపై చల్లుకొని, అది కీటకనాశినిగా పనిచేసి తమ పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. నిజంగానే పసుపు కీటకనాశిని కావడం గమనార్హం.
భీముడి చారిత్రక ఆనవాళ్లు..
స్థానికంగా గిరిజనులు, రైతుల నోట భీముడికి సంబంధించిన చరిత్ర ఆనవాళ్ల గురించి చాలా వింటాం. మరి వాటికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అని ప్రతి విగ్రహాన్ని, రాళ్లను, గుహలను, గుట్టలను సూక్ష్మంగా పరిశీలిస్తూ వెళల్తే ఆశ్చర్యకంగా కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. చిన్నయ్య పెద్దయ్య ఇల్లారుల్లోగల అల్లుబండల/ విగ్రహాలకు ఇరుపక్కలా భీమన్న గదలుగా చెప్పబడే రెండు అడుగుల ఎత్తుగల ఇత్తడి గదలున్నాయి. వాటిల్లో ఒక దానికి భీముడు ఘటోత్కచుని ఎత్తుకున్నట్లున్న చిత్రం కింద హిడింబి చిత్రం చెక్కి ఉంది. ఈ ఇల్లారిల వెనుక రెండు గుహలున్నాయి. అందులో నైరుతి వైపున ఉన్న గుహలోకి కొన్ని గజాల దూరం పాక్కుంటూ వెళితే తరువాత నిలువెత్తు పొడవైన మార్గం కనిపిస్తుంది. అది ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దయ్య ఇల్లారి వరకు సాగుతుందని, పెద్దయ్య చిన్నయ్య మీద ఈర్ష్యతో ఈ మార్గానికి అడ్డంగా రాయి పడేశాడని, లేదు బహిష్టులో ఉన్న ఒక అమ్మాయి ఆ మార్గంలో నడవడంతో ఆ రాయి అడ్డం పడిందని భిన్న కథనాలు విన్పిస్తాయి. నిజమెలా ఉన్నా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గుహ ప్రారంభంలోనే దాని పైకప్పును చూస్తే మనకు భీముడు, హిడించి పెళ్లి చేసుకొని సుఖించిన ముత్యాల పందిరికి సంబంధించినవిగా చెప్పబడే గుంజలు, గొడుగు (శిఖర కిరీటం) గుర్తులు కన్పిస్తాయి. మరికాస్త పరిశీలిస్తే చరిత్ర పూర్వయుగ మానవులకు సంబంధించిన చిత్రాలకు మల్లే కన్పిస్తాయి. కాని ఈ గుహలో ఉన్న గబ్బిలాలు, చీకటి సూక్ష్మంగా పరిశీలించే అవకాశాన్నివ్వవు. ఇల్లారికి వాయవ్యంలో ఉన్న గుహలో కూడా చాలా ప్రాచీనమైన విగ్రహాలున్నాయి. కాని అందులో కూడా ఇదే పరిస్థితి.
నైరుతి గుహలోని గుర్తులు గనుక చరిత్ర పూర్వ యుగానికి చెందినవైతే తెలంగాణ చరిత్రకారులకు పండుగే. అవి భీముడికి సంబంధించినవైతే కూడా కావొచ్చు. ఎందుకంటే భీముడు కూడా చరిత్ర పూర్వ యుగానికి చెందినవాడే. ఇటీవల పుష్కర్ భట్నాగర్ అనే ఒక ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారి అమెరికా నుండి టైమ్ మెషీన్‌ను దిగుమతి చేసుకొని, అందులో భారతంలో వివరించబడిన ఖగోళ స్థితి వర్ణనలను పొందుపరచి పాండవులు వనవాసం చేస్తూ దక్షిణాదికి (ఆంధ్రప్రదేశ్) వచ్చింది సుమారు క్రీ.పూ. 3150 ప్రాంతంలో అని శాస్ర్తియంగా నిర్ధారించారు. దీన్నిబట్టి ఈ గుహలోని చిత్రాలు 5160 సంవత్సరాల కిందటివని తేలుతుంది.
పాండవులు వనవాసం వచ్చినప్పుడు భీముడు ఇక్కడి స్థానిక గిరిజన యువతి హిడింబిని పెళ్లి చేసుకొని, ఘటోత్కచుడు అనే కుమారుణ్ని కని, ఆమెతో ఉన్నన్నాళ్లు ఇక్కడ ఏదులతో (అడవి దున్నలతో) వ్యవసాయం కూడా చేశాడనేది ఇతిహాసం. అందుకు నిదర్శనంగా మనకు ఈ చిన్నయ్య ఇల్లారి ఉన్న దండెపల్లి మండలంలోనే ‘ఏదులపాడు’ అనే గ్రామముందని తెలిపే ఆధునిక శిలాశాసనమొకటి చిన్నయ్య దేవరకు నైరుతి మూలన కన్పిస్తుంది. ఈ ఇల్లారికి వాయవ్యంలో ఒక కిలోమీటరు దూరంలో ఒక పెద్ద పరుపుపై భీముడు ఏదులతో దున్నిన నాగలి కోండ్ర చాళ్లున్నాయి. వాటి కిందుగా భీముడి పాదముద్రలుగా చెప్పబడుతున్న మూడు గజాల పొడవు, గజంన్నర వెడల్పులతో ఉన్న రెండు నీటి గుంటలు కనపడతాయి. వాటిల్లో ఒక గుంట ఒడ్డున భీముడు మలశుద్ధికై కూర్చున్నప్పుడు పడిన అతని కటి కింది భాగపు గుర్తులు, పాదముద్రలు కన్పిస్తాయని చెప్తారు. ఈ గుంటలకు కొంచెం దూరం నైరుతిలో హిడింబి స్నానానికి ఉపయోగించినవిగా చెప్తున్న కుండల ఆకారంలోగల గుంటలు కన్పిస్తాయి. నిజానికి ఈ గుంటల్లో కొన్నింటికి మెట్లు తొలిచిన ఆనవాళ్లు కన్పిస్తాయి కాబట్టి ప్రాచీన కాలంలో ఎవరో వీటిని నీటి సదుపాయాలకు ఉపయోగించు కున్నారనవచ్చు.
భీముణ్ని కొలిచేవారు అందమైన ఏదు కొమ్ములను తలపాగాగా అలంకరించు కోవటం చూస్తూంటాం. భీముడు చంద్రవంశానికి చెందినవాడు. ఈ ప్రాంతంలో సంచరించడానికి ఈ చంద్రవంక జెండాలే దారి చూపుతాయి.
ఇక్కడ సున్నా ఆకారంలో గిరిగీసిన కొండల మధ్య కొలోజియం వంటి ఐదారు వందల ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలో రెండు మూడు సెలయేళ్లు పారుతున్నాయి. ఇలా ఈ స్థలం వ్యూహాత్మకంగా ప్రజలను రక్షించే విధంగానూ, వ్యవసాయాభివృద్ధికి దోహదపడే విధంగానూ ఉంది. కాబట్టి ప్రాచీన కాలంలో ఇక్కడ స్థానిక రాజ్యమైనా వర్థిల్లిందంటే నమ్మవచ్చు.
చప్పట్లకు నీళ్లు
రాలుతాయా?
ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కాని ఇక్కడ మాత్రం మాటలు, చప్పట్ల ప్రతిధ్వనికి నీళ్లు రాల్చే కొండలున్నాయి. అందుకే అవి ‘మంచి కొండలు’, వాటి నుంచి వచ్చే నీళ్లు చల్లగా ఉంటాయి కాబట్టి వాటిని ‘మంచుకొండలు’ అని కూడా పిలుస్తారు. ఈ కొండల నుంచి జాలువారే ఒక సెలయేరు
పరిసరాల నుండే సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి ఈ కొండలను చేరుకోవాలి. నీళ్లున్న పరిసరాలలో పచ్చని చెట్లు ఏపుగా పెరుగుతాయి. వాటిని ఆశ్రయించి పక్షులు, జంతువులు జీవిస్తాయి. కాబట్టి మనం వినసొంపైన వాటి అరుపుల మధ్య చిక్కని చెట్ల గుండా సెలయేరును ఆనుకొని నడిచే ట్రెక్కింగ్ ఒక మరిచిపోలేని అనుభూతి.
అలా ఓ అరగంట నడిచిన తరువాత - ఒక కుండ ఆకారంలో కొండల మధ్య ఏర్పడిన లోయ. దాని పొడవు, వెడల్పు, ఎత్తు.. చుట్టు కొలతలు అన్నీ సుమారుగా వందేసి మీటర్లే. ఆ ఇరుకైన లోయలోకి వెళితే మన మాటల స్వరం మారిపోతుంది. కారణం అవి ప్రతిధ్వనిస్తాయి. ఇక మనం గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడితే వాటి ద్వారా వచ్చే ప్రతిధ్వనులు ఆ లోయలోనే చక్కర్లు కొట్టి చుట్టూ ఉన్న కొండల్లో ప్రకంపనలు పుట్టించి వాటిల్లో నిక్షిప్తమైన నీళ్లను బయటికి లాగుతాయి. అలా చప్పట్లకు నీళ్లు రాలుతాయి. ఐతే వర్షాల సీజన్‌లో మాత్రం చప్పట్ల అవసరం లేకుండానే ఆ కొండల మీది నుంచి జలపాతం దుముకుతుంది.
ఈ మంచు కొండలు భీమ - హిడింబిల సయ్యాటలకే కాకుండా క్రీ.శ.1159లో పొలవాస (జగిత్యాల దగ్గర) రాజు రెండవ మేడరాజు, అతని కుమారుడు జగ్గరాజులకు కూడా ఆశ్రయమిచ్చాయి. కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుని చేతిలో ఓడిపోయిన ఈ మేడరాజు ‘రుద్రుడు’ తన రాజధానిని కాల్చినందుకు బాధపడక ఈ మంచి కొండల్లో ఉన్న వృక్షాలను ఆశ్రయించి ఆనందించాడని రుద్రుని మంత్రి గంగాధరుని హనుమకొండ శాసనంలో ఉంది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)