‘పిట్ట’ కథ
మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చి అన్నం తింటున్నా. అప్పటికే ఆకలి నకనకలాడిపోతోంది. అమ్మేమో కంచంలో గోంగూర పచ్చడితో కలిపిన అన్నం తెచ్చిపెట్టింది. ఇంకేముంది... ఆత్రంగా మొదటి ముద్ద కలిపి నోట్లో పెట్టబోతుంటే టపీమని శబ్దం. ఒక్కసారిగా పక్కకు చూశా.
వెంటనే కంచం పక్కన పెట్టి పరుగెత్తుకుంటూ వెళ్లా. కచ్చితంగా చనిపోయి ఉంటుందనుకున్నా. జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని గట్టిగా ఊపిరి ఊదా. కానీ ఉలుకూ పలుకూ లేదు. కనీసం కదులుతున్నట్టు కూడా అనిపించలేదు.
పాపం వీళ్ల అమ్మ దీనికోసం మేత తేవడానికి ఎక్కడికి వెళ్లిందో. ఊరికే గూట్లో ఉండొచ్చు కదా! పుట్టి రెండు రోజులు కూడా కాలేదు. దీనికెందుకంత తొందర! అసలే పిట్ట ప్రాణం. పుటుక్కున చస్తే...!
పాపం ఆకలేసిందేమో. బయటికి రాబోయి కిందపడిపోయింది. ఎంత ముద్దుగా ఉందో. బతుకుతుందో లేదో. నా కళ్ల వెంట అనుకోకుండానే నీళ్లు వస్తున్నాయి. అరె... కదులుతోంది. ‘అమ్మా! ఇది బతికే ఉందే’ అని ఆనందంతో కేకవేశా. ‘ఆ! వస్తున్నా’ అంటూ అమ్మ చిన్న నిచ్చెన తెచ్చి వేసింది. నేను దబదబ పెకైక్కి మళ్లీ గూట్లో పడుకోబెట్టా.
ఇది మా గుడిసెలో రోజూ జరిగేదే. మా పూరింట్లో మాతోపాటు పిచ్చుకలూ ఉండేవి. మా అమ్మకు విసుగొచ్చినప్పుడల్లా ‘ఈ పిల్లలతోనే వేగలేక చస్తుంటే, మళ్లీ ఈ పిట్టల గొడవొకటి’ అని విసుక్కునేది. పిట్ట గూళ్లన్నీ తీసేద్దామా అంటే మాత్రం ‘పాపంరా. పోనిలే ఉండనీ’ అనేది. కొన్నాళ్లకి ఒక్కొక్కటి తగ్గుతూ వచ్చాయి. ‘ఏంటమ్మా! పిట్టలన్నీ ఎగిరిపోతున్నాయి.
మళ్లీ రావడం లేదు’ అని అడిగా. ‘రెక్కలొస్తే అంతేరా. దేని దారిన అవి ఎగిరిపోతాయి’ అంది.
అది నిజమేనని ఇప్పుడు అనిపిస్తోంది. బతుకు పోరులో నేనూ అమ్మకు దూరంగా ఉంటున్నా.
- నాగోజు సత్యనారాయణ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి