కెసినోలు... కలియుగ మయసభలు
షేర్ మార్కెట్లు, కెసినోల్లోకి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరూ కచ్చితంగా డబ్బులతో తిరిగి వస్తామనుకుంటారు. అయితే, సర్వే రిపోర్టులు మాత్రం దానికి ప్రతికూలంగా వస్తున్నాయి. ఏం, కేసినోల్లో డబ్బు రాదా అంటే వస్తుంది. అయితే, సగటు లెక్కల ప్రకారం చూస్తే మాత్రం డబ్బు పోతుంది. అదెలా అంటే అందులో ఓడిపోయిన వాడు ఎలాగూ ఓడిపోతాడు. సరే, గెలిచిన వాడు కాన్ఫిడెన్సు పెరిగి ‘ఇప్పుడు వచ్చిన డబ్బు మళ్లీ రాదా’ అని గెలిచిన డబ్బును మళ్లీ అందులోనే పెట్టి ఆడతాడు. చివరకు ఖాళీ జేబులతో తిరిగొస్తారు. అందుకే కెసినోలను ‘కలియుగ మయసభలు’ అంటారు.
మనదేశంలో కెసినోలు ఇంకా విస్తృతంగా రాకపోయినా పర్యాటక కేంద్రాల్లో, ముఖ్యంగా గోవాలో బాగా ఎక్కువ. వీటిలో ప్రవేశించడానికి నిర్దేశిత రుసుము చెల్లించాలి. చాలా వాటిలో మందు, భోజనం ఉచితం. ఇది లోకాన్ని మరిచిపోవడానికి వారి ట్రిక్స్ ఒకటి. అంతేకాదు, టైం తెలియకుండా ఉండడానికి అక్కడ కిటీకీలు గాని, వాచీలు గాని ఉండనివ్వరు. పగలేదో, రాత్రేదో అర్థం కాదు. తిన్నంత తినొచ్చు. డబ్బులున్నంతసేపు ఆడొచ్చు.
లాజిక్‌లకు కూడా అంత సులువుగా అందని ఈ ఆటల వెనుక మర్మాలు అర్థం కావు, అర్థమయ్యే సమయానికి మనవద్ద డబ్బులుండవు. హై లాజిక్‌తో ఏర్పాటుచేసిన ఆ గేములన్నీ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుంటాయి. అందుకే ఏదో ఒకటి ఆడి వద్దాంలే అనుకున్నవాళ్లు ఆపకుండా ఒకదాని తర్వాత ఒకటి ఆడుకుంటూ పోతారు. జేబు పూర్తిగా ఖాళీ అయితే గాని సత్యం బోధపడదు. డబ్బులు వస్తూ పోతూ ఉండటం వల్ల పూర్తిగా డబ్బులు అయిపోయే దాకా మనం లూజర్స్ అన్న విషయాన్ని మనసు అంగీకరించదు. ఎందుకంటే చివరి క్షణంలో అయినా మన డబ్బు మనకు రావచ్చన్న ఆశే.
కెసినోల్లో వాడే కొన్ని ట్రిక్స్
డబ్బు రూపంలో కాకుండా పందాలు చిప్స్ రూపంలో మాత్రమే వాడతారు. దానివల్ల మనకు డబ్బు ఎంత పోతుందీ, వస్తుందీ వెంటనే తెలిసిరాదు.
గ్యాంబ్లర్స్, గేమింగ్ మెషిన్లు అన్నీ ఫాస్టే. విపరీతమైన హడావుడి. ఇదంతా కనీసం ఆలోచించే టైమ్‌ను కూడా ఇవ్వదు.
కెసినోల్లో మందు, భోజనం ఉచితం. ఎందుకంటే మీకు ఆకలిని తెలియనివ్వరు. బుధ్దిని పనిచేయనివ్వరు. అప్పుడే కదా మీరు బాగా ఆడగలరు.
|
|
|
|
|
మనీమాన్వితం
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికావు కండల్లో ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం
|
|
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి