ఒకప్పుడు తను ధర్నా అని పిలిస్తే సగం రాష్ట్రము తగలబడి పోయి, పది మంది హరీ అనేస్తే Mr తెలంగాణా నయా తుగ్లక్ ఎంతో సంతోసించేవాడు.
ఇప్పుడు సామాన్యుడు ఎక్కడ అప్పు తీరక, మళ్లీ అప్పు పుట్టక ఎలా పూట గడపాలో తెలియక ఆక్రోశం తో ధర్నా చేస్తే అది మాత్రం ఏదో కొంపలు తగల పడి పోతున్న ఫీలింగ్ లో వున్నాడు. అవును లే మన కొంపలో ముగ్గురు మంత్రులు (ముఖ్య 'ముక్కు' తో సహా) ఒక MP . మన కడుపు నిండింది గా !! సామాన్యుడు బతికితే ఎంత ? చస్తే ఎంత ?
తనకు తెలియకుండా మంత్రి చేసాడు అనడం, పత్రికలు ఏదో రాసాయి అనడం ఈ నయా చిరంజీవికే చెల్లింది.
నీవు నేర్పిన విద్యే నీరజాక్ష.......
Webdunia news page link (Copy content below)

కొంపలు తగలబడ్డాయా.. దిష్టిబొమ్మలు తగలేస్తున్నారు : కేసీఆర్
తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి పట్టుమని పది రోజులు కూడా కాలేదని, ఇంతలోనే ఏవో కొంపలు తగలబడినట్టు తన దిష్టిబొమ్మలు తగలేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఒక మంత్రి తెలిసో తెలియకో ప్రకటన చేశారని, దీనిపై నానా యాగిరి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. దీనికి భారత రిజర్వు బ్యాంకు అనుమతి కావాలన్నారు. రుణమాఫీ ప్రక్రియను 10 -15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రుణమాఫీ కాలపరిమితిపై మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి కేవలం నాలుగు రోజులే అయిందని, దానికే ఏవో కొంపలు మునిగిపోయినట్టు దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని, అది మంచి పద్దతికాదని కేసీఆర్ హితవు పలికారు. ఇతర పార్టీల నేతల మాటలు నమ్మవద్దని కేసీఆర్ సూచించారు.తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి పట్టుమని పది రోజులు కూడా కాలేదని, ఇంతలోనే ఏవో కొంపలు తగలబడినట్టు తన దిష్టిబొమ్మలు తగలేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఒక మంత్రి తెలిసో తెలియకో ప్రకటన చేశారని, దీనిపై నానా యాగిరి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. దీనికి భారత రిజర్వు బ్యాంకు అనుమతి కావాలన్నారు. రుణమాఫీ ప్రక్రియను 10 -15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రుణమాఫీ కాలపరిమితిపై మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి కేవలం నాలుగు రోజులే అయిందని, దానికే ఏవో కొంపలు మునిగిపోయినట్టు దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని, అది మంచి పద్దతికాదని కేసీఆర్ హితవు పలికారు. ఇతర పార్టీల నేతల మాటలు నమ్మవద్దని కేసీఆర్ సూచించారు.