18, నవంబర్ 2011, శుక్రవారం

నిస్వార్థం-ప్రేమ-అమాయకత్వానికి చిహ్నం కోయిల-పావురం-పిచ్చుక!!

నిస్వార్థం-ప్రేమ-అమాయకత్వానికి చిహ్నం కోయిల-పావురం-పిచ్చుక!!
భూగోళంపై అనేక పక్షు జాతులు ఉన్నాయి. ఈ జాతుల్లో కొన్ని పక్షులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే వాటిని కొన్ని దేశాలు తమ దేశ జాతీయ పక్షులుగా ప్రకటించుకున్నారు. అలాంటి మేలైన పక్షుల్లో కోయిల, పావురం, పిచ్చుకలను చెప్పుకోవచ్చు.

ఈ మూడు పక్షుల్లో కోయిల నిస్వార్థానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పావురాన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తాం. అమాయకత్వానికి పిచ్చుకను నిదర్శనంగా చెప్పుకుంటారు. ఆకారంలో కాకి, కోయిలా ఒకేలా ఉన్నప్పటికీ.. కోయిలకుండే గొంతుతో అదెంతో పాపులర్‌ అయ్యింది. దానికుండే ప్రత్యేకతనే వేరు. కోయిల స్వభావం ఎప్పుడూ నిస్వార్థంగా ఉంటుంది.

ఇక పావురాలు అనగానే ప్రేమకు చిహ్నంగా భావిస్తాం. పావురం నిష్కళంకమైనది. అది తన మనసు ఒక్కదానికే పరిమితం చేస్తుంది. అందుకే బైబిల్ కూడా "మీరు పావురం వలె నిష్కళంకంగా ఉండాలని" చెపుతోంది.

ఇకపోతే.. నానాటికీ అంతరిస్తున్న పిచ్చుకల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్పిస్తుంది. ప్రతి ఇంటి నేస్తాలుగా ఇవి ఇండ్లలోనే తమ గూడును నిర్మించుకుంటాయి. ఎక్కడ అద్దం కన్పించినా దానిముందు వాలిపోయి, తన ప్రతిబింబాన్నే శత్రువుల్లా భావిస్తూ, పొడుస్తూ ఉండే దాని అమాయకత్వాన్ని ప్రదర్శిస్తుంది.

అందుకే కోయిల, పిచ్చుక, పావురం ఈమూడు జాతుల పక్షులు పవిత్రతకు, ప్రేమకు, నిస్వార్ధానికి, అమాయకత్వానికి గుర్తుగా చెప్పుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి