గాంధీ, నెహ్రూలకంటే మగాళ్లులేరా?
ఆగస్టు 15.. అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చింది.. ఇండియాకు... అది సాధించింది ఎవరు? ప్రతి ఆగస్టు 15న రాజకీయనాయకులు కానీ, అధికారులుకానీ, పుస్తకాల్లోగానీ.. గాంధీ, నెహ్రూ కుటుంబాలవారే తెచ్చారన్నట్లుగా ప్రచారం చేసేశారు. స్వాతంత్య్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు.. మన తాతలు, ముత్తాతలతో పాటు, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి, భగత్‌సింగ్. ఇలా ఎంతోమంది త్యాగఫలం మనం అనుభవిస్తున్నాం.
అలాంటిది... కేవలం రెండుకుటుంబాల వారే చేసినట్లుగా.. ప్రతి ఆగస్టు 15వ తేదీన నాయకులు.. తెల్లటిబట్టలు కట్టుకుని.. ఓ టోపీని కొనుక్కుని.. అది కూడా... అతని అసిస్టెంట్ కొంటే తెచ్చిపెట్టుకుంటారు. కానీ స్వంతంగా వెళ్ళి కొనరు... మన ఇంట్లో సంక్రాంతికి, ఇతర పండుగలకు పిండి వంటలు కొనుకున్నట్లు... రాజకీయనాయకులు టోపీలు కొనుక్కుని.. ఆరోజు తూతూమంత్రంగా కానిచ్చేస్తారు.. ఇది ఎంత దురుదృష్టకరం... అని సంచలన రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు.
పోసాని ముఖ్య అతిథిగా 'ఆగస్టు 15' అర్థరాత్రి 12 గంటలు' అనే చిత్రం ఆడియో వేడుకలో (సోమవారం, 14 నవంబర్ 2011) ఆదివారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన పై విధంగా మాట్లాడారు.

ఒక విషయం చెప్పాలి.గాంధీ,నెహ్రూలే కాదు;ఇంకా చాలామంది నాయకులూ ,సామాన్యప్రజలూ కూడా స్వతంత్రసమరంలో ,స్వరాజ్య సాధనలో పాల్గొన్నారని మా తరం వారికి తెలిసిందే.(నేతాజీ,మౌలానా అజాద్,రాజాజీ,ప్రకాశం,కృపలాని, జైప్రకాశ్ ,తిలక్,ఇంకా ఇంకా ఎందరో ) కాంగ్రెసేతరులు కూడా కొందరున్నారు.కాని ఒక యుద్ధంలో ఎందరు పాల్గొన్నా ,విజయం సాధిస్తే రాజుకీ ,ప్రధాన సైనికాధిపతికే ఎక్కువ పేరు వస్తుంది.ఇది సహజమే కదా.
రిప్లయితొలగించండి