After 27 years మన సమాజం దిగాజారిందే కాని, ఏమి నేర్చుకున్నట్లు కనబడటం లేదు.
రాసినవారు: వేటూరి గారు
సంగీతం: చక్రవర్తి గారు
నేపధ్య గానం: గాన కోకిల గారు
చిత్రం: ప్రతిఘటన (1986)
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం ఆరవ వేదం.
మానభంగ పర్వంలో....మాత్రు హ్రుదయ నిర్వేదం..నిర్వేదం
పుడుతూనే పాలకేడ్చీ, పుట్టీ జంపాలకేడ్చీ,
పెరిగి పెద్ద కాగానే, ముద్దూ మురిపాల కేడ్చీ,
తనువంతా దోచుకున్న తనయులు మీరూ,
మగసిరితో బ్రతకలేక కీచకులై,కుటిల కామ నీచకులై,
స్త్రీ జాతిని అవమానిస్తే???
మీ అమ్మల స్తన్యంతో, మీ అక్కల రక్తంతో,
రంగరించి రాస్తున్నా ఈనాడె మీకొసం,
మరో మహాభారతం ఆరవ వేదం.
మానభంగ పర్వంలో....మాత్రు హ్రుదయ నిర్వేదం..నిర్వేదం
కన్న మహా పాపానికి ఆడది తల్లిగ మారీ,నీ కండలు పెంచినది (ఈ) గుండెలతో కాదా?
ఏర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా?
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర,ఏనాడొ మీరుంచిన లేత పెదవి ముద్రా?
ప్రతి భారత సతి మానం చంద్రమతి మాంగల్యం,మర్మ స్థానం కాదది నీ జన్మ స్థానం!!
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం !!
శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే,
మానవ రుపంలోనే దానవులై పేరిగితే,
సభ్యతకి సంస్క్రుతికి సమాధులే కడితే,
కన్నులుండీ చూడలేని ద్రుతరాష్ట్రుల పాలనలో,
భర్తలుండీ విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో,
నవశక్తులు యువ శక్తులు నిర్వీర్యం అవుతుంటే,
ఏమైపోతుందీ సభ్య సమాజం,ఏమైపొతుంది మానవ ధర్మం,
ఏమైపోతుందీ ఈ భారత దేశం,
మన భారత దేశం, మన భారత దేశం......

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి