హుర్రే ...
హీరో కోసం వెతుకుతూ బయల్దేరాడు ఒక అభిమాని.
గోడల నిండా పోస్టర్లు. పోస్టర్ల నిండా యాక్టర్లు ఉన్నారు కాని హీరో మాత్రం కనబడలేదు.
ఒక చోట బోల్డన్ని ఆఫీసులు కనబడితే లోపలికెళ్లి చూశాడు.
క్యాబిన్ల నిండా కుర్చీలు. కుర్చీల నిండా అధికారులు ఉన్నారు కాని వారిలో ఎవరూ హీరోలా అనిపించలేదు అతనికి.
ఏదో అవార్డు సభ జరుగుతుంటే ఇక్కడ తప్పక దొరుకుతాడని స్టేజి దగ్గరకెళ్లి నిలబడ్డాడు.
వేదిక నిండా ఆసనాలు. ఆసనాల నిండా ప్రతిభావంతులు ఉన్నారు కాని ఎవరి మొహంలోనూ హీరో కళ లేదు.
రోడ్డు పక్కన షాపులో పేపర్లు వేలాడుతుంటే ఆగి ఓపిగ్గా అన్నిట్నీ తెరిచి చూశాడు.
కాగితాల నిండా అక్షరాలు. అక్షరాల నిండా విషయాలు ఉన్నాయి కాని హీరో మాట్లాడదగ్గ మాటలేవీ కనిపించలేదు.
బస్సులెక్కి దిగాడు. రైళ్లెక్కి తిరిగొచ్చాడు. విమానాలు ఎక్కే వాళ్లను దిగేవాళ్లను పరిశీలించాడు. ఊహూ. మచ్చుకు కూడా ఒక హీరో కనిపించలేదు.
హమ్మయ్య ... నా కంటే గొప్పవాళ్లెవరూ లేరు. అందరూ నా లాంటి వాళ్లే అని ఆనందంగా ఊపిరి పీల్చుకున్నాడు.
మనం ఏం ఆలోచించామో, మనకు ఏం తెలుసో, మన విశ్వాసాలు ఏమిటో - చివరి కొచ్చేసరికి అవేవీ ముఖ్యం కాదు - మనం ఏం చేశామన్నదే ముఖ్యం. - జాన్ రస్కిన్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి