ఈ టపా చదివి, వీడియో చూసి మీరే తీర్పు చెప్పండి.
చిన్నప్పుడు మా ఇంట్లో చెప్పే వాళ్ళు "వచ్చీరాని భాష వొళ్ళంతా మెద గ కొట్టిస్తుంది అని". నాకు ఆరోజుల్లో ఇంట్లో వాళ్ళు చెప్పే సామెతలకు అర్ధాలు ఎక్కువ తెలిసేవి కావు.
కాని ఈ మధ్య ఒక వింత మనిషి ఉర్దూలో మాట్లాడటానికి కోతి కొమ్మచ్చి వేషాలు వేశాడు, ఆయనగోరు మామూలు తెలుగులో తగలేస్తే, ఆయన ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాదు.
పోనీ వెధవ చచ్చినోడు తెలుగు వాడు కాదా!! అంటే అదేమి లేదు, అయ్యోరికి నాకు తెల్సి తెలుగు తప్ప వేరే భాష సరిగా వొచ్చు అన్న గ్యారంటీ లేదు.
ఈ వీడియో చూసాక, నీను ఏడవాలో, లేక మనకు పట్టిన కర్మ అని వోదిలేయ్యాలో తెలియక సతమతం అవుతున్నా !!
ఇంకో గమ్మత్తు ఏమిటి అంటే , ఆ పెద్ద మనిషి పక్కన ఇంకో నీచ మనిషి నిలబడి చప్పట్లు కొట్టిస్తూ, ఈలలు వేయుస్తున్నాడు జనాలతో.....
చెప్పేవాళ్ళకు పిచ్చి పట్టింది సరే, వినే జనాలను ఎ పిచ్చికుక్క కరిసిందో ఏమో , పెద్ద మనిషి పిచ్చి కేకలకు పిచ్చి కుక్క కరిసిన జనాలు ఒకటే చప్పట్లు, ఈలలు.
నా తొక్కలో గోల ఏంటో ఈ వీడియో చూసి మీరే అర్ధం చేసుకోండి.
నాకు తెల్సి ఆయన గారు CM కాకుండా సామన్యుడు ఐతే కచ్చితంగా చెప్పు దెబ్బలే పడేవి, అంతకన్నా ముందు ఆ పక్కన నిల్చుని జనాలని చప్పట్లు కొట్టండి అని ప్రోత్సహించే పిచ్చి నా***కు రెండు ఎక్కవ పడేవి.
హమ్మయ్య, చాలా సింపుల్ గా తిట్టేసా .....
పాపమని అనిపించింది ఆయన అవస్త చూస్తే
రిప్లయితొలగించండినాకు అర్థమయ్యింది. 1రూ కు కిలో బియ్యం ఇస్తున్నామని రాజకీయంగా వూదరగొడుతున్నాడు. గ్రామర్ తప్పులుంటే వున్నాయేమో, అర్థం మాత్రం చేరవేయబడింది. ఆ మాటకు వస్తే సోనియా, ఇందిరాగాంధీ,... ఇంకా చాలామంది ఇలానే ఇతర భాషల్లో మాట్లాడేవారు.
రిప్లయితొలగించండితప్పుల్లేకుండా ఎవరూ ఓ కొత్త భాషను అనర్గళంగా మాట్లాడలేరు. మీ ఆందోళన అనుచితమైనదిగా అనిపిస్తోంది. ఆ టివి ఆంకర్ మిశ్రమ భాష మాట్లాడగాలేనిది, భాష అంతగా రాకున్నా, అందులో మూఢ జనుల్ని రంజింప ప్రయత్నించిన ముఖ్యమంత్రిని తప్పుపట్టడం ... సబబు కాదు.
చక్కటి హాస్యాన్ని అందించిన కిరణ్ కుమార్ గారికి నేనైతే చప్పట్లే కొడతానని, కొట్టాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. :)
రిప్లయితొలగించండి:)))))))))
రిప్లయితొలగించండిఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు.. మన కిరణ్ కుమార్ గారికి ఇంట గెలవడమే రాలేదు. బయట ఆ పాట్లు ఏమిటండీ ..మాకు మహా నవ్వులాటగా ఉంది. నవ్వుల పూల వర్షం తో..వారిని అభినందించక పొతే బాగుండదు. అలాగే చప్పట్లే చప్పట్లు..
రిప్లయితొలగించండిస్పీకరుగా ఉన్నన్నాళ్ళు ఆయన ఇంగ్లీషు మాత్రమె ఖూనీ చేస్తాడనుకున్నాము. ఇప్పుడు తెలిసింది ఆయనకు అన్ని భాషలూ సమానమని. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలను అడ్డగోలుగా విడగ్గొట్టి ఖైమా చేయడం కిరణ్ గారికే చెల్లింది.
రిప్లయితొలగించండిఅదృష్టం బాగుండి ఆయన తెలంగాణా వాడు కాదు. అయ్యుంటే ఇప్పటికి అంజయ్య లెవెలులో బఫూను ముద్ర వేసేవారు మన మీడియా ఘటికులు.
ముందుగా మీ అందరి అమూల్యమైన వాక్యాలకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిజలతారువెన్నెల గారు, "రాజకీయ" కూటి కోసం కోటి తిప్పలు అంటే ఇలానే వుంటాయండి.
SNKR గారు, మీము కోడా మీలా తప్పకుండా positive గా ఆలోచించడం మొదలెడతాం సర్.
పల్లా కొండల రావు గారు, మీకు చాలా బాగా నచ్చినట్టుందండి.
వనజవనమాలి గారు, నీను ఆ వీడియో ఇప్పటికి 20 సార్లు చూసాను, రాజకీయ "హాస్యబ్రహ్మ" కోసం ....హహహ....
Jai Gottimukkala గారు, మన మీడియాకు వున్న తెలివితేటలు ఎవ్వరికి లేవండి, తిమ్మి ని బొమ్మి చేయగల సమర్ధులు.
మీలో చాలామంది పెద్దాయన వుపన్యాసానికి చప్పట్లు కొట్టారు, నీను చెప్పు దేబ్బలబదులు చప్పట్లు కొట్టాలి అని మీతో పాటే నీను.....