30, ఏప్రిల్ 2012, సోమవారం

29, ఏప్రిల్ 2012, ఆదివారం

అమ్మలకు వందనాలు

ప్రపంచంలో కష్టంతో కూడిన పని, ఇష్టంతో చేసే  పని.....  



Thanks P&G and Youtube....

28, ఏప్రిల్ 2012, శనివారం

24, ఏప్రిల్ 2012, మంగళవారం

సాహస వీరుడు (Dean S Potter)

ఈ మధ్య మన సినిమాలలో చేస్తున్న గారడీలలో కొంతవోరకు ఐనా నిజం లేదు కాని.... Dean S Potter విన్యాసాలు చూడండి.......

వీరుని సాహసానికి మచ్చుతునక .... ఈ మధ్యే China లో .......


వీరుని గురించి
National Geographic Society......
Beyond the Edge: Fly or Die: Dean Potter 
  

మరికొన్ని సాహసాల వీడియో .....


మరిన్ని వివరాలకోసం ....
http://deanspotter.com/


23, ఏప్రిల్ 2012, సోమవారం

అందమైన సముద్రపుజీవుల చిత్రాలు

యాహూ న్యూస్ లింక్


Award-winning sea creature photos

More than 700 images were submitted for this year's underwater photography contest, put on annually by the University of Miami Rosenstiel School of Marine & Atmospheric Science. Ximena Olds' photo of the headshield sea slug against a brilliant background of green seagrass took home the "best overall" award. Olds is a local Key Biscayne, Fla., resident.



ఏమి అందం ....
Sea creatures

ఇదే మా ప్రపంచం.......
Sea creatures

అందమైన ఇల్లు అందు ప్రేమ జంట......

Sea creatures


ఒంటరి మహారాజ్....
Sea creatures


20, ఏప్రిల్ 2012, శుక్రవారం

మీ ప్రపంచాన్ని తిప్పేసే గొప్ప చెక్క బొమ్మల వీడియోలు

ఇవన్నీ ఎంతో వొపిక, సహనం మరియు కళానైపుణ్యం తోనే సాద్యం....

మాయల దేవత చెక్క బొమ్మ




మాయల దేవత చెక్క బొమ్మ (వర్షంలో పాడుతూ)




డిసెంబర్లో

12, ఏప్రిల్ 2012, గురువారం

ఆధార్ కార్డ్.. కోతిమీర్ కట్ట సన్ ఆఫ్ పలావ్ ఊరు గోంగూర కట్ట


Reference: Webdunia News Link 


ఇప్పటివరకూ ఓటరు గుర్తింపు కార్డులో పేర్లు మార్పు వేస్తూ తమాషా జరుగుతుండేది. తాజాగా అలాంటి వ్యవహారం ఆధార్ కార్డుకు కూడా పాకింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆధార్ కార్డు జోక్‌గా మారుతోంది. 

తాజాగా ఓ ఆధార్ కార్డు చిరునామా చూసిన జనం పగలబడి నవ్వుతున్నారు. కారణం ఏంటయా.. అంటే ఆ కార్డుపై అడ్రెస్.. కొతిమీర్ కట్ట సన్ ఆఫ్ పలావ్.. ఊరు గోంగూర తోట, అంటూ అనంతపురం జిల్లా పేరుతో ఓ సెల్ ఫోన్ ఫోటోను కూడా జోడించడం అధికారుల పనితీరును అద్దం పడుతోంది.
ఆధార్ కార్డ్ తయారీ వ్యవహారం కొతిమీర్ కట్ట.. గోంగూర తోటలానే ఉందని ఎద్దేవా చేస్తున్నారు ఈ వ్యవహారాన్ని చూసిన జనం.

8, ఏప్రిల్ 2012, ఆదివారం

అన్నమో రామచంద్రా, పెరుగన్నమో రామచంద్రా

(అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలున్న దయచేసి మన్నించండి)
ఇది నా బాల్య స్మృతి, ఎందుకో టపా రాయాలనిపించింది. చిన్నప్పుడు ఇంట్లో పెరుగు కుండ నిండుగా వుండేది. రోజుకు మూడు సార్లు పెరుగన్నం తిన్నా ఇంకా తినాలనిపించేది.
పొద్దున్నే లేవగానే నీను ప్రతీ రోజు "అన్నమో రామచంద్రా, పెరుగన్నమో రామచంద్రా" అనే పాట అందుకునే వాడిని, మా అమ్మ కోపంతో రోజు మమ్ముల్ని నీ ఆకలి కేకలతో వేధించడం దేనికి నువ్వు తింటే ఎవరన్నా వోద్ధన్నారా !... వెళ్ళి కావాల్సినంత తిను అంటూ, చూస్తా వుండరా నీకు అన్నీ వున్నా పెరుగన్నం మాత్రం దొరకదేమో చూడు అని పాట ఆపమని అడిగినా మనం వింటేగా ....

నిజం చెబుతున్నాను, పొద్దున్నే మీగడ పెరుగు, చద్దన్నంతో ఎ ఆవకాయో, టమాటో పచ్చడో "పచ్చి/వూరగాయ", వుసిరికాయ పచ్చడో, గోంగూర పచ్చడో, నిమ్మకాయ పచ్చడో, సాంబారో, రసమో, పప్పో, బెండకాయ పులుసో, దోసకాయ కూరో, సొరకాయ పులుసో, ఆలుగడ్డ వేపుడో వేసుకొని తింటే "నా సామి రంగా" ఆ రుచి వర్ణణాతీతం....

కాలేజీ రోజుల్లో ఒక తమిళ్ వార్డెన్ వుండే వాడు, తను పెరుగు వేసుకున్నాకే వేరే కూరో, పులుసో, పచ్చడో వేసుక తినేవాడు, అది చూసి నాకు చాలా వింతగా అనిపించేది. నా అలవాట్లు ఈ దొరకు ఎలా అబ్బినాయో తెలియక తికమక పడుతూ ఆగబట్టలేక ఒక రోజు అయ్యోరిని అడిగేసాను, ఆయనో చిన్న నవ్వు నవ్వి, మా గ్యాంగ్ అంతా ఇలానే తింటాం. నీవోరకు నువ్వేదో కనిపెట్టా అనుకుటున్నావ్, ఇవన్నీ మీము ఎప్పుడో కనుగొన్నాం సార్ అన్నాడు, ఆ దెబ్బకు మైండ్ బ్లాక్ అయనట్టు  గుర్తు.....

పులిహోరలో, నిమ్మరసం అన్నంలో పెరుగు అదుర్స్...

రాములోరి దయవల్ల ఇదిగో ఇవ్వాళ ఇలా నిమ్మరసం అన్నం పెరుగుతో తింటూ టపా రాస్తున్నాను...



మరికొన్ని విచిత్రాలు ...........






మీరు ఓసారి ట్రై (ఇంతకుముందు చెయ్యకపోతే)  చేసి అనుభవం పంచుకోండి. మీకు తప్పక నచ్చి తీరుతుంది.......