6, ఏప్రిల్ 2012, శుక్రవారం

కొట్టాల్సింది చప్పట్లా !! చెప్పు దెబ్బలా....!!



ఈ టపా చదివి, వీడియో చూసి మీరే తీర్పు చెప్పండి.
చిన్నప్పుడు మా ఇంట్లో చెప్పే వాళ్ళు "వచ్చీరాని  భాష వొళ్ళంతా మెద గ కొట్టిస్తుంది అని". నాకు ఆరోజుల్లో ఇంట్లో వాళ్ళు  చెప్పే సామెతలకు అర్ధాలు ఎక్కువ తెలిసేవి కావు.
కాని ఈ మధ్య ఒక వింత మనిషి ఉర్దూలో మాట్లాడటానికి కోతి కొమ్మచ్చి వేషాలు వేశాడు, ఆయనగోరు మామూలు తెలుగులో తగలేస్తే, ఆయన ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాదు.
పోనీ వెధవ చచ్చినోడు తెలుగు వాడు కాదా!! అంటే అదేమి లేదు, అయ్యోరికి నాకు తెల్సి తెలుగు తప్ప వేరే భాష సరిగా వొచ్చు అన్న గ్యారంటీ లేదు.

ఈ వీడియో చూసాక, నీను ఏడవాలో, లేక మనకు పట్టిన కర్మ అని వోదిలేయ్యాలో తెలియక  సతమతం అవుతున్నా !!
ఇంకో గమ్మత్తు ఏమిటి అంటే , ఆ పెద్ద మనిషి పక్కన ఇంకో నీచ మనిషి నిలబడి చప్పట్లు కొట్టిస్తూ, ఈలలు వేయుస్తున్నాడు జనాలతో.....
చెప్పేవాళ్ళకు పిచ్చి పట్టింది సరే, వినే జనాలను ఎ  పిచ్చికుక్క కరిసిందో ఏమో , పెద్ద మనిషి పిచ్చి కేకలకు పిచ్చి కుక్క కరిసిన జనాలు ఒకటే చప్పట్లు, ఈలలు.

నా తొక్కలో గోల ఏంటో ఈ వీడియో చూసి మీరే అర్ధం చేసుకోండి.



నాకు తెల్సి ఆయన గారు CM కాకుండా సామన్యుడు ఐతే కచ్చితంగా చెప్పు దెబ్బలే పడేవి, అంతకన్నా ముందు ఆ పక్కన నిల్చుని జనాలని చప్పట్లు కొట్టండి అని ప్రోత్సహించే పిచ్చి నా***కు రెండు ఎక్కవ పడేవి.

హమ్మయ్య, చాలా సింపుల్ గా తిట్టేసా .....

30, మార్చి 2012, శుక్రవారం

ఖరముపాలు Vs గోవుపాలు


ఈ టపాలో నీను ఎవ్వరిని కించే పరిచే వుద్దేశ్యం తో రాయడమ లేదు, ముక్యంగా "వేమన పండితుడిని , గంగి గోవును, ఖరంను", మీ అభిప్రాయం ప్రకారం తప్పక మార్పులు చేస్తానని హామీ ఇస్తూ....

మన వేమన పండితుడు చెప్పినట్లు ఖరము పాలు ఒక కుండ కంటె చిక్కని ఆవుపాలు గరిటెడు మేలు. నాకు తెల్సి ఇది అప్పట్లో వేమన గారు సైన్స్ రిజల్ట్స్ , ఈ జెర్సీ ఆవుల పాలు "genetically modified" లను దృష్టిలో పెట్టుకొని చెయ్యలేదు. ఒకవేళ వేమన గారు ఈ రోజు వుండివుంటే పద్యం తప్పక మార్చి చెప్పేవాడు కావొచ్చు. ఇది నా వూహ మాత్రమె




పద్యం
    గంగి గోవుపాలు గరిటడైనను చాలు
    కడవెడైనను నేమి ఖరముపాలు
    భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
    విశ్వదాభిరామ వినురవేమ

సారాంశము
ఖరము పాలు ఒక కుండ కంటె చిక్కని 
ఆవుపాలు గరిటెడు మేలైనట్లుగా భక్తితో
 చేసిన కూడు పట్టెడు చాలును కదా!





మార్చిన పద్యం
    ఖరముపాలు గరిటడైనను చాలు
    కడవెడైనను నేమి  గోవుపాలు 
    భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
    విశ్వదాభిరామ వినురవేమ
   

సారాంశము
 ఆవుపాలు ఒక కుండ కంటె చిక్కని 
ఖరము పాలు గరిటెడు మేలైనట్లుగా భక్తితో
 చేసిన కూడు పట్టెడు చాలును కదా!


ఖరం పాల వుపయోగాలు కోసం ఇక్కడ నొక్కండి --
genetically modified ఆవుపాల వల్ల ఎదురయ్యే ఇబ్బందుల కోసం ఇక్కడ నొక్కండి --


ఎవరన్నా ఖరం పేరు మీద తిడితే నాకు అస్సలు నచ్చదు, ఇంకో సారి ఆ పదం వాడే ముందు ఆలోచించండి.