భోజనం చేసే సమయంలో కూరల్లో కరివేపాకు కనిపిస్తే చాలు... తీసి పక్కనబెట్టేస్తుంటాం. మీరిలా చేస్తున్నారంటే.. తప్పకుండా ఈ కథనం చదవాల్సిందే. కూరల్లో కరివేపాకు పక్కనబెట్టడం ఇకపై చేయకండి. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.
భారతీయ వంటకాల్లో కరివేపాకు వాడటం పరిపాటి. అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో కరివేపాకు వాడకం పెరిగిపోతోంది. ఇందుకు కారణం కరివేపాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలే.
- కరివేపాకును తినడం ద్వారా కేశాలు మృదువు అవుతాయి.
- చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం పోవడాన్ని నివారిస్తుంది.
- మహిళలు గర్భం ధరించినపుడు కరివేపాకు పొడిని అన్నంలో గానీ, నిమ్మరసం లేదా జ్యూస్‌లో గానీ అర స్పూన్ వేసుకుని తాగితే వాంతులను నిరోధిస్తుంది. ఇంకేముంది..? ఇక కూరల్లో కరివేపాకు కనిపిస్తే అలాగే నమిలి మింగేస్తారు.. కదూ.
నాకు తెల్సి చాలామంది కరివేపాకు ను నూనెలో బాగా వేపుతారు, మాడ్చేయ్యమాకండి అలానే కరివేపాకును పక్కన పెట్టమాకండి.
కరివేపాకు అంటెనే పక్కకు తోసేసి తినడం అందరికి పరిపాటి.
రిప్లయితొలగించండికాని కరివేపాకు తినడం మంచిదన మాట. Thanks for sharing this info. కాని అంటారు కదా ఎప్పుడన్నా ఎవరన్న ఇద్దరు వాదించుకుంటున్నప్పుడు --"ఉప్మాలో కరివేపాకు లా నన్ను తీసిపారెయ్యకు" అని? అంటే చాలామంది కరివేపాకుని పక్కకు తీసేస్తారనమాట!
చాలామందికి ఎందుకో కరివేపాకు పక్కన పెట్టె అలవాటు, కచ్చితంగా కరివేపాకు వుపయోగం తెలియకపోవడంతో అలా చేస్తుంటారు అనుకుంటున్నా.
తొలగించండిబాగుందండీ! నేను ఇది తింటాను అయినా చదివేశా :) కరివేపాకు (Murraya koenigii) మీరు చెప్పినట్టు కేశాలకి చాలా మంచిదని తినడమే కాదు కొంతమంది నూనెలో గుంటకలగరాకుతో పాటు వేసి కాస్తారు. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. మన లివరు ఆరోగ్యంగా ఉండటానికీ, మన వయస్సు ఎక్కువగా తెలియనివ్వదు, మధుమేహానికీ కూడా ఇది చక్కని మందు.
రిప్లయితొలగించండి@ జలతారు వెన్నెల గారూ
కరివేపాకుకి ఎన్ని గుణాలున్నా మనకి ఎంత మంచి చేస్తున్నా దానిని ఎలా తీసి పారేస్తామో దాని ప్రయోజనాన్ని గుర్తించకుండా అలానే మనకి మంచి చెప్పే వాళ్ళని, మన లోపాలని సరిదిద్దే వాళ్ళని మనం పక్కన పెడతాము అని సింబాలిక్ గా అలా చెప్తారనుకుంటాను :)
రసజ్ఞ గారు, మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు. ఇన్ని మంచి గుణాలున్న కరివేపాకును, చాలామంది ఎందుకు పక్కకుపెడతారో తెలియదు. నాకు తెల్సి తినడానికి రుచికోడా బానేవుంటుంది.
తొలగించండిమీరు చెప్పినట్టు పోల్చి చెప్పడం మన పెద్దలకు అలవాటే కదా!!.
మనలో చాలా మందికి ఆకులు తినటం అలవాటు ఉండదు. అందుకని పక్కన పెడుతాము. నాకు తేలికగా తినగలిగేవి కరేపాకు కారప్పొడి, కరేపాకు చట్నీ. చిన్న చిన్న ముక్కలుగా చేసి కరేపాకు "కూర తిరగమాత" లో వేస్తే తిన వచ్చేమో. తిరగామాతలో వేసేటప్పుడు వచ్చే ఫ్లేవర్(వాసన) బ్రహ్మాండం.
రిప్లయితొలగించండి