(అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలున్న దయచేసి మన్నించండి)
ఇది నా బాల్య స్మృతి, ఎందుకో టపా రాయాలనిపించింది. చిన్నప్పుడు ఇంట్లో పెరుగు కుండ నిండుగా వుండేది. రోజుకు మూడు సార్లు పెరుగన్నం తిన్నా ఇంకా తినాలనిపించేది.
పొద్దున్నే లేవగానే నీను ప్రతీ రోజు "అన్నమో రామచంద్రా, పెరుగన్నమో రామచంద్రా" అనే పాట అందుకునే వాడిని, మా అమ్మ కోపంతో రోజు మమ్ముల్ని నీ ఆకలి కేకలతో వేధించడం దేనికి నువ్వు తింటే ఎవరన్నా వోద్ధన్నారా !... వెళ్ళి కావాల్సినంత తిను అంటూ, చూస్తా వుండరా నీకు అన్నీ వున్నా పెరుగన్నం మాత్రం దొరకదేమో చూడు అని పాట ఆపమని అడిగినా మనం వింటేగా ....
నిజం చెబుతున్నాను, పొద్దున్నే మీగడ పెరుగు, చద్దన్నంతో ఎ ఆవకాయో, టమాటో పచ్చడో "పచ్చి/వూరగాయ", వుసిరికాయ పచ్చడో, గోంగూర పచ్చడో, నిమ్మకాయ పచ్చడో, సాంబారో, రసమో, పప్పో, బెండకాయ పులుసో, దోసకాయ కూరో, సొరకాయ పులుసో, ఆలుగడ్డ వేపుడో వేసుకొని తింటే "నా సామి రంగా" ఆ రుచి వర్ణణాతీతం....
కాలేజీ రోజుల్లో ఒక తమిళ్ వార్డెన్ వుండే వాడు, తను పెరుగు వేసుకున్నాకే వేరే కూరో, పులుసో, పచ్చడో వేసుక తినేవాడు, అది చూసి నాకు చాలా వింతగా అనిపించేది. నా అలవాట్లు ఈ దొరకు ఎలా అబ్బినాయో తెలియక తికమక పడుతూ ఆగబట్టలేక ఒక రోజు అయ్యోరిని అడిగేసాను, ఆయనో చిన్న నవ్వు నవ్వి, మా గ్యాంగ్ అంతా ఇలానే తింటాం. నీవోరకు నువ్వేదో కనిపెట్టా అనుకుటున్నావ్, ఇవన్నీ మీము ఎప్పుడో కనుగొన్నాం సార్ అన్నాడు, ఆ దెబ్బకు మైండ్ బ్లాక్ అయనట్టు గుర్తు.....
పులిహోరలో, నిమ్మరసం అన్నంలో పెరుగు అదుర్స్...
రాములోరి దయవల్ల ఇదిగో ఇవ్వాళ ఇలా నిమ్మరసం అన్నం పెరుగుతో తింటూ టపా రాస్తున్నాను...
మరికొన్ని విచిత్రాలు ...........

మీరు ఓసారి ట్రై (ఇంతకుముందు చెయ్యకపోతే) చేసి అనుభవం పంచుకోండి. మీకు తప్పక నచ్చి తీరుతుంది.......
మీరిలా పులిహోరలు, పెరుగు, ఆవకాయ అంటూ మమ్మల్ని ఊరించడమేమీ బాగోలేదండీ! ఇంతకీ ఇవన్నీ మీరే చేసారా?looks very appetizing!
రిప్లయితొలగించండిజలతారువెన్నెల గారు, నా టపాలపై మీ అమూల్యమయిన అభిప్రాయాలు క్రమం తప్పక తెలియజేస్తున్నదుకు ధన్యవాధాలు. వంట వార్పుల్లో నల, భీమలంత కాదు కాని, వంట బాగా చేస్తా అనే ఒక అతి నమ్మకం మాత్రం వుందండి. 18 years real time experience and counting. నిమ్మరసం అన్నం మా ఇల్లాలి చేతివంట. మిగతా విచిత్రాలు గూగుల్ చిత్రాలు. కాని అప్పుడప్పుడు ఇంట్లో ప్రయోగాలు చేస్తుంటాం. Richmond ఎప్పుడన్నా visit చేసేముందు చెప్పండి తప్పక మా చేతి వంట రుచి చూపిస్తాం.
తొలగించండిMy pleasure andi.Manam manam VA vallam annamaaTa. Nice to know!
తొలగించండిఇది ఏదో, మాది తెనాలి మీది తెనాలిలా వుందండీ. తెలియజేసినందుకు ధన్య్యవాదాలండి.
తొలగించండి