28, మే 2012, సోమవారం

కరివేపాకులో ఎన్ని ఔషధగుణాలున్నాయో మీకు తెలుసా!?




భోజనం చేసే సమయంలో కూరల్లో కరివేపాకు కనిపిస్తే చాలు... తీసి పక్కనబెట్టేస్తుంటాం. మీరిలా చేస్తున్నారంటే.. తప్పకుండా ఈ కథనం చదవాల్సిందే. కూరల్లో కరివేపాకు పక్కనబెట్టడం ఇకపై చేయకండి. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. 

భారతీయ వంటకాల్లో కరివేపాకు వాడటం పరిపాటి. అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో కరివేపాకు వాడకం పెరిగిపోతోంది. ఇందుకు కారణం కరివేపాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలే.

కరివేపాకును తినడం ద్వారా కేశాలు మృదువు అవుతాయి. 
చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం పోవడాన్ని నివారిస్తుంది. 
మహిళలు గర్భం ధరించినపుడు కరివేపాకు పొడిని అన్నంలో గానీ, నిమ్మరసం లేదా జ్యూస్‌లో గానీ అర స్పూన్ వేసుకుని తాగితే వాంతులను నిరోధిస్తుంది. ఇంకేముంది..? ఇక కూరల్లో కరివేపాకు కనిపిస్తే అలాగే నమిలి మింగేస్తారు.. కదూ.


నాకు తెల్సి చాలామంది కరివేపాకు ను నూనెలో బాగా వేపుతారు, మాడ్చేయ్యమాకండి అలానే కరివేపాకును  పక్కన పెట్టమాకండి.

25, మే 2012, శుక్రవారం

జగమంత కుటుంబం నాది (సినిమా: చక్రం, సిరివెన్నెల పాటలు)

Cast: AsinCharmiPrabhas
Music Director: Chakri
Director: Krishna Vamsi
Producer: Shivaraju GVenkata Raju C
Lyrics: సిరివెన్నెల 
Year: 2005
సినిమా: చక్రం
పాట : జగమంత కుటుంబం నాది
పాడినవారు: శ్రీ
సిరివెన్నెల గారి మాటల్లో (తప్పక వినాల్సిన/చూడాల్సిన మాటలు/వీడియో), సిరివెన్నెల గారు కొన్ని చరణాలు పాడారు, వింటే చాలు జీవితం ధన్యం ....



పాట చరణాలు..........

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

సంసార సాగరం నాదే
సన్యాసం శూన్యం నాదే

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై

మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో

పన్నీటి జయ గీతాల
కన్నీటి జలపాతాల

నాతో నేను అనుగమిస్తూ
నాలో నేను అనుభ్రమిస్తూ

ఒంటరినై అనవరతం ఉంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని
కావ్య కన్నెల్ని ఆడపిల్లల్ని

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై

నాతో నేను సహగమిస్తూ
నాతో నేనే అనుక్రమిస్తూ

ఒంటరినై ప్రతి నిమిషం
కంటున్నాను నిరంతరం

కిరణాల్ని కిరణాల
హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల
చలనాల కనరాని గమ్యాన్ని
కాలాన్ని ఇంద్రజాలాన్ని

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

3, మే 2012, గురువారం

నిజాన్ని ఇలా నవ్విస్తూ చెప్పొచు....

నిజాన్ని ఇలా నవ్విస్తూ కోడా చెప్పొచు .... (2G, CWG and Madam G )

Hats Off నితిన్  గుప్తా....

వీడియో చివరివోరకు చూడండి..........

2, మే 2012, బుధవారం

దోచుకున్నవారికి దోచుకున్నంత..........

మన రాజకీయ నాయకులకన్నాఈ కోతి మూక చాలా నయం... ఇవి తిండి కోసం దోపిడి చేస్తున్నవి. మన రాజకీయనాయకులు దాచుకోవడానికి దోపిడి చేస్తున్నారు.............



1, మే 2012, మంగళవారం

డబ్బున్న మాఫియా చేయగల పని

ఇది దావూద్ కూతురి పెళ్లి ఫోటో (వరుడు మియాన్ దాద్ కొడుకు). ఆ బంగారం, వజ్రాలు, కెంపులు అన్నీ సగటు బారతీయులు ప్రాణాల ఖరీదు (లెక్క అన్నా తెలుసో లేదో ).......