26, మార్చి 2012, సోమవారం

అమెరికా జవాను Vs ఇండియా రాజకీయనాయకుడు


నిన్న నా కలలో అమెరికా జవాను ఇండియా రాజకీయనాయకుడు  (రాకీనా) నా దగ్గరికి వచ్చి మాలో ఎవరు గొప్ప నువ్వే తీర్పు చెప్పాలి అని సతాఇంచి నా ప్రాణం తిన్నరనుకో...
తీర్పు చెప్పే ముందు మీ గొప్పలు చెప్పండి అంటే ఇదోగో ఇలా మొదలెట్టారు.....

జవాను: నీను 100+ LBs (సరాసరి 50kg) మోస్తాను రోజు.
 
రాకీనా: ఓహో  జవాను నువ్వు రోజులో డ్యూటీ చేసేటప్పుడే మోస్తావు, అది నీ డ్యూటీ. నీను, ఇదిగో చూడు 50kg నా దేహం లో బాగం, ఇది లేకపోతే నీను "రాకీనా" కాదు.
 
జవాను: నీను నా దేశం లో చెత్త అంతా విదేశాలలో కాలుస్తా. దీనివల్ల మాదేశానికి పేరు.
 
రాకీనా: నీను నా దేశం లో చెత్త పనులు చేసి విదేశాలలో దాస్తా. దీనివల్ల మాకు పేరు, మా దేశానికి చెడ్డపేరు.
 

జవాను:  మీము విదేశీయులను ఆటాడిస్తాం.
 
రాకీనా:  మీము స్వదేశీయులను ఆటాడిస్తాం.
 
జవాను:మీము దేశానికి సేవ చేస్తాం.

రాకీనా:  మాకు దేశం సేవ చేస్తుంది.

 

ఈ గలాటా లో నాకు మెలుకువ వొచ్చి చూస్తే ఎవడో నా వీపు మీద చెళ్ళున కొట్టినట్టు అనిపించింది, తీరా  చూస్తే నీను ఆఫీసు కి అరగంట ఆలస్యంగా చేరతా అని తెలిసాక వీళ్ళకు తీర్పు చెప్పడం కాదు కాని ఇవ్వాళా నా బాస్ తీర్పు చెప్పే లావున్నాడు, వెళ్ళాలి మళ్ళీ వొచ్చాక చూస్తా ఈ విషయం...
ఈలోపు మీరు చెప్పండి ఎవరు గొప్పో......


2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. జలతారువెన్నెల గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అస్సలు ఏదో రాయాలని చివరికి అలా ముగించాను, ముందు ముందు సరిగా ముగిస్తాను అని ఆశిస్తూ ....

      తొలగించండి