Cast: Asin, Charmi, Prabhas
Music Director: Chakri
Director: Krishna Vamsi
Producer: Shivaraju G, Venkata Raju C
Lyrics: సిరివెన్నెల
Year: 2005
Music Director: Chakri
Director: Krishna Vamsi
Producer: Shivaraju G, Venkata Raju C
Lyrics: సిరివెన్నెల
Year: 2005
పాట : జగమంత కుటుంబం నాది
పాడినవారు: శ్రీ
సిరివెన్నెల గారి మాటల్లో (తప్పక వినాల్సిన/చూడాల్సిన మాటలు/వీడియో), సిరివెన్నెల గారు కొన్ని చరణాలు పాడారు, వింటే చాలు జీవితం ధన్యం ....
పాట చరణాలు..........
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే
సన్యాసం శూన్యం నాదే
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయ గీతాల
కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ
నాలో నేను అనుభ్రమిస్తూ
ఒంటరినై అనవరతం ఉంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని
కావ్య కన్నెల్ని ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ
నాతో నేనే అనుక్రమిస్తూ
ఒంటరినై ప్రతి నిమిషం
కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల
హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల
చలనాల కనరాని గమ్యాన్ని
కాలాన్ని ఇంద్రజాలాన్ని
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
రాం గారు, రోజు ఉదయాన వర్క్ కి డ్రైవ్ చేస్తూ నేను వినేది సిరివెన్నెల పాటలే!
రిప్లయితొలగించండిఒక్కొక్క పాట ఒక్కొ ఆణిముత్యమే కదా. నాకు మీరు పోస్ట్ చేసిన పాట, ఇంకా "గమ్యం" సినిమా లో "ఎంతవరకు" పాట చాలా ఇష్టం. "నీ నవ్వు చెప్పింది నాతో" పాట ఎక్కడికో మనల్ని తీసుకెళ్ళిపోతుంది. Idlebrain.com లో ఎప్పుడో కొన్నిyears back సిరివెన్నెల గారి biography కొన్ని parts lo వచ్చింది. ఎన్నోసార్లు ఈ మధ్య కాలంలో వెతికాnu అవి మళ్ళీ చదువుదామని.. దొరకలేదు లింక్స్. కాని సిరివెన్నెల అభిమానులందరు చదవాలి ఆ biography. Thanks for reminding this on this beautiful friday and long weekend. Have a great weekend!
జలతారువెన్నెల గారు, ముందుగా Thanks a bunch అండి. Let me try to find listed sirivennela Biography links. If you find those links, Plz do share అండి. ఈ మధ్య నీను ఎప్పుడు మంచి వీడియో కాని ఆర్టికల్ కాని కనిపిస్తే తప్పక డౌన్లోడ్/సేవ్ చేస్తున్నాను. మరో సారి వెబ్ వెతక్కుండా.
తొలగించండిసిరివెన్నెల గారి గురించి అస్సలు నీను ఏమి రాయలేను (నీనో పిల్ల కాకి), మహానుభావులు అలా జనాలను అలరిస్తూనే వుంటారు.......
నాదగ్గర సిరివెన్నెల గారు రాసిన పాటల మూట ఒకటి వుంది, మీరు చెప్పినట్లు అవి వింటూ ఆ స్వరాలకు మనస్సులో నమస్కరించుకోవడమే.... కాని కొన్ని చరణాలు ఎన్ని సార్లు విన్నా రోమాలు కచ్చితంగా నిక్కపోడవటం ఖాయం.....
'జగమంత కుటుంబం నాది ' కు నేనొక విశ్లేషణ వ్రాయడం జరిగినది , మీకు వీలయితే ఈ పోష్టు చూడండి
రిప్లయితొలగించండిhttp://tatayyakala.blogspot.co.uk/2009/10/blog-post_21.html
మురళి గారు, ప్రతీ చరణాన్ని చక్కగా వివరించారు. keep it up sir. Thanks for visiting my blog page.
తొలగించండి